Sunday, September 27, 2026
More
    HomeOpinionMahatma Gandhi University : ఎంజీయూలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులు

    Mahatma Gandhi University : ఎంజీయూలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులు

    📰 Generate e-Paper Clip

    Mahatma Gandhi University : ప్రజా దీవెన, నల్లగొండ: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం, ఎన్ ఎస్ఎస్ ఆధ్వర్యం లో శుక్రవారం మహాత్మగాంధీ వర్ధంతి సందర్భంగా ని వాళు లు అర్పించారు. ఈ సందర్భంగా ఎంజియూ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ కాజా అల్తాఫ్ హుస్సేన్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ మహత్తర జీవితం, ఆదర్శాలను స్మరించుకోవడం మ న అందరి బాధ్యత, సత్యం, అహింస, నైతికవిలువలు అనే ఆయుధాలతో దేశానికి స్వాతంత్ర్యాన్ని సాధించిన మహనీ యుడు గాంధీజీ అని అన్నాడు.

    గాంధీ కేవలం ఒక నాయకుడు మా త్రమే కాదు, ఆయనఒక జీవన వి ధానం. స్వీయ క్రమశిక్షణ, సేవాభావం, సామాజిక సమానత్వం పట్ల ఆయన చూపిన అంకితభావం నేటి తరా నికి కూడా మార్గదర్శకం. విద్య అనేది కేవలం జ్ఞానం పొంద డం మాత్రమే కాదు, మంచి మనిషిగా మారడమే అన్న ఆ యన సందేశం విశ్వవిద్యాలయాల వంటి విద్యా సంస్థలకు అత్యంత ప్రాసంగికమై నది. నేటి కాలంలో పెరుగుతున్న అ సహనం, హింస, స్వార్థం మధ్య గాంధీ గారి ఆలోచనలు మ రింత అవసరంగా మారాయన్నారు.

    మన ఆలోచనల్లో, మాటల్లో కా ర్యాచరణలో సత్యం మరి యు అ హింసను పాటించినప్పుడే ఆయనకు నిజమైన ని వాళి అర్పించి న ట్లవుతుంది. ఈ సందర్భంగా వి ద్యార్థు లంతా గాంధీ ఆదర్శాలను తమ జీవితాల్లో అమలు చేస్తూ, సమాజానికి ఉపయోగపడే బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని ఆకాంక్షిస్తు న్నాను. అధ్యాపకులు మరియు సి బ్బంది కూడా ఆయన బోధనల నుంచి ప్రేరణ పొందుతూ వి ద్యా రంగంలో ఉత్తమ సేవలు అందించాలని కోరుకుంటు న్నానని చెప్పారు.

    మహాత్మా గాంధీ స్మృతికి ఘన ని వాళులు అర్పిస్తూ ఆయ న చూపిన మార్గంలో నడిచే శక్తి మనందరికీ కలగాలని కోరా రు. ఈ కార్యక్రమం లో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ అల్వాల ర వి, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ మారం వెంకట రమణారెడ్డి, ఇన్ఫా స్ట్రక్చర్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఆకుల ర వి, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫె సర్ అంజిరెడ్డి, యుసిసిబిఎం ప్రి న్సిపాల్ డాక్టర్ శ్రీదేవి,డాక్టర్ లక్ష్మీ ప్రభ, డాక్టర్ శేఖర్,ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు డాక్టర్ షరీఫ్, డాక్టర్ కిరణ్మయి, రమేష్ నాయక్ విద్యార్థులు పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.