Tuesday, September 29, 2026
More
    HomeAndhrapradeshQdenga Dengue Vaccine India : బిగ్ బ్రేకింగ్, డెంగ్యూ భయాలకు ఇక చెక్, భారత్‌లోకి...

    Qdenga Dengue Vaccine India : బిగ్ బ్రేకింగ్, డెంగ్యూ భయాలకు ఇక చెక్, భారత్‌లోకి వచ్చేసింది ఫస్ట్ సూపర్ వ్యాక్సిన్ క్యూడెంగా

    📰 Generate e-Paper Clip

    Qdenga Dengue Vaccine India : ప్రజా దీవెన, హైదరా బాద్: ప్రతి వర్షాకాలం వచ్చిందంటే చాలు… జ్వరం పేరు విం టేనే గుండెల్లో రైళ్లు పరిగెడుతాయి. ఆసుపత్రుల చుట్టూ తి రగడం, ప్లేట్‌లెట్ల కౌం ట్ చూసుకుంటూ భయపడటం మన దేశంలో ఏటా చూసే దృశ్య మే. కానీ, ఇకపై ఆ డెంగ్యూ రాక్ష సుడికి కాలం చెల్లినట్లే! భారత వైద్య రంగంలో ఒక సంచల నాత్మక పరిణామం చోటుచేసు కుం ది. దేశంలోనే తొలి డెం గ్యూ నివా రణ టీకా క్యూడెంగా (QDENG A) క్యూడెంగాకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) పచ్చజెండా ఊపింది. డెంగ్యూను ఎదుర్కోవడంలో ఈ వ్యాక్సిన్ ఎందు కు ఒక గేమ్ చేంజర్? దీని విశేషాలేంటో చూద్దాం.

        ఈ టీకా అంత స్పెషల్ ఎందుకంటే

    గతంలో వచ్చిన డెంగ్యూ టీకాల కు చాలా నిబంధనలు ఉండేవి. కానీ ‘క్యూడెంగా’ విషయంలో ఆ తలనొప్పులేవీ లేవు.పరీక్షల తి ప్పలు లేవు, ఈ టీకా వేసుకోవ డానికి ముం దు డెంగ్యూ టెస్ట్ చే యించుకోవాల్సిన అవసరం లేదు. మీ కు గతంలో డెంగ్యూ వచ్చినా… లేదా ఎప్పుడూ రాక పో యినా ప్రశాంతంగా ఈ టీకా తీసుకోవచ్చని వైద్య నిపు ణు లు చెబుతున్నారు.

          ఎవరికి ఇస్తారో తెలుసా 

    4 సంవత్సరాల పిల్లల నుంచి 60 ఏళ్ల పెద్దల వరకు అందరి కీ ఇది సురక్షితమని వైద్య శాస్త్రం అంటు న్నది. చర్మం కింద ఇంజెక్షన్ రూ పంలో ఈ టీకా ఇస్తారు. మొదటి డోస్ తీసుకు న్న 3 నెలల తర్వా త రెండో డోస్ వేయించుకుంటే పూర్తి స్థాయి రక్షణ లభిస్తుంది.

    జపాన్ టెక్నాలజీ… తిరుగులేని రిజల్ట్స్

    జపాన్‌కు చెందిన ప్రముఖ ఔషధ సంస్థ ‘టకేడా’ (Takeda) ఈ వ్యాక్సిన్‌ను ఎంతో పరిశోధించి అభివృద్ధి చేసింది. దాదా పు 28, 000 మందిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించి దీని స త్తా ఏంటో ని రూపించారు. రెండో డోస్ తీసు కున్న ఏడాదికి డెంగ్యూ రాకుండా చూడటంలో 80.2% ప్రభావవంతంగా ప నిచేసింది. అదే సమ యంలో డెంగ్యూ వల్ల ఆసుపత్రి పాల య్యే ప్రమాదాన్ని ఏకంగా 90% పైగా తగ్గించింది. ఇక 4.5 ఏళ్ల సుదీర్ఘ పరిశోధనల్లోనూ ఆ సుపత్రి చేరికలను 84.1% తగ్గిం చినట్లు తేలగా డెంగ్యూ వైరస్‌ లోని నాలుగు రకాల (Seroty pes) పైన ఇది ఒకేసారి సమర్థ వంతంగా పోరా డుతుంది.

        ప్రపంచం మెచ్చిన ‘క్యూడెంగా’

    ప్రపంచ డెంగ్యూ భారంలో దాదా పు మూడింట ఒక వంతు కేసు లు ఒక్క భారతదేశంలోనే న మో దవుతున్నాయి. 20 25లోనే లక్ష కు పైగా కేసులు నమోద య్యా యంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అం దుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ (WH O) కూడా ఈ టీకాకు రెడ్ కార్పెట్ పరి చింది. ఇప్పటికే బ్రెజిల్, ఇండోనేషియా, అర్జెంటీనాతో స హా 43 దేశాల్లో 3.2 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయి విజ యవంతంగా పనిచేస్తున్నాయి. ఇ ప్పుడు భారత్ కూడా ఈ జాబి తాలో చేరడం దేశ ప్రజలకు పెద్ద ఊరట.

    టీకా ఓకే…కానీ ఈ జాగ్రత్తలు మరిచిపోవద్దు!

    వ్యాక్సిన్ మనకు కొండంత అభ యాన్ని ఇస్తున్నప్పటికీ, ప్రా థమిక జాగ్రత్తలను నిర్లక్ష్యం చేయవద్దని వైద్యులు హెచ్చరి స్తున్నారు. పరి సరాల్లో దోమలు వృద్ధి చెందకుం డా చూసు కోండి.ఫుల్ హాండ్స్ దు స్తులు, దోమతెరలు, మస్కిటో రిపె ల్లెంట్లను ఉపయోగించండి. తీవ్రమైన జ్వరం, బాడీ పెయి న్స్, ప్లేట్‌లెట్లు తగ్గడం వంటి లక్షణా లు కనిపిస్తే వెంటనే డా క్టర్‌ను సం ప్రదించండి.క్యూడెంగా రాకతో డెంగ్యూ రహిత భారత్ దిశగా మనం ఒక పెద్ద అడుగు వేశామనే చెప్ప వ చ్చు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.