Tuesday, September 29, 2026
More
    HomeOpinionTelangana formers commission Kodanda Reddy : ధాన్యం సేకరణ మార్గదర్శకాలనుగుణంగా రైస్ మిల్లర్లు...

    Telangana formers commission Kodanda Reddy : ధాన్యం సేకరణ మార్గదర్శకాలనుగుణంగా రైస్ మిల్లర్లు సహకరించాలి

    📰 Generate e-Paper Clip

     

    Telangana formers commission Kodanda Reddy: ప్రజా దీవెన నల్లగొండ: రబీ ధాన్యం సేకరణ మార్గదర్శకాల ను పాటించ డంలో రైస్ మిల్లర్లు పూర్తి సహకా రం అందిం చాల్సిన అవసరం ఉం దని రాష్ట్ర వ్యవసాయ, రైతు సం క్షేమ కమిషన్ చైర్మన్ ఎం. కోదండ రెడ్డి అన్నారు. శనివా రం ఆయన నల్గొండ కలెక్టర్ కార్యా లయంలోని సమావేశ మం దిరంలో రైస్ మిల్ల ర్లు, రైతు సంఘాల ప్రతినిధులు, ధాన్యం సేకరణ అధికారులతో స మీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్ర భు త్వం ఎక్కడా లేని విధంగా రై తుల కు అనేక సంక్షేమ పథ కాలను అమ లు చేస్తున్నదని, రైతుబంధు, రైతు బీమాతో పాటు, కొనుగోలు కేంద్రా లు ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొను గోలు చేస్తున్నదని, అందువల్ల ధా న్యం కొనుగోలులో ఎట్టి పరిస్థితు లలో రైతుని ఇబ్బంది పెట్టడానికి వీలు లేదన్నారు.

    అధికారులు,ప్రజా ప్రతినిధులు, మి ల్లర్లు అందరూ రైతుల ను ఆదుకోవాల్సిన అవసరం ఉందని, ఈ విషయంలో పూర్తి సహకారం అం దించాలని కోరారు. ఎఫ్ సిఐ నిబంధనల ప్ర కారమే ధాన్యం కొను గోలు నిర్వహించడం జరుగుతున్న ద ని, అయితే రైతుకు, మిల్లర్లకు ఎ లాంటి సంబంధం ఉండ దని, కొనుగోలు కేంద్రానికి రైతుకు మాత్రమే సంబంధం ఉం టుందని, ఈ విషయంలో రైస్ మిల్లర్లు రైతులను ఇబ్బంది పెట్టకూడదని కోరారు. తాలు, తరుగు వంటి సమస్యలు ఉంటే సంబంధిత అధికారుల ద్వారా చర్చించి పరిష్కరిం చుకోవాలని ఆ యన మిల్లర్ల కు సూచించారు. ధాన్యం సేక రణ కేవలం సీజన్లో మాత్ర మే ఉంటుందని, ఇది అందరి బా ధ్యత అని, ధాన్యం కొనుగోలు జరిగినన్ని రోజులు అధికా రు లు క్షేత్ర స్థాయిలో ఉండాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పారు.

    రైస్ మిల్లర్లకు సంబంధించి ఏమైనా స మస్యలు ఉంటే ప్ర భుత్వ దృష్టికి తీ సుకువెళ్తామన్నారు. రైతులు కూడా నా ణ్యమైన ధాన్యాన్ని కొను గోలు కేంద్రాలకు తీసుకురావాలని చెప్పారు.హరిత విప్లవం తర్వాత పెద్ద ఎత్తున ధాన్యం వస్తు న్నందున ప్రతి సంవత్సరం సమస్యలు పెరుగుతున్నాయని, దీనిని దృష్టిలో ఉంచుకొని రైతులు సంప్రదాయ పంటల వై పు మల్లాల్సిన అవసరం ఉందని అన్నారు.

    ఒకప్పుడు నల్గొండ జిల్లాలో 4 ల క్షలు ఎకరాల లో బత్తాయి పండిం చగా, అది ఇప్పుడు 40 వేల ఎక రాలకు పడిపో యిందని, తిరిగి బత్తాయి పండించాలని,రైతులు సం ఘ టితంగా ఉండేందుకు రైతు ఉ త్పాదక సంస్థలను ఏర్పాటు చే యాలని, రైతు ఎప్పుడు ఒంట రి వాడిగా ఉండకూడదని అన్నారు. రైతాంగం కష్టాల లో ఉన్నప్పుడు వారి కష్టాలను దూరం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ఇందు కు అందరూ కృషి చేయాలన్నారు. ధాన్యం సేకరణలో రైతులు, అధికా రులు, మిల్లర్ల మధ్య సమన్వయం ఉండాలని, అధి కారులు వంతుల వారిగా క్షేత్రస్థాయిలో ధాన్యం కొను గోలు కేంద్రాలను సందర్శించి సమ స్యలు తెలుసుకొని పరిష్క రిం చాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.

    మిల్లర్లకు సంబంధించిన బాయిల్డ్ రైస్ సమస్య ,ఇతర సమ స్యలన్నిం టిని రాష్ట్రస్థాయిలో చర్చించి అవసరమైతే ము ఖ్యమంత్రి దృష్టికి తీ సుకువెళ్లి పరిష్కరించేందుకు చ ర్యలు తీసుకుంటామని ఆయన తె లిపారు. రైతు కమిషన్ సభ్యు లు చెవిటి వెంకన్న, నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూ రి రమేష్,, రై తు కమిషన్ మెంబర్ సెక్రెటరీ గోపాల్ మాట్లా డారు. సమావేశం ప్రా రంభమైన వెంటనే రెవెన్యూ. అద న పు కలెక్టర్ జె. శ్రీనివాస్ మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో ఈ య సంగి లో 5,58,000 ఎకరాలలో వ రి పంట సాగు చే యడం జరిగిందని, ఇందులో 3,80,000 ఎకరాలలో దొడ్డు ధాన్యం, లక్ష 70 వేల ఎ కరాలలో సన్న ధాన్యం సాగు చేశా రని, మొత్తం 14 లక్షల మెట్రిక్ ట న్నుల ధాన్యం మార్కెట్ కు వస్తుం దని అంచనా వేయడం జరిగిందని, ఇందుకుగాను జిల్లా వ్యాప్తంగా 439 కొనుగోలు కేంద్రాలను ఏర్పా టు చేసేం దుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు.

    గత సంవత్సరంతో పో లిస్తే 136 కేంద్రాలు అధికంగా ప్రతి పాదించామని,ఇప్పటివరకు 330 కేంద్రాలు ప్రారంభించి 50 వేల మె ట్రిక్ టన్నులు కొనుగోలు చేసినట్లు అయిన వెల్ల డించారు.మిల్లర్లు స మస్య వల్ల అన్లోడ్ కొంచెం ఆలస్య మైందని, శుక్రవారం చర్చల అనం తరం ఈ సమస్య పరి ష్కారం అయిందని, ఇక అన్లోడ్ వేగవంతం అయ్యేందుకు ఆస్కారం ఉన్నట్టు ఆయన తెలిపారు.ధాన్యం కొనుగోలు కేంద్రాలలో సౌ కర్యాలన్ని కల్పించామని, అవసర మైన లారీలను కూడా ఏర్పాటు చే స్తున్నామని ఆయన చెప్పా రు.

    అనంతరం చైర్మన్ కోదండ రెడ్డి మీడియా ప్రతినిధులతో మా ట్లాడుతూ ధాన్యం సేకరణలో ఎవరు రైతులను ఇబ్బంది పె ట్టకూడదు అన్నది తమ ఉద్దేశమని, అందువల్ల ప్రతి ఒక్క రూ రైతుకు సహకరించి స జావుగా ధాన్యం సేకరణ జరిగే లా చూడాలని కోరారు. అంతకుముం దు చైర్మన్ సమీక్ష ని ర్వహించేందు కు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి రాగా జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ చైర్మన్ కు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు పై చర్చించా రు. ప్రభుత్వం ధాన్యం సేకరణ విషయంలో జారీ చేసిన నిబంధనల ను కచ్చితంగా అమలు చేస్తే భవి ష్యత్తు లో రైతుకు మేలు కలుగు తుందని, కొనుగోలు కేంద్రాల నిర్వ హకులు మిల్లర్లకు సంబంధం లే కుండా చూసుకోవాలని, తరుగు, తేమ పేరిట రైతుల కు ఇబ్బందులు కలగకుండా ధా న్యం కొనుగోలు కేం ద్రంలోనే నిర్ణయం తీసుకోవాలని చైర్మన్ చెప్పారు.

    ఈ సందర్భంగా చైర్మన్ భూభా రతి పెండింగ్ దరఖాస్తులు, సాదా బైనామాల వివరాలను జిల్లా కలెక్టర్ ద్వారా అడిగి తెలుసుకున్నా రు. జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ మా ట్లాడు తూ మార్చి 15 వరకు భూ భారతి పెండింగ్ దరఖాస్తులు ప రి ష్కరించామని మాత్రమే ఉన్నా యని సాదాబైనామ కేసు లను ఎ ప్పటికప్పుడు పరిష్కరిస్తున్నట్లు తె లిపారు. ఆదర్శ రైతు రామిరెడ్డి, రైస్ మిల్లర్ల సంఘం మిర్యాలగూడ కా ర్య దర్శి శ్రీనివాస్, నల్గొండ కార్య దర్శి భద్రాద్రి రాములు, మిల్లర్ల స మస్యలను సమావేశం దృష్టికి తీ సుకువచ్చారు. డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి శ్ర వణ్ కుమార్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.