Monday, September 28, 2026
More
    HomeIndiaT20 World Cup final: బిగ్ బ్రేకింగ్, పరుగుల తుఫాన్ సృష్టించిన భారత్, న్యూజిలాండ్‌కు హిమాలయ...

    T20 World Cup final: బిగ్ బ్రేకింగ్, పరుగుల తుఫాన్ సృష్టించిన భారత్, న్యూజిలాండ్‌కు హిమాలయ లక్ష్యం

    📰 Generate e-Paper Clip

     

    T20 World Cup final: ప్రజా దీవెన, అహ్మదాబాద్: అహ్మ దాబాద్ నరేంద్ర మోదీ స్టే డియం కేంద్రంగా జరుగుతోన్న టీ 20 ప్రపంచకప్ ఫైనల్ రో జు క్రికెట్ అభిమానులకు మరచి పోలేని జ్ఞాపకంగా నిలిచి పోయింది. సూర్యకుమార్ యాద వ్ నాయకత్వంలో బరిలోకి దిగిన టీమిండియా బ్యాటర్లు స్టే డియంను పరుగుల పం డుగగా మార్చేశారు. కివీస్ బౌలర్ల పై ఎలాంటి కరుణ లేకుం డా దాడి చేస్తూ భార త్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.

            భారత బ్యాట్స్ మెన్ రౌద్రం

    సంజు శాంసన్ ఓపెనర్‌గా క్రీజులోకి వచ్చి మొదటి నుంచే దూకుడు చూపించాడు. అతని స్ట్రోక్స్‌కు ప్రేక్షకులు మంత్ర ముగ్ధులయ్యారు. కేవలం కొన్ని బంతుల్లోనే మ్యాచ్ మూడ్ మార్చేసిన శాంసన్ 89 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆ డాడు.అతనికి జోడీగా వచ్చిన అభిషేక్ శర్మకూడా వెనుక డుగు వేయలేదు. మెరుపు షాట్లతో కివీస్ బౌలర్లను ఉక్కిరి బిక్కిరి చేస్తూ 52 పరుగుల తో అర్ధశతకం నమోదు చేశా డు. కాగా మధ్యలో క్రీజులోకి వచ్చిన ఇ షాన్ కిషన్ అయితే అస లు తుఫాన్ లాంటి ఇన్నింగ్స్ ఆడాడు.కేవలం 25 బం తుల్లోనే 54 పరుగులు చేసి స్కోరు బోర్డును పరిగెత్తించా డు.

         ఆట ఆఖరులో దూబే తుఫాన్

    ఇన్నింగ్స్ చివర్లో శివమ్ దూబే సి క్సర్ల వర్షం కురిపించాడు. అతని భారీ హిట్లతో స్టేడియం మొత్తం హోరెత్తిపోయింది. ఆఖరి ఓవర్లలో వచ్చిన ఈ దూకుడు వల్ల భారత స్కోరు 250 మార్కును దాటి 25 5కు చేరింది. శాంసన్ అవుట్ అ యిన తర్వాత స్కోరు వేగం కాస్త తగ్గినట్టు కనిపించినా చి వర్లో భారత ఆటగాళ్లు మళ్లీ వేగం పెంచి న్యూజిలాండ్ ముందు 256 పరుగుల భారీ లక్ష్యాన్ని నిలబెట్టారు.

    ఇప్పుడు అందరి చూపు రెండో ఇన్నింగ్స్‌పైనే ఉంది. కివీస్ ఈ మహా లక్ష్యాన్ని చేధిస్తారా? లేక భారత జట్టు కప్పును ఎ త్తుకెళ్తుందా అన్న ఉత్కంఠ రేపుతోన్న సందర్బం లేక పోలే దు. మరికొద్ది సేపట్లోనే టీ 20 ప్రపంచ కప్ విజేత ఎవరనేది తేలనుంది.

     

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.