Srishailam ghatroad hugetroficjam ప్రజా దీవెన, శ్రీశై లం ప్రాజెక్ట్ సాధారణ వీకెండ్ ట్రిప్ కాస్తా ప్రయాణికులకు ఒక పీడకలగా మారిపోయిం ది. శ్రీశైలం జలాశయం మలుపు డ్యామ్ వ్యూ పాయింట్ వద్ద ఊహించని ప్రమాదం ఒకటి భారీ ట్రాఫిక్ గందరగోళానికి దారితీసింది.
ట్రాఫిక్ జామ్ కు సంబంధించి పూర్వాపరాలు ఇలా ఉన్నా యి. ఒక లగ్జరీ టూరిస్ట్ బస్సు డ్యామ్ మ లుపు వద్ద యూ-టర్న్ తీసుకునే ప్రయత్నంలో పక్కనే ఉన్న మెత్తటి మట్టిలో కూరుకుపోయింది. డ్రైవ ర్ ఎంత ప్రయత్నించినా ఆ భారీ వాహనం ఇంచ్ కూడా కదలకుండా రోడ్డుకు అడ్డంగా నిలిచి పోయింది. ఘాట్ రోడ్డు కావడం, ప్రత్యామ్నాయ మార్గం లేక పోవడంతో క్షణాల వ్యవధిలోనే పరిస్థితి చేజారిపోయింది.
రెండు వైపులా ‘రెడ్ అలర్ట్’
బస్సు రోడ్డుకు క్రాస్‌గా ఇరుక్కుపో వడంతో అటు దోమల పెంట వైపు, ఇటు సుండిపెంట వైపు వెళ్లే ట్రాఫిక్ పూర్తిగా స్తం భించిపోయింది. ఇది సుమారు 5 కిలోమీటర్లు వందలాది వాహనాలు, వేల మంది ప్రయా ణికులు ఘాట్ రోడ్డుపైనే చి క్కుకు పోయారు.
ప్రస్తుతం సుండిపెంట, దోమలపెంట వైపు వెళ్లే ప్రయాణికు లు తమ ప్రయాణాన్ని కాస్త వాయిదా వేసుకోవడం మంచిద ని పోలీసులు తెలియజేస్తున్నారు. కంట్రోల్ రూమ్ సిబ్బంది భారీ క్రేన్ల సహాయంతో బ స్సును తొలగించేందుకు ప్రయత్ని స్తున్నారు. ఈ రూట్ క్లియర్ అవ్వ డానికి మరో రెండు గంట ల సమయం పట్టే అవకాశం ఉందని అధికారిక వర్గాలు వెల్ల డిస్తున్నాయి.


