Suryapet police arrive alive campaign : ప్రజా దీవె న, సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్ర తి ఒక్కరూ కృషి చేయాలని జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్యమిశ్రా పిలుపునిచ్చారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అరైవ్,అలైవ్ కార్యక్రమంలోముఖ్య అ తిదిగా పాల్గొన్నారు. ముందుగా స్థానిక కల్నల్ సంతోష్ బా బు చౌర స్తా నుండి రోడ్డు భద్రతపై నిర్వహించిన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం పిల్లలమర్రి వద్ద బ్లాక్ స్పాట్స్ లను పరిశీలించి న తదుపరి రుద్ర౦గి కన్వెన్షన్ హా ల్ నందు పోలీస్ శాఖ ఆద్వర్యం లో విద్యార్దులకు ఏర్పా టు చేసిన అవగాహన కార్యక్రమంలో కోదాడ శాసన సభ్యు రాలు నలమద పద్మావతి రెడ్డి, కలెక్టర్ తేజస్ నంద్ లాల్ ప వార్, ఎస్పీ కె. నరసింహ కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఏడాది రోడ్డు ప్ర మాదల తో ఎంతో మంది ప్రాణాలను కో ల్పోతున్నారని ఈ నేపద్యంలో రో డ్డు భద్రతను గుర్తించి తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత కల్పిస్తూ రో డ్డు ప్రమాదాల నివారణ కొరకై అ వగాహన కార్యక్రమాలను చేపట్టిం దని తెలిపారు. రోడ్డు మీ ద అజాగ్ర త్తగా ప్రయాణం చేస్తే ప్రాణాలకు ప్ర మాదం పొంచి ఉందని, ఓవర్ స్పీ డింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్ లేకుం డా డ్రైవింగ్ చేయడం, సిట్ బెల్ట్ లేకుండా నిర్లక్ష్యంగా వాహ నాలను నడపడంతో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నా యని తెలిపారు.
దేశంలో 2023లో రోడ్డు ప్రమాదల లో 4.5లక్షల మంది మృ త్యువాత పడ్డారని వివరించారు. ముఖ్యంగా యువత ఓవ ర్ స్పీడ్ తో వాహనా లను నడుపుతూ ప్రమాదలకు గురవు తున్నారని, ఓవర్ స్పీడ్ వెళ్ల కుండా జాగ్రత్తగా వాహనం నడి పితే దాదాపు 50శాతం రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని అ భిప్రాయపడ్డారు. అదే విదంగా సెల్ ఫోన్ నడుపుతూ వాహ నాలను డ్రైవింగ్ చేయరాదని, సీట్ బెల్ట్ ధరిస్తే ఆక్సి డెంట్ సమయంలో ప్రాణాలను ని లిచే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాద రహిత జిల్లాగా మార్చేందుకు వీ టిని ఆచర ణ చేస్తే చాలని వీటితోనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయ న్నారు. ప్రయాణ సమయంలో ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ జాగ్రత్తగా ప్ర మాద నివారణ చర్యలు తీసు కుంటే రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పడతాయని తెలిపా రు.
ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉంటూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ప్రా ణాలను నిలుపుకోవలని, ముఖ్యంగా డ్రైవ ర్లు ట్రాఫిక్ రూ ల్స్, రోడ్డు నియమ నిబందనలపై అవగాహన కలిగి ఉండా లని సూచించారు. ప్రతి ఒ క్కరూ సూర్యాపేట జిల్లాకు రోడ్డు భద్రత నియమాలను పాటిస్తూ ప్రాణాలకు కాపాడాలని సం కల్పం చేసుకోవాలని పిలుపునిచ్చారు.భద్రతగా గమ్యస్థా నాలకు చేరడ మే అరైవ్ అలైవ్ లక్ష్యమని వివరించారు.
సూర్యా పేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మాట్లా డుతూ రోడ్డు ప్రయాణ సమయంలో భద్రతగా గమ్య స్థానా లకు చేరుకోవాడ మే అరైవ్ , అలైవ్ లక్ష్యమని తెలిపారు. జి ల్లాలో దాదాపు 200కి లోమీటర్ల మేర జాతీయ రహదా రు లు, 3600కిలో మీటర్ల మేరకు గ్రామీణ రోడ్లు విస్తరించి ఉ న్నాయని, ప్రతి ఒక్కరూ సురక్షితంగా గ మ్యస్థానాలకు చేరు కునేల సూర్యా పేట జిల్లాలో రోడ్డు భద్రతపై వివిధ స్థాయిలో అవగాహన కార్యక్రమా లు చేపడుతున్నట్లు వెల్లడించారు.
ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదల తో అనేక మంది చనిపో తున్నారని 2023 సంవత్సరంలో 257 మంది, 2024 లో 2 78 మంది, 2025లో 230మంది, 2026 ఏప్రిల్ వరకు 7 8 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించినట్లు తెలిపారు.
ఈ క్రమంలో రోడ్డు ప్రమాదాల బా రిన పడకుండా తెలంగా ణ రాష్ట్ర ప్రభుత్వం రోడ్ సేఫ్టీ పై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటు న్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి కోల్పోతే కు టుంబం అంత రోడ్డు మీద పడు తుందని కావున రోడ్డు ప్ర యాణ సమయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూ చించారు. జిల్లా స్థా యీలో డిస్ట్రిక్ రోడ్డు సేఫ్టీ కమిటీ, మం డల స్థాయీలవ మండల రోడ్ స్టేఫ్టీ కమిటీ ఏర్పాటు చేసుకొ ని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని,జిల్లా వ్యాప్తంగా 45 బ్లాక్ స్పాట్ లను గు ర్తించి ప్రమాదాలు జరగకుండా నివారణ చ ర్యలు తీసుకుంటున్నామన్నారు. గ్రామాలలోని రోడ్ల పై లో పాలను గుర్తిస్తే ప్రతి ఒక్కరూ భా ద్యతగా వాటి సమాచారం అందిం చాలని కోరారు. సిట్ బెల్ట్, హెల్మెట్ లేకుండా ప్రయా ణం చేయకూడద ని గ్రామాలలో తీర్మానం చేసుకోవాలని పి లుపునిచ్చారు.
కోదాడ శాసన సభ్యురాలు ఉత్తం పద్మావతి మాట్లాడుతూ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాద గణాంకాలు పరిశీలిస్తే ఆవేద న కలుగుతుందని, అరైవ్ అలైవ్ అనే రోడ్డు భద్రత కా ర్య క్ర మం అద్భుతమైనదని దీని ద్వారా ప్రజలు మరింత చైతన్య మంత అవుతున్నారన్నారు. ఇ లాంటి కార్యక్రమానికి శ్రీ కారం చు ట్టిన రాష్ట్ర పోలీస్ శాఖకు అభి నందనలు తెలి యజేస్తున్నారని తెలిపారు. అరైవ్ అలైవ్ అనేది ఒక పదం కాదు ఇది ఒక మహా ఉద్య మం అన్నారు. వాహనదారులు ప్ర జలు యువత ప్రతి ఒక్కరూ ప్ర యాణ సమయంలో ర హదారి ని యమాలు పాటించాలని పోలీసు వారి సూచన లు పాటించాలని ట్రా ఫిక్ నియమయ నిబంధనలు పా టిం చాలని కోరారు. ముందస్తు జా గ్రత్తలు పాటించడం ద్వారా నే రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చని ప్ర మాదం మరణా లను నివారించవచ్చని తెలిపారు. ప్రమాద సంఘట నలు జరిగినప్పుడు అక్కడ ఉన్న ప్రజలు స్పందించి క్షతగాత్రుల కు సహకారాలు అందించాలని త్వరితగతిన ఆసుపత్రులకు తరలించాలని తెలిపారు.
జిల్లా ఎస్పీ కె. నరసింహ మాట్లాడుతూప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్ర జాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్ర మంలో భాగంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు రోడ్డు భద్రత ని య మాల పట్ల విస్తృత అవగాహ న కల్పిస్తున్నామని తెలిపా రు. అరైవ్ అలైవ్ కార్యక్రమం జిల్లా వ్యా ప్తంగా ఇతర శాఖల తో సమన్వ యంగా పనిచేస్తూ ముందుకుపోతున్నామ న్నా రు. దేశంలో ప్రతి సంవత్సరం నాలుగు లక్షల పైగా రోడ్డు ప్ర మాదాల సంభవిస్తున్నాయని, సూర్యాపేట జిల్లాలో గత సం వత్స రం 600 పైగా రోడ్డు ప్రమాదాలు సంభవించగా 230 మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు.
రోడ్డు ప్రమాద సమయంలో ప్రమా దాలు సంభవించకుండా ప్రతి ఒ క్కరు సురక్షితంగా గమ్యం చేరడం లక్ష్యంగా పోలీస్ శాఖ కృషి చేస్తుం దని ప్రజలకు అవగాహన కల్పిస్తు న్నామ ని అన్నారు. ముందస్తు జా గ్రత్తలు పాటించడం ద్వారానే రో డ్డు ప్రమాదాలను నివారించడం సా ధ్యమైతుందని ప్రజలు అప్రమత్తం గా ఉండాలని కోరారు. ప్రమాద సంఘటనలో బాధితులకు సహాయ స హకారాలు అందించాలని అలాం టివారిని రహదారి హీరోగా గుర్తించి ప్రోత్సాహం అందించ డం జరుగుతుందన్నారు.
రోడ్డు భద్రతపై గ్రామాలు, మహిళా సంఘాలు తీర్మాన పత్రా లను అధి కారులు అందించారు. అరైవ్ అలై వ్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్ర మాల ద్వారా గ్రామాలలో ప్రజలు, మహి ళా సంఘాలు చైతన్యవంతం అవుతున్నాయి, ఈ కార్యక్ర మంలో పాల్గొన్న వివిధ గ్రామాల సర్పంచు లు వివిధ గ్రామా లకు చెందిన మ హిళా సంఘాలు రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తగా వాహనాలు నడుపుతామని, మాకు టుంబ సభ్యులు, మాగ్రామ ప్రజలు హెల్మెట్ సీట్ బెల్ట్ దరి స్తారని తీర్మానాలు చేసి తీర్మాన పత్రాలను జిల్లా అధికారు లకు అందించారు.
రోడ్డు ప్రమాద ఘటనలో సహాయ సహకారాలు అందించిన వ్యక్తికి స న్మానం. చివ్వెంల మండల పరిధి జాతీయ రహదా రి 65 ఏచర్ల ము త్యాలమ్మ గుడి వద్ద ఏసీ డీసీఎం, టాటా ఏసీ రోడ్డు ప్రమాదం సంభ వించగా సంఘటనలు క్షతగాత్రు ల కు సహాయ సహకారాలు అందించి 108 కి, పోలీసు వా రికి వేగంగా సమాచారం అందించిన వాళ్లభాపురం గ్రామా నికి చెందిన రవీందర్ అ నే వ్యక్తిని ఈ సందర్భంగా అధికా రులు సన్మానించారు. రోడ్డు ప్రమాద సంఘటనల్లో స్పందిం చి సహకారాలు అందించే వారిని రహదారి హీరోగా కీర్తించ డం జరుగుతుంది.
ఆకట్టుకున్న పోలీసు కళాబృందంనాటకం ప్రదర్శన
ఈ అవగాహన కార్యక్రమంలో భాగంగా పోలీసు కళాబృం దం ఆధ్వ ర్యంలో నిర్వహించిన భూలోకం, యమలోకం అనే నాటక ప్రదర్శన ఆకట్టుకున్నది. రోడ్డు ప్రమాదాలకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్ర త్తల గురించి ఈ నాటక ప్రదర్శన నందు వివరించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అరైవ్ అలైవ్ రోడ్డు భద్రతా కార్యక్రమం గు రించి నాటక ప్రదర్శన ద్వారా వివ రించారు. హెల్మెట్ ధరిం చకుండా వాహనాలు నడిపిన మద్యం మ త్తులో వాహనా లు నడిపిన జరిగే ప్రాణప్రాయం గురించి ప్రదర్శనలు తెలిపా రు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజలకు మీడియా ప్రతినిధు లకు హెల్మెట్స్ ను అందించి ప్రయాణ సమయంలో హెల్మెట్ ధరించి ప్రయాణించాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జైళ్ల శాఖ డిఐ జి శ్రీనివాసరావు, అడిషన ల్ ఎస్పీ రవీందర్ రెడ్డి, ఆర్టీసీ డిఎం సునీత, ఆర్టీవో జయప్ర కాశ్ రెడ్డి, గ్రంథాల య సంస్థ చైర్మన్, సూర్యాపేట కోదాడ తి రుమలగిరి నేరేడుచర్ల ము న్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు మున్సిపల్ కమిషనర్లు స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరు లు పాల్గొన్నారు.




