Sunday, September 27, 2026
More
    HomeOpinionthungathurthi mla Mandula Samuel : నచ్చని ఓట్లను తొలగించేందుకు బీజేపీ కుట్ర

    thungathurthi mla Mandula Samuel : నచ్చని ఓట్లను తొలగించేందుకు బీజేపీ కుట్ర

    📰 Generate e-Paper Clip

     

    thungathurthi mla Mandula Samuel : ప్రజా దీవెన, తుంగతుర్తి: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బీజేపీ ప్ర భుత్వం బెంగాల్‌, తమిళనాడు రాష్ట్రాల్లో తమకు అనుకూలంగా లే ని వారి ఓట్లను లక్షల్లో తొలగిం చిందని, తెలంగాణ రాష్ట్రం లో సై తం ఓట్లను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నా యని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ ఆరోపించా రు. తుంగతుర్తి నియో జకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం బూత్‌ లెవల్‌ ఏజెంట్లకు సర్‌ (SIR) కార్యక్రమంపై నియో జకవర్గ ఇన్చార్జి కొండేటి మల్ల య్య తో కలిసి ఎమ్మెల్యే సామెల్ సమీక్ష సమావేశం నిర్వ హించారు.

    ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లా డుతూ…2002లో చేప ట్టిన ఓటరు జాబితా సవరణ కార్యక్రమం తరహాలోనే ప్రస్తు తం ప్రత్యేక స మగ్ర సవరణ ప్రక్రియ కొనసాగు తుందన్నా రు. బిఎల్ఎలు అప్ర మత్తంగా ఉండి ప్రజలకు అవస రమైన సహకారం అందించాలని సూచించారు. ప్రతి ఒక్కరు తమ ఓటు బీఎల్‌వోల వద్ద ఉన్న ఓట రు జాబితాలో ఉందో లేదో తప్ప నిసరిగా పరిశీలించుకోవాలని కోరారు. కాంగ్రెస్‌ పార్టీ సర్పంచులు, నాయకులు, మాజీ ప్రజాప్ర తినిధులు సామా జిక బాధ్యతగా గ్రామాల్లో ప్రజలకు ఓటరు జాబి తాపై అవ గాహన కల్పించాలని తెలిపారు.

    ఓటరు జాబితాలో ఏదైనా కారణంతో పేరు లేకపోతే సం బంధిత దరఖాస్తు ఫారాన్ని నింపి గ్రామ, మండల, జిల్లాస్థా యి అధికారులకు సమర్పిం చేలా ప్రజలకు మార్గనిర్ధేశం చే యాలని సూచించారు. బతు కుదెరువు కోసం వివిధ ప్రాం తాలకు వెళ్లి వెళ్లి నివసిస్తున్న వారి వివరాల ను కుటుంబ సభ్యులు బీఎల్‌ఏ లకు అందిం చాలన్నారు. అవసరమైతే కుటుంబ సభ్యులు అఫి డవిట్‌ రూపంలో సంబంధిత అ ధి కారులకు వివరాలు సమర్పించాలని తెలిపారు. నియోజక వర్గ పరిధిలో ఇప్పటికే అన్ని గ్రామా ల్లో డప్పు చాటింపు, మైక్‌ ప్రకట నల ద్వారా ఓటరు జాబితా సవరణపై అవగా హన కల్పిస్తున్నామన్నారు.

    బీజేపీ ప్రశ్నించే గొంతులను అణ చివేసేందుకు ప్రతి పక్షాల కు చెందిన ఓట్లను తొలగించే ప్రయత్నాలు జరుగుతు న్నా యని ఆరోపించారు. బెంగాల్‌, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో బీజేపీకి నచ్చని వారి ఓట్లను లక్షల సంఖ్యలో తొలగించే ప్రయత్నాలు జరిగాయని, తెలంగాణలో కూడా ఓట్లను తొల గించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ప్రజలు ఎట్టి పరి స్థితిల్లోనూ నిర్లక్ష్యం చేయకుండా తమ ఓటు జాబితాలో ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోవా లని, ఓటు హక్కును కాపాడుకో వాలని పిలుపునిచ్చారు.

    అందుకు 9 మండలాల అధ్యక్షు లు క్షేత్రస్థాయిలో ఉంటూ పర్యవే క్షించాలని ఆదేశించారు. ఈ స మావేశంలో కాంగ్రెస్ పార్టీ తుంగ తుర్తి మండల కమిటీ అధ్యక్షుడు రేగటి రవి, తుంగతుర్తి సింగిల్ విండో చైర్మన్ గుడిపాటి సైదులు, వ్యవ సాయ మార్కెట్ కమిటీ వై స్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, గ్రంథాలయ చైర్మన్ గంగరాజు, బిఎల్ఎ ల నియోజకవర్గ కోఆర్డి నేటర్ పానుగంటి నరసింహా రెడ్డి, 9 మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్య క్షులు, సింగల్ విండో చైర్మన్లు, వి విధ గ్రామాల సర్పంచులు, స ర్పంచుల ఫోరం ఉపాధ్యక్షుడు కలకోట్ల మల్లేష్, పోలేపాక రా మ చంద్రు, దాసరి శ్రీను, మా చర్ల అని ల్, గ్రామ శాఖ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకు లు, బి ఎ ల్ ఏ లు, కార్యకర్తలు తదితరు లు పాల్గొన్నారు.

      తుంగతుర్తిలో భారీ జాతీయ జెండా ఏర్పాటు

    తుంగతుర్తి: తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలోని ఎంపీడీ వో కార్యాలయ ఆవరణలో 56 అడుగుల అతిపెద్ద జాతీయ జెండా ఏర్పాటు చేయడానికి ప్రతిపాదించిన స్థలాన్ని ఎమ్మె ల్యే మందుల సామెల్ మంగళవారం పరిశీలించారు. ఈ సం దర్భంగా కాంగ్రెస్ పార్టీ సర్ (SIR )తుంగతుర్తి నియోజకవర్గ ఇన్చార్జి, కాంగ్రెస్ పా ర్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొండేటి మల్ల య్య, కాంగ్రెస్ పార్టీ నాయ కులతో కలిసి స్థలాన్ని పరిశీలించి న ఎమ్మెల్యే, జాతీయ జెండా ఏర్పాటు కోసం అవసరమైన సాంకే తిక అంశాలు, స్థల విస్తీర్ణం, ప్ర జ లకు స్పష్టంగా కని పించే విధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు.

    ఉద్యమాల పురిటి గడ్డైన తుంగ తుర్తి ప్రజల్లో దేశభక్తి భావ నను మరింత పెంపొందించడంతో పా టు, జాతీయ పతాకం పట్ల గౌ ర వాన్ని చాటేలా ఈ భారీ జాతీయ జెండా ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజలు గర్వంగా భా వించేలా, నియోజకవ ర్గానికి గుర్తింపుగా నిలిచే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు.

    ఈ పరిశీలనలో ఎంపీడీవో చలప తి, కాంగ్రెస్ పార్టీ తుంగతు ర్తి మండల అధ్యక్షుడు రేగటి రవి, ఉ మ్మడి నల్లగొండ జిల్లా డిసిసిబి డై రెక్టర్,సింగిల్ విండో చైర్మన్, గుడి పాటి సైదులు, వ్యవసాయ మా ర్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింత కుంట్ల వెంక న్న, గ్రంథాలయ చై ర్మన్ గంగరాజు,మండలాల కాం గ్రెస్ పార్టీ అధ్యక్షులు, తుంగతుర్తి సర్పంచుల పోరం ఉపాధ్యక్షుడు కలకోట్ల మల్లేష్, పోలేపాక రామచంద్రు, దాసరి శ్రీను, మాచ ర్ల అనిల్,గ్రామ సర్పంచులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొ న్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.