Monday, September 28, 2026
More
    HomeOpinionVikarabad family Suicide Trogedy : బిగ్ బ్రేకింగ్, వికారాబాద్‌లో కలిచివేసిన విషాదం,ఇద్దరు చిన్నారులకు ఉరివేసి...

    Vikarabad family Suicide Trogedy : బిగ్ బ్రేకింగ్, వికారాబాద్‌లో కలిచివేసిన విషాదం,ఇద్దరు చిన్నారులకు ఉరివేసి తల్లి ఆత్మహత్య

    📰 Generate e-Paper Clip

     

    Vikarabad family Suicide Trogedy : ప్రజా దీవెన వికా రాబాద్: వికారా బాద్ జిల్లా అడవి వెంకటాపూర్ గ్రామంలో శనివారం హృదయాల ను కలిచివేసే విషాద ఘటన చో టు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓతల్లి తన ఇద్ద రు చిన్నారులకు ఉరివేసి, అనంతరం తాను కూడా ఆత్మ హ త్య చేసుకున్నట్లు ప్రాథమిక సమాచారం వెల్లడైంది. ఈ ఘ టనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతురాలిని నవనీతగా గుర్తించగా ఆమెకు ఏడేళ్ల కుమా రుడు విఘ్నేష్, ఐదేళ్ల కుమార్తె మధుప్రియ ఉన్నారు.

    స్థానికులు,కుటుంబ సభ్యుల కథ నం ప్రకారం, కొంతకాలం గా కుటుం బంలో వివాదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోం ది. ఈ నేపథ్యంలో తీ వ్ర మనస్తాపానికి గురైన నవనీత, శని వారం ఇంట్లోనే ఇద్దరు పిల్లలకు ఉరివేసి హతమార్చిన అ నంతరం తాను కూడా ప్రాణాలు తీసుకున్న ట్లు అనుమాని స్తున్నారు. కాగా ఘ టన గురించి సమాచారం అందుకు న్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసు లు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసు కుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప త్రికి తర లించారు. ఘటనకు సం బంధించిన పూర్తి వివరాలు సేక రిస్తూ దర్యాప్తు చేపట్టారు.

    ఒకే కుటుంబంలో ముగ్గురు మృత్యువాత

    ఒకే కుటుంబానికి చెందిన ముగ్గు రు మృతి చెందడంతో అడవి వెంకటాపూర్ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. చి న్నారుల మృతితో గ్రా మస్తులు కన్నీరుమున్నీరయ్యారు. కు టుంబ కలహాలే ఈ ఘోరానికి కారణమా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణాల్లో పోలీసులు విచారణ కొన సాగిస్తున్నారు.ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వి వరా లు తెలియాల్సి ఉంది.

      వికారాబాద్ ఘటన విషాదకరం

    కుటుంబ కలహాలు మనశ్శాంతి కరువైపోవడం.చివరకు క న్నపిల్లలనే కాటికి పంపి, తానూ అనంతలోకాలకు వెళ్లిపోవ డం. వికారాబా ద్‌ జిల్లా అడవి వెంకటాపూర్‌ గ్రామంలో నవ నీత అనే తల్లి, తన ఏ డేళ్ల కుమారుడు విఘ్నేష్, ఐదేళ్ల కు మార్తె మధుప్రియకు ఉరివేసి, ఆ పై తానూ ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతం సమాజాన్ని తీవ్రంగా కలచివేసింది. కు టుంబ కలహాలే దీని కి కారణమని ప్రాథమికంగా అను మా నిస్తున్నారు.అయితే, ఈ తరహా విషాదాలను కేవలం “మరో క్రైమ్ వార్త”గా చూసి వదిలేయాలా? భవిష్యత్తులో ఇలాంటి ప్రా ణాలు పోకుండా ఆపలేమా అన్న వాదన వినిపిస్తుంది.

    మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్మార్ట్ హోమ్స్ యుగంలో కి అడుగు పెడుతున్నాం. కానీ, ఒక గ్రామీణ ప్రాంతంలో ఒక తల్లి మానసిక వేద నను, ఆమె పడుతున్న నరకాన్ని పసిగ ట్టే కనీస వ్యవస్థ మనకు లేకుండా పోయిందని తేటతెల్ల మ వుతోంది. మానసిక ఒత్తిడి గుర్తింపు భవి ష్య త్తులో ప్రతి ప్రా థమిక ఆరోగ్య కేం ద్రంలో (PHC) మహిళల మానసిక ఆ రో గ్య కౌన్సిలింగ్ విభాగాలు విధిగా పనిచేయాలి. కుటుం బం లో గొడవలు జరుగుతున్నప్పుడు మహిళలు సురక్షి తంగా ఫిర్యాదుచేసే లేదా సహాయం కోరే డిజిటల్ హెల్ప్ లైన్లు మ రింత సులభతరం కావాలన్నారు. పల్లెల్లో కేవలం భౌతిక అ భివృద్ధి (రోడ్లు, డ్రైనేజీలు) మాత్ర మే కాదు, సామాజిక అభి వృద్ధి కూ డా ముఖ్యం. గ్రామంలోని ఆశా వర్కర్లు, ఐసీడీఎస్ (ICDS) సిబ్బంది కేవలం పిల్లల పోషకాహారం గురించే కా కుండా, తల్లుల మానసిక స్థి తిని కూడా గమనించేలా భవి ష్యత్తులో వారికి శిక్షణ ఇవ్వాల్సి ఉంది.

      మనకు కావాల్సిన భవిష్యత్తు

    “ప్రాణం పోకముందే స్పందించే సమాజం..ఆలోచించండి.. నవ నీ త ఆత్మహత్యకు కొన్ని గంటల ముం దు వరకూ తీవ్రమైన మాన సిక సంఘర్షణ అనుభవించి ఉం టుంది. ఆ సమయంలో ఆమెకు కౌ న్సిలింగ్ ఇచ్చే ఒక స్నేహపూర్వక హస్తం అంది ఉంటే.. ఈ రోజు వి ఘ్నేష్, మధుప్రియ అనే ఇద్దరు చి న్నారులు స్కూలుకు వెళ్తూ నవ్వుతూ కనిపించే వారు. కుటుంబ కల హాలు అనేవి ప్రతి ఇంట్లో ఉండేవే అ యినా, అవి ప్రాణాలు తీసే స్థా యికి వెళ్లకుండా భవిష్యత్తు లోనై నా మనం ఒక బలమైన సామాజిక రక్షణ వలయాన్ని నిర్మించుకోవాలి. అప్పుడే ఇలాంటి వార్తలు చరిత్రగా మారు తాయి, భవిష్యత్తులో పున రావృతం కావనేది సుస్పష్టం.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.