Telangana DGP C.V.Anand surprise decision: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ శాంతిభద్రతల రక్ష ణలో సరి కొత్త అధ్యాయానికి తెరలేచింది. రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ యంత్రాం గాన్ని మరింత పరుగులెత్తించేందుకు డీజీ పీ సీవీ ఆనంద్ రంగంలోకి దిగారు. ఒకే ఒక్క ఉత్తర్వుతో రా ష్ట్రవ్యాప్తంగా ఏకంగా 36 మంది డీఎస్పీ (DSP)లను బదిలీ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.సాధారణ పరిపాల నా ప్రక్రియే అయినా ఎన్నికల ముందు లేదా శాంతిభద్రతల బలోపేతంలో భాగంగా తీసుకున్న అత్యంత కీలకమైన ‘వ్యూహాత్మక మార్పు’గా దీనిపై పోలీస్ వర్గాల్లో చర్చ నడు స్తోంది.
అయితే కీలక ప్రాంతాల్లో నెట్‌వ ర్క్‌ను మరింత బలోపేతం చేయ డం కోసం కొత్త సవాళ్లకు తెర లేపా రు పోలీస్ బాస్. సైబర్ నేరాలు, శాంతిభద్రతల అదుపులో సరికొత్త ఐడియా లతో ఉన్న అధికారులకు ప్రాధాన్యత కల్పిస్తూ క్షేత్రస్థాయిలో ఉన్న లూప్‌హోల్స్‌ను పూడ్చేందుకు డీజీపీ వేసిన మాస్టర్ ప్లాన్ గా పరిశీలకులు భావిస్తున్నారు.
ఆదేశాలు తక్షణం అమలు
బదిలీ అయిన 36 మంది అధికా రులు వెంటనే తమకు కేటాయించి న కొత్త స్థానాల్లో బాధ్యతలు స్వీ కరించాలని డీజీపీ కార్యాలయం స్పష్టం చేసింది. ఈ భారీ మా ర్పు తో జిల్లాల్లో క్రైమ్ రేట్‌కు బ్రేకులు పడతాయా? కొత్త బాధ్యతలు చేప ట్టిన డీఎస్పీలు ఎలాంటి సవాళ్లను ఎదుర్కోబోతున్నా రు? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.



