Sunday, September 27, 2026
More
    HomeOpinionTelanganaBcReservation : బీసీసంఘంనేత జాజుల ఆగ్రహం, కాంగ్రెస్, బిజెపిల వాగ్దానాలువట్టి బూటకమని తేలిపోయింది

    TelanganaBcReservation : బీసీసంఘంనేత జాజుల ఆగ్రహం, కాంగ్రెస్, బిజెపిల వాగ్దానాలువట్టి బూటకమని తేలిపోయింది

    📰 Generate e-Paper Clip

     

    TelanganaBcReservation : ప్రజా దీవెన, హైదరాబాద్: కాంగ్రెస్, బిజెపిలు బీసీలను నమ్మించి నయ వంచనకు గురి చేశా యని, కాంగ్రెస్, బిజెపిలవి వాగ్దానాలు వట్టి బూటక మని తేలిపో యిందని బిసి జేఏసీ ఛైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మీరు మా కుసర్పంచ్ సీటు ఇవ్వకుంటే, మే ము మీ సీఎం సీటు గుంజుకుంటా మని హెచ్చరించారు. బీసీ రిజ ర్వే షన్ల విషయంలో కాంగ్రెస్ మొదటి ముద్దాయి అయితే రెండవ ముద్దా యి బిజెపి అని, రాష్ట్ర అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు చట్టం చేసిన ప్పుడు మద్దతు ఇచ్చిన బిజెపి ఢిల్లీ లో చట్టం ఆమోదించే బాధ్యత ఉ న్నప్పటికీ నేటి వరకు చట్టం ఆమో దించకుండా బీసీలకు ద్రోహం తలపె డుతుందని ఆయన ఆరోపించారు.

    బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు క ల్పించిన తర్వాతనే స్థానిక ఎన్ని క లకు వెళ్తామని నమ్మించి మోసగిం చిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వం కే దక్కుతుoదని, అసెంబ్లీలో మద్దతిచ్చి కేంద్రంలో బీసీ బిల్లుకు మ ద్దతు ఇవ్వకుండా బీసీలను నయవంచన చేసిన చరిత్ర బిజెపి కే ద క్కుతుందని, బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీని వాస్ గౌడ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఫైర్ అయ్యారు.

    ఆదివారం తెలంగాణ బీసీ జేఏసీ ఇచ్చిన చలో హైదరాబాద్ పిలు పు మేరకు బీసీల రాజకీయ యుద్ధ బే రి మహాసభ హైదరాబాదు లోని ఇందిరా పార్క్ వద్ద జరిగింది. ఈ మ హాసభకు రాష్ట్రవ్యాప్తం గా వేలాది మంది కదిలి వచ్చారు. బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, బీసీ కు ల సంఘాల జేఏసీ చైర్మన్ కుందా రం గణేష్ చారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివా స్ గౌడ్, బిఆర్ఎస్ శాస న సభ పక్ష నేత సిరికొండ మధు సూదనా చారి, మాజీ మంత్రి వి శ్రీని వాస్ గౌడ్, సాహిత్య అకాడమీ మా జీ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్, తె లంగాణ క్రాంతి అధ్యక్షులు పృద్వి రాజ్ యాదవ్, మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్యలు పాల్గొని ప్రసంగించారు

    ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ జనాభాలో 60 శాతం పైగా ఉన్న బీసీలకు రాజ్యాధి కారం తగ్గకుండా కుట్ర చేస్తు న్నార ని, బీసీలు సర్పంచ్ లు కాకుండా ఓర్పులను కోర్టులను వేదిక లుగా చే సుకుని బీసీ రిజర్వేషన్ల వ్యతిరేకులు బీసీల నోటికాడు ముద్దను లాగేసుకున్నారని ఆయన మండిపడ్డారు. సర్పంచ్ సీటు ఇవ్వని అగ్రకులా ల సీఎం సీటును గుంజుకుందామని, వచ్చే 202 8 ఎన్నికలు బీసీలు అంత ఐక్యమై రాజకీయ అధికారం సాధించు కుందామని ఆయన పిలుపునిచ్చారు.

    42 శాతం చట్టబద్ధంగా ఇస్తామన్న రిజర్వేషన్లు ఏమో కానీ, గత ఎన్నిక లలో కల్పించిన 23% రిజర్వేషన్లు ప్రస్తుతం తగ్గించి 17% కుదించారా ని, బీసీలకు రిజర్వేషన్లు అన్యా యం జరిగిందని సాక్షా త్తు బీసీ కమి షన్ సీఎంకు లేక రాసిందని ఈ సం దర్భంగా ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికైనా బీసీలకు చిత్తశుద్ధి ఉంటే సీఎం ఎత్రుత్వంలో అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లాలని, రాహుల్ గాంధీ ద్వారా శీతాకాల పార్ల మెంటు సమావేశం ఆయన డిమాండ్ చేశా రు, 42 శాతం రిజర్వేషన్లు తగ్గించి బీసీలకు అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీ వైఖరి వైఖరి పై రాహు ల్ గాంధీ ఇప్పటివరకు స్పందిం చ కపోవడం చాలా బాధాకరమన్నా రు. రిజర్వేషన్లు తగ్గించిన కాం గ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఏ మొహం పెట్టుకుని ఈసారి తెలంగా ణ పర్యటనకు వస్తారని ఆయన నిలదీశారు

    బీసీ రిజర్వేషన్ల సాధన కోసం తె లంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత రెం డు నెలలుగా రాష్ట్రంలో బీసీలు పో రాడుతున్నారు, ఇక ఢిల్లీ ప్రభు త్వంతో తేల్చుకోవడానికి డిసెంబర్ 8 9 ఢిల్లీలో పార్లమెంటు వేదిక గా పోరాటాని ప్రారంభిస్తామని, జనవ రిలో రాష్ట్రవ్యాప్తంగా బీసీల రథ యాత్ర నిర్వహించి, ఫిబ్రవరిలో లక్ష ల మందితో హైదరాబాద్ ను దిగ్బం ధిస్తామని ఆయన హెచ్చరించారు.

    టిఆర్ఎస్ నేతలు సిరికొండ మధు సూదనాచారి, వి శ్రీనివాస్ గౌడ్ లో మాట్లాడుతూ బీసీలకు అన్యాయం చేయడంలో కాంగ్రెస్ పార్టీకి ఈ దే శంలో ఎవరు సాటి లేరని, నాటిని ఎవరూ కాంగ్రెస్ నుండి నేటి రాహు ల్ కాంగ్రెస్ వరకు బీసీలకు ద్రోహం చేశారని, కుక్క తోక వంకర అన్న చందంగా బీసీ రిజర్వేషన్ల విష యంలో కాంగ్రెస్ బుద్ధి మారలేదని వారు తీవ్రంగా ధ్వజమెత్తారు. కాం గ్రెస్ బిజెపిలకు బీ సీలపై చిత్తశుద్ధి లేదని, బీసీల పట్ల ఏమాత్రం వారికి చిత్తశుద్ధి ఉన్న ఈ శీతాకాల పార్ల మెంట్ సమావేశాలలో బీసీ రిజర్వే షన్ల పెంపు కోసం రాజ్యాంగాన్ని స వరించి బీసీ రిజర్వేషన్లకు రాజ్యాం గ బద్దత కల్పించాలని వరి డిమాం డ్ చేశారు. బీసీ జేఏసీ చేస్తున్న పో రా టానికి టిఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని వారు ప్ర కటించారు.

    కాగా ఈ మహాసభకు ఫోన్ ద్వారా పార్లమెంటు సభ్యులు ఈటల రా జేందర్ సందేశం అందించారు. బీసీ జేఏసీ చేస్తున్న పోరాటానికి తన వంతుగా పూర్తి మద్దతు ఉంటుంద ని, బీసీలకు గ్రామపంచా యతీ ఎ న్నికల్లో జరిగిన మోసాన్ని బీసీలు గ్ర హించి, ప్రస్తుతం జరి గే సర్పంచ్ ఎ న్నికలలో జనరల్ స్థానాలను కూడా బీసీలు బరిలో ఉండి గెలిపించుకొని బీసీల రాజకీయ ఐక్యతను చాటాలని ఈటెల రాజేందర్ కోరారు.

    ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సం ఘం జాతీయ అధ్యక్షులు తా టికొండ విక్రమ్ గౌడ్, బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షులు కనకాల శ్యాం కురుమ, బిసి జేఏసీ కో చైర్మ న్ శేఖర్ సగర, జేఏసీ నేతలు బిటి మల్లయ్య, వీర స్వామి, మహిళా సంఘం రాష్ట్ర అధ్య క్షులు బి మని మంజరి, ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం చంద్రశేఖర్ గౌడ్, జి ల్లాల నరసింహ, ప్రొఫెసర్ సంఘని మల్లే శ్వర్, ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు, వడ్ల కొండ వేణుగోపాల్, దాసరి ఉ ష, డాక్టర్ రూపన రమేష్, మెట్టు బంగారం, జుర్రిగల శ్రీనివాస్, ఎక్కా ల దత్తు, నాగుల కనకయ్య, నల్ల సోమ మల్లయ్య, ఈగ శ్రీనివాస్ గౌడ్, తారకే శ్వరి, శివమ్మ, బీసీ జే ఏసీ కన్వీనర్ జాజుల లింగ గౌడ్, ఓయూ జే ఏసీ చైర్మన్ బొల్లెపల్లి స్వా మి, రా వులకోల్ నరేష్ ప్రజాపతి, పాల కూరి కిరణ్, తదితరులు ప్రసంగించారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.