Suryapet district Brutal murder : ప్రజా దీవెన, సూ ర్యాపేట: సూర్యాపేట జిల్లా మరో దారుణా నికి వేదిక అయింది. సూర్యాపేట మండలం సోలిపేట గ్రామం ఒక్కసా రిగా ఉలిక్కిపడింది. పచ్చని పొలాలు సాక్షి గా సాగుతున్న ఒక నిగూఢ పగ, చివరకు ఒకరి ప్రాణాన్ని బలి తీసుకుంది. దశాబ్దాలుగా నలిగిన భూ వివాదం సోమవారం రాత్రి వేళ కి రాతక హత్యగా మారి స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిం చింది. 50 ఏళ్ల మేకల జయరాములు అనే రైతు తోడబు ట్టినోళ్ల చేతిలోనే దారుణంగా నరికి చంపబడ్డారు.
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఈదా రుణానికి వెనుక ఉన్న ఫ్లాష్‌బ్యాక్ చూస్తే.. జ యరాములు కు నలుగురు అన్నదమ్ములు ఉన్నారు. అందులో సోద రు డు కృష్ణయ్యతో జయరాములకు వ్యవసాయ భూమి విష యంలో కొన్నేళ్లుగా పచ్చగడ్డి వేస్తే భగ్గు మనేలా వివాదం న డుస్తోంది. అయితే, ఇటీవల కృష్ణయ్య కుమారుడు వివాదా స్పద పొలంలోబోర్ వేయించడంతో ఈ కుటుంబ కల హం క్లైమాక్స్ కు చేరింది. ఆ బోర్ బావి వారి మధ్య పగల బావిగా మారింది. పంచాయితీలు జరిగినా సద్దుమణగని క్రోధం లో లోపల రగులుతూనే ఉంది.
అయితే సోమవారం చీకటి పడ్డాక ఆ పగకాస్తా కట్టలు తెం చుకుంది. ఆగ్రహంతో ఊగిపోయిన ప్రత్యర్థులు జయరాము లును ఒంటరిగా దొరకబుచ్చుకున్నారు. గ్రామస్తుల కథనం ప్రకారం నిందితులు కత్తుల తో జయరాములుపై విచక్షణా రహితంగా దాడి చేశారు. తప్పించుకు నే లోపే కిరాతకంగా నరికి చంపేసి, అక్కడ నుండి పరారయ్యారు. “దేశాన్ని కాపా డాల్సిన జవానే.. నా భర్తను కాటేశాడని ఘటనపై మృతు డి భార్య కన్నీరుమున్నీరవుతూ సంచలన ఆరోపణలు చేశా రు.
ఈ దారుణ హత్య వెనుక ఉన్న ప్ర ధాన నిందితుడు మరెవ రో కాదు.. దేశ రక్షణలో ఉండాల్సిన ఒక సీ ఆ ర్పీఎఫ్ (CR PF) కానిస్టేబుల్ అని ఆమె ఆరోపించారు. భూ తగాదా లే తన భర్తను బలితీసుకున్నాయ ని ఆమె రోదించిన తీరు స్థా నికుల ను కంటతడి పెట్టించింది.ఇదిలా ఉండగా ఘోరం జ రిగిన వెంటనే సూర్యాపేట రూరల్ ఎస్సై బాలు నాయక్ త న బృందంతో సం ఘట నా స్థలానికి చేరుకున్నారు.
రక్తపు మడుగులో ఉన్న జయరా ములు మృతదేహాన్ని పరి శీలించి, వివరాలు సేకరించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహా న్ని సూర్యాపేట జనరల్ ఆసుప త్రి కి తరలించారు. కాగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యా ప్తును వే గవంతం చేశారు. పరారీలో ఉన్న నిందితుల (CR PF కానిస్టేబుల్ స హా) కోసం ప్రత్యేక బృందాలతో గా లింపు చర్యలు చేపట్టారు.భూ గొడ వలే పూర్తి కారణమా? లేక దీని వె నుక ఇంకా ఏవైనా కోణాలు ఉన్నా యా? అనే విషయా లు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.సొంత అన్నద మ్ముల మధ్య పెరిగి న భూపగ ఒకరిని అనంత లోకాల కు, మరికొందరిని జైలు గోడల మ ధ్యకు నెట్టేసిన ఈ ఘటన సో లిపేటలో తీవ్ర విషాదాన్ని నింపింది.

