Monday, September 28, 2026
More
    HomeOpinionSuryapeta SP k Narasimha : మూసినదిపై బీమారం లోలెవల్ బ్రిడ్జి వద్ద నీటిప్రవాహ పరిస్థితులపై...

    Suryapeta SP k Narasimha : మూసినదిపై బీమారం లోలెవల్ బ్రిడ్జి వద్ద నీటిప్రవాహ పరిస్థితులపై ఎస్పి నరసింహ ఆరా

    📰 Generate e-Paper Clip

    Suryapeta SP k Narasimha : ప్రజాదీవెన, సూర్యాపేట: ప్రజల రక్షణలో పోలీసు అనుక్షణం అప్రమత్తంగా పని చేస్తున్నారు అని జిల్లా ఎస్పి నరసింహ అన్నారు. వర్షాల దృష్ట్యా మూసి నది ఉధృతంగా ప్రవహిస్తున్నందున గురువారం సూర్యాపేట రూరల్ పరి ధి వేదేరివారి గూడెం వద్ద మూసినదిపై భీమారం లో-లెవెల్ బ్రిడ్జి వ ద్ద నీటి ప్రవాహ పరిస్థితిని ఎస్పీ నర్సింహా ఐపీఎస్ పరిశీలించారు. వర్షాల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధిక వర్షాల వల్ల చెరువులు నదులు కుంటలు నిండి ప్రమాదకర రీతిలో ఉన్నా యని వాటిలోకి ఎవరు దిగవద్దని ఎస్పీ సందర్భంగా కోరారు.

    తుఫాను ప్రభావంతో రెండు రోజులుగా విస్తారంగా కురిసిన వర్షాలు దృష్ట్యా అతను చెరువులు కుంట లు నీటితో నిండి ఉండి ప్రమాదక ర స్థితిలో ప్రవహిస్తున్నాయి దీనిపై జిల్లా పోలీస్ శాఖ అప్రమత్తమై ప్రమాదకరంగా ఉన్న స్థలాల వద్ద భద్రతా చర్యలు తీసుకోవడం జరి గింది పోలీస్ పికెట్స్ ఏర్పాటు చేయడం నీటి ప్రవాహం లోకి ఎవరు వెళ్లకుండా రో డ్లపై బారికెడ్ లు, వాహనాలు అడ్డుగా పెట్టడం జరి గింది. అలాగే రోడ్లపై విరిగిపడిన చెట్ల ను తొలగించడం, నీటి ప్రవా హంలో చిక్కుకున్న వాహ నాలను తీయడం, ప్రమాదంలో ఉన్న ప్ర జలను కాపాడడం జరిగినది, అలాగే తెగిపోయిన రోడ్లను సంబం ధిత అధికారితో కలిసి మరమ్మతులు చేయించడం జరిగిoదని తె లిపారు.

    జిల్లాపోలీస్ శాఖ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజార క్షణ లో నిరంతరం కృషి చేస్తుంది అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో సెలవలు రద్దు చేసి సిబ్బందిని అందుబా టులో ఉంచామని ఎస్పి అన్నారు. ఎస్పి వెంట సూర్యాపేట రూరల్ CI రాజ శేఖర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పె క్టర్ రామారావు, రూరల్ SI బాలు నాయక్, సిబ్బం ది ఉన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.