Suryapet SP Narasimha : ప్రజా దీవెన, సూర్యాపేట: విద్యార్థులకు వేసవి వినోద శిబిరం, వినోదవంతమైన కార్య క్రమం జిల్లా పో లీసు కార్యాలయంలో ఎస్పీ నరసింహ శని వారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన యో గా జుంబా డాన్స్, క్రీడలు మొదలగు ఉల్లాసభరితమైన కా ర్యక్రమాల లో విద్యార్థులు విల్లాసం, ఆనందోత్సవాలతో గడి పారు. బాలలతో క లిసి జిల్లా ఎస్పి, అదనపు ఎస్పీ, డీ ఎస్పీ లు, సీఐలు, అర్ఐలు, ఎస్ఐ లు, ఆర్ఎస్ఐ లు, పోలీసు సి బ్బం ది జుంబ డాన్స్, యోగ చేసి క్రీడలు ఆడారు. ఈ సంద ర్భంగా జిల్లా ఎ స్పీ నరసింహ మాట్లాడారు.
వేసవి వేల పిల్లలు రోడ్లపై, ఇతర కార్యక్రమాలలో ప్రమాదకర మైన స్థి తిలో ఉండకూడదని విద్యార్థులకు, పోలీసు పిల్లల కోసం ప్రత్యేక చొరవతో ఈ వేసవి వినోద శిబిరా న్ని ఏర్పా టు చేశామని అన్నారు. యోగా చేయడం, డాన్స్, క్రీడలు, నా టికలు, పెయింటింగ్స్ లాంటివి పిల్లల మానసిక ఉల్లాసా ని కి, జ్ఞా ప కశక్తి పెంపొందించడానికి, శారీరక దృఢత్వానికి ఉపయోగపడతాయ ని అన్నారు. తల్లిదండ్రులు పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వారి అలవాట్లను గమనిస్తూ ఉం డాలని తెలిపారు, కష్టపడే తత్వాన్ని అలవాటు చేయాలని, గెలుపు ఓటమిలను ఆస్వాదించే విధంగా ప్రే రేపించాలని సూచించారు.
సోషల్ మీడియా, మొబైల్ ఫోన్స్ నుండి దూరంగా ఉంచాల ని అన్నారు. పోలీసు కుటుంబాల సంక్షేమం లో భాగంగా జి ల్లా పోలీస్ శాఖ ఎ ల్లప్పుడు కృషి చేస్తుందని దీనిలో భాగం గానే జిల్లా పోలీస్ కార్యాల యం నందు పోలీస్ సబ్సిడరీ సెం ట్రల్ క్యాంటీన్ ఏర్పాటు చేశామని, అత్యాధునిక వ్యా యామశాలను ఏర్పాటు చేశామని, వాలీబాల్ క్రికెట్ మైదా నాలను పరేడ్ మైదానా న్ని అభివృద్ధి చేశామని తెలిపారు. పోలీస్ సిబ్బంది ఇలాంటి కార్యక్రమాలను సద్వినియో గం చేసుకోవాలని కోరారు.
పోలీసు వినోద శిబిరానికి హాజరైన విద్యార్థులు పిల్లలతో కలిసి ఎస్పీ స్వయంగా సరదాగా కాసేపు గడిపి క్రీడలు ఆడా రు యోగా జుంబా డా న్స్ చేశారు. పదవ తరగతి ఫలితా ల్లో ప్రతిభ చూపి మంచి మార్కులు సాధించి పోలీస్ సిబ్బం ది పులల్లను సన్మానించి నగదు ప్రోత్సాహ కం అందించారు. ఆర్మూడ్ కానిస్టే బుల్ శ్రీనువాస్ కుమార్తె భవ్యశ్రీ, మోతే పీస్ హోంగార్డ్ సురేష్ రెడ్డి కుమార్తె హర్షిత పదవ తరగతిలో మం చి మార్కులు సాధించారని సన్మానించి అభినందించారు. పిల్ల లకు భవిష్యత్తులో మంచి స్థాయి లో ఉండాలని ఎస్పి ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, అర్ము డ్ విభా గం డి.ఎస్.పి నరసింహ చారి, స ర్కిల్ ఇన్స్పెక్టర్లు వెంకటయ్య, రాజ శేఖర్, అర్ఐ లు ప్రవీణ్ కుమార్, జాన య్య, ఎస్సైలు సాయిరాం, శ్రీ కాంత్, ఐలయ్య, మహేష్, సైదు లు, వెల్ఫేర్ ఆర్ఎస్ఐ సాయిరాం, పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్ఎస్ఐ సురే ష్, హోంగార్డ్స్ ఆర్ఎస్ఐ అశోక్, స్పెషల్ పార్టీ ఆర్ఎస్ఐ అశోక్, టె క్నికల్ టీం ఆర్ఎస్ఐ రాజశేఖర్, భ రోసా సెంటర్ ఎస్సై మౌనిక, షీటీం సిబ్బంది, ఆర్మూడ్ పోలీస్ సిబ్బం ది, సూర్యాపేట పట్టణ రూరల్ పో లీస్ సిబ్బంది పాల్గొన్నారు.


