Monday, September 28, 2026
More
    HomeIndiaTamilnadu CM Vijay Oath : బిగ్ బ్రేకింగ్, ముగిసిన విజయ్ ప్ర మాణస్వీకారం, తమిళనాడు...

    Tamilnadu CM Vijay Oath : బిగ్ బ్రేకింగ్, ముగిసిన విజయ్ ప్ర మాణస్వీకారం, తమిళనాడు నా యకుడిగా విజయ్ కొత్త అధ్యా యం 

    📰 Generate e-Paper Clip

    Tamilnadu CM Vijay Oath : ప్రజా దీవెన, చెన్నై: చెన్నై నగరం ఈ రోజు చరిత్రను చూసింది. సినీ తెరపై కోట్లాది అ భిమానుల మన సులు గెలుచుకున్న జోసెఫ్ విజయ్ ఇకపై తమిళనాడు రాజకీయ రంగంలోనూ “తలపతి సీఎం”గా కొ త్త ప్రయాణం మొదలుపెట్టారు. జవహర్‌లాల్ నెహ్రూ ఇండో ర్ స్టేడి యం మొత్తం అభిమానుల నినాదాలతో మార్మోగి పోయింది. “విజయ్…విజయ్…” అంటూ వినిపించిన గోల మధ్య గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఆయనతో ము ఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయనతో పా టు తొమ్మిది మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం ముగించారు.

    సినిమా ఆడియో లాంచ్‌ను తలపించేలా జరిగిన ఈ వేడుక కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, పలువురు సినీ ప్రము ఖులు, రాజకీయ నాయకులు హాజరయ్యారు. ము ఖ్యంగా హీరోయిన్ త్రిష రాక అభి మానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది.

      సీఎం ఛాంబర్‌లో “సినిమాటిక్” సీన్

    ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే విజయ్ నేరుగా సచి వాలయానికి చేరుకున్నారు. అధికారులు ఘన స్వాగతం పలికారు. సీఎం ఛాంబర్‌ లోకి అడుగుపెట్టిన విజయ్ ముం దుగా అందరికీ చేతులు జోడించి నమస్కరించారు. అనంత రం సీ ఎం కుర్చీ వద్దకు నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్లి చి రునవ్వుతో కూర్చున్న క్షణం అక్కడున్న వారంద రూ చప్ప ట్లతో హర్షధ్వానాలు చే శారు. ఆ సీన్ ఇప్పుడు సోషల్ మీ డియాలో “రియల్ లైఫ్ క్లైమాక్స్ షాట్”గా వైరల్ అవుతోంది.

       మొదటి రోజే మూడు “బిగ్ డె సిషన్స్”

    సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెం టనే విజయ్ వరుస సంచలన ని ర్ణయాలతో అందరినీ ఆశ్చర్యపరి చారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పై తొలి సంతకం చేయగా మ హిళల భద్రత కోసం ప్రత్యేక ని ఘా విభాగంపై రెండో సంత కం చేశారు. అదే సమయంలో డ్రగ్స్‌పై ఈగల్ తరహా యు ద్ధం మూడో సం తకం చేశారు. ప్రజల కోసం పని చేసే ప్రభు త్వం ఇదే” అని విజయ్ ప్రకటించగా సభ మొత్తం హర్షధ్వా నాలతో మార్మోగింది.

    ఇదిలా ఉండగా అంతా ముగిసిందనుకునేలోపే విజయ్ మరోసారి తన స్టైల్ చూపించారు. సీఎం హో దాలోనే తన మొబైల్ తీసుకుని రా హుల్ గాంధీ, పార్టీ నేతలు, అభి మానులతో కలిసి వీడియో తీశా రు. స్టేడియంలో వేలాది మంది అ భిమానులను తన ఫోన్ కెమెరాలో బంధించిన ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. సినిమాల్లో హీరో ఇప్పుడు ప్రజల సీఎం అంటూ అభిమాను లు పోస్టులు పెడుతున్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.