Sunday, September 27, 2026
More
    HomeOpinionTrainee IPS Razor Blade Attack : బిగ్ బ్రేకింగ్, ఖాకీ కోటలో 'సైకో' డ్రామా,...

    Trainee IPS Razor Blade Attack : బిగ్ బ్రేకింగ్, ఖాకీ కోటలో ‘సైకో’ డ్రామా, తోటి ట్రైనీ ఐపీఎస్‌పై రేజర్ బ్లేడ్ వేధింపులు

    📰 Generate e-Paper Clip

    Trainee IPS Razor Blade Attack : ప్రజా దీవెన, హైద రాబాద్: అక్క డ శిక్షణ పొందితే దేశ రక్షణకు, శాంతిభద్ర తలకు బ్రాండ్ అంబా సిడర్లు కావాలి. కానీ, దేశంలోనే అ త్యంత ప్రతిష్టాత్మకమైన హైద రాబాద్ ‘నేషనల్ పోలీస్ అ కాడమీ (NPA)’ గోడల మధ్య ఊ హించని క్రైమ్ థ్రిల్లర్ సి నిమాను తలపించే దారుణం వెలుగుచూ సింది. రక్షించాల్సి న కాబోయే పో లీస్ అధికారి, తోటి మహిళా ట్రై నీ ఐపీఎస్ అధికారిణి పట్ల రాక్ష సుడిగా మారాడు.బాధితురాలు అత్తా పూర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోని వివరాలు వింటే ఒ ళ్లు గగుర్పొడుస్తుంది.

    జూలై 9న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి విచ క్షణ కోల్పోయాడు.తోటి అధికారిణి అని కూడా చూడకుం డా జుట్టు ప ట్టుకుని బలవంతంగా గదిలోకి లాక్కెళ్లాడు. మె డపై కత్తి పెట్టి ప్రాణభయంతో వణికిపోయేలా బె దిరించా డు. అంతటితో ఆగకుం డా ఆమెకు సంబంధించిన కొన్ని అ త్యంత వ్యక్తిగత (ప్రైవేట్) వీడియోలను ఫోన్ లో రికార్డ్ చే శాడు.

         భర్తకు వాట్సాప్ వీడియోలు..

    సైకో వికృత చేష్టలు బ్లాక్‌మెయిలింగ్ ఇక్కడితో ఆగలేదు. బాధితురాలి మొబైల్ ఫోన్‌ను బల వంతంగా లాక్కున్న ఉద య్ కృ ష్ణారెడ్డి, తను తీసిన ప్రైవేట్ వీడి యోలను నేరుగా ఆమె భర్త వా ట్సాప్ నెంబర్‌కు పంపించాడు. నిరంతరం అ సభ్యకరమైన మెసేజ్‌లు పంపుతూ, మానసికంగా వే ధిస్తూ నరకం చూపించాడని బా ధితురాలు కన్నీరు మున్నీరైంది.

    రంగంలోకి దిగిన ఖాకీలు..6 సెక్షన్ల కింద కేసు నమోదు

    కాబోయే ఐపీఎస్ అని చట్టం ఊరుకోలేదు. బాధితురాలి ఫి ర్యాదుతో అత్తాపూర్ పోలీసులు ఉ దయ్ కృష్ణారెడ్డిపై ఉ క్కుపాదం మోపారు.BNS 74, 75, 77 మ హిళ గౌరవానికి భంగం, లైంగిక వేధింపులు, BNS 315(2) క్రి మినల్ బెదిరిం పులు,IT Act 66 (C) సైబర్ నేరాలు / డేటాదొంగ తనం కిం ద కేసు నమోదు చేశారు.

        పోలీస్ వర్గాల్లో సంచలనం

    దేశాన్ని శాసించాల్సిన ఐపీఎస్ అధికారుల మధ్య, అదీ పో లీస్ అకాడమీ ప్రాంగణంలోనే ఇలాం టి వికృత చేష్టలు జర గడం పట్ల ఉన్నతాధికారులు షాక్‌కు గుర య్యారు.ప్రస్తుతం పోలీసులు ద ర్యాప్తును ముమ్మరం చేశారు. నిందితుడు ఉ దయ్ కృష్ణారెడ్డి స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసేందుకు పోలీసులు వేగంగా అడుగులు వే స్తున్నారు. చట్టాన్ని రక్షించాల్సిన వా డే ఇలా కంచే చేను మేసిన చందంగా మారడంతో ఈ ఘ ట న దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసులో భవి ష్యత్ పరమాణాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సి ఉం ది.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.