Tragedy Video Call Death Incident : ప్రజా దీవెన, కా జీపేట: కుటుంబంలో ఆస్తి తగాదాలు సహజమే. కానీ, ఆక్ష ణికావేశం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంటుందని, ఆ మృత్యువు లైవ్‌లో కనిపిస్తుందని ఆ భార్య ఊహించ లేక పోయింది. ఫో న్ స్క్రీన్‌పై భర్త రూపం.. వెనుక నుంచి దూ సుకొస్తున్న రైలు కూత.. క్షణాల్లో అంతా శూన్యం. వరంగల్ జిల్లా కాజీపేటలో ఆదివారం రాత్రి జరిగిన ఈ విషాద ఘట న ప్రతి ఒ క్కరినీ కలచివేస్తోంది.వరంగల్ రి జిస్ట్రేషన్ కార్యా లయం వద్ద దస్తా వేజు లేఖరిగా పనిచేసే రాజేశ్ నా యక్ (45)ది ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబం. ఒక కుమా రుడు కూడా ఉన్నాడు. అయితే, కొంతకాలంగా ఆయన ఇం ట్లో ఆస్తి పంపకాల విషయంలో భార్యకు, తల్లిదండ్రులకు మ ధ్య తీవ్రమైన గొడవ లు జరుగుతున్నాయి. నిత్యం జరిగే ఈ మనస్పర్థలతో రాజేశ్ తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యా డు. ఆదివారం రాత్రి కూడా ఇంట్లో పెద్ద గొడవ జరిగింది. ఆ ఆగ్ర హంతో, ఆ వేదనతో రాజేశ్ ఇల్లు వదిలి బయటకు వెళ్ళి పోయాడు.
‘లైవ్’లో మృత్యువు, తేలిగ్గా తీసుకున్న భార్య
ఇల్లు వదిలి వెళ్లిన రాజేశ్ కాజీపేట సమీపంలోని రైలు పట్టా ల వద్దకు చేరుకున్నాడు. రాత్రి చీకట్లో పట్టా లపై నిలబడి తన భార్యకు వీడి యో కాల్ చేశాడు.నేను ఆత్మహత్య చేసు కుంటున్నాను… ఇదిగో చూడు” అంటూ ఎదురుగా వస్తు న్న రైలును ఆమెకు వీడియో కాల్లో చూపించాడు.అయితే, ప్రతి రోజూ జరిగే గొడవల తరహాలోనే భర్త తనను భయపెట్ట డానికి ఇలా బెదిరి స్తున్నాడని భార్య భావించింది. ఆ కాల్ ను ఆమె తేలిగ్గా తీసుకుంది. కానీ, రాజేశ్ ఆవేశంలో తీరని నిర్ణ యం తీసేసుకున్నాడు. దూసుకొ చ్చిన రైలు కింద పడి తనువు చా లించాడు.
రాత్రంతా వేట, ఉదయానికి శవంలా
రాత్రి ఇంటికి రాకపోవడంతో ఆం దోళన చెందిన రాజేశ్ తల్లి దండ్రులు రాత్రంతా పరిసర ప్రాంతాల్లో అతడి కోసం గాలిం చారు. ఎక్కడా ఆచూకీ లభించలేదు. సోమవారం ఉదయం కాజీపేట రైలు పట్టాలపై ఒక వ్యక్తి మృతదేహం పడి ఉంద న్న సమాచారంతో కుటుంబ స భ్యులు అక్కడికి పరుగున వెళ్లా రు. అక్కడ పడి ఉన్న రాజేశ్ క్ష త గాత్ర దేహాన్ని చూసి కన్నీరుము న్నీరయ్యారు.రైల్వే పోలీసులు కేసు నమోదు చే సుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఒక చిన్న ఆస్తి వివాదం, సర్దుకుపో లేని పంతాలు.. చివరకు ఒక కు టుంబాన్ని రోడ్డున పడేశాయి. క్షణి కావేశంలో తీసు కునే నిర్ణయాలు జీవితాలను ఎలా బుగ్గిపాలు చే స్తాయో చెప్పడానికి ఈ ఘటనే ఒక నిదర్శనం. భర్తను కోల్పోయిన భా ర్య, తండ్రిని కోల్పోయిన కుమారు డు, కొడుకును కోల్పో యిన వృద్ధా ప్య తల్లిదండ్రుల రోదనలు చూసే వారిని కన్నీ రు పెట్టిస్తున్నాయి.


