Sunday, September 27, 2026
More
    HomeOpinionWomen IAS : బిగ్ బ్రేకింగ్, మహిళా ఐఏఎస్ పై ప్రసారాలపై ప్రభుత్వం సీరియస్,...

    Women IAS : బిగ్ బ్రేకింగ్, మహిళా ఐఏఎస్ పై ప్రసారాలపై ప్రభుత్వం సీరియస్, పోలీసుల అదుపులో ముగ్గురు జర్నలిస్టులు

    📰 Generate e-Paper Clip

    బిగ్ బ్రేకింగ్, మహిళా ఐఏఎస్ పై ప్ర సారాలపై ప్రభుత్వం సీరియస్, పో లీసుల అదుపులో ముగ్గురు జర్న లిస్టులు

    Women IAS:  ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారి ని కించపరిచేలా వార్తలు ప్రసా రం చేశారంటూ నమోదైన కేసులో సెంట్రల్ క్రైమ్ (ccs) స్టేష న్ పోలీసులు యమస్పీడ్ గా ముందుకు సాగుతున్నారు. తెలంగాణ ఐఏఎస్ అధికారుల సంఘం తరఫున సీనియర్ ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయా డిజిటల్ మీడియా ( digital media), యూట్యూబ్ ఛానల్స్‌ పై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసిన విష యం తెలిసిందే. అయితే సదరు కేసులో మంగళవారం అర్ధ రాత్రి ఓఛానల్ ఇన్‌ పుట్ ఎడిటర్‌తో పాటు ఇద్దరు రిపోర్టర్ల ను అరెస్ట్ చేశారు. కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్తుండ గా ఇన్‌పుట్ ఎడిటర్‌ ను పోలీసులు అదుపులోకి తీసుకు న్నారు.

    ఇదిలా ఉండగా మహిళా ఐఏఎస్‌ ను కించపరిచే విధంగా సదరు ప్రధాన చానల్ తో పాటు 44 యూట్యూబ్ ఛానల్స్ కథనాలు ప్రసారం చేసినట్లు పోలీసులు గుర్తించగా ఈ క్ర మంలో ఆయా యూట్యూబ్ ఛానళ్లపై చర్యలకు రంగం సిద్ధ మైనట్లు సమాచారం. ఆయా ఛానల్స్ బాధ్యులను గుర్తించి అరెస్ట్ చేసేందుకు సీసీఎస్ పోలీసులు కసరత్తు ప్రారంభిం చారు. ఇప్పటికే పలువురిని పో లీసులు గుర్తించగా ఈ కేసు లో పోలీసుల దూకుడుతో పలువురు యూట్యూబ్ ఛానల్స్ నిర్వాహకులు అజ్ఞాతంలో ఉన్నట్లు తెలుస్తోంది.

    ఏది ఏమైనప్పటికీ సీఎం ఫొటో మా ర్ఫింగ్, మహిళా ఐఏఎ స్‌పై అసభ్య కర కథనాలపై తెలంగాణ ప్రభుత్వం సిట్‌ను ఏ ర్పాటు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఆదేశాల మేరకు 8 మంది సభ్యుల తో కూడిన సిట్‌ను ఏ ర్పాటు చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సి.సజ్జనార్ పర్యవేక్షణలో ఈ బృందం పనిచేస్తోంది. దర్యాప్తు వేగంగా పూర్తి చేసి ఛార్జ్‌షీట్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ అ య్యాయి.

    మరోవైపు మహిళా అధికారిపై అసభ్యకర కథనాలను మం త్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క తీవ్రంగా ఖండించా రు. అలాగే ఐఏఎస్, ఐపీ ఎస్ అసోసియేషన్లు కూడా ఈ వ్య వహారంపై సీరియస్ అయ్యాయి. ఇలాంటి వార్తలు అధికా రుల మనోభావాలను దెబ్బతీస్తాయని, చట్టపరంగా కఠిన చ ర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. ఈ నేపద్యం లోనే తాజా అరెస్టులు, త్వరలో కాబోయే అరెస్టులు అం టూ పరిశీలకులు భావిస్తున్నారు.

    అర్ధరాత్రి జర్నలిస్టుల అరెస్టును ఖండించిన టీయూడ బ్ల్యూజే : NTV జర్నలిస్టులు దొంతు రమేష్, పరిపూర్ణ చారి, సుధీర్ లను అర్థ రా త్రి పోలీసులు అరెస్టు చేయడాన్ని టీ యూడబ్ల్యూజే పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని టీయూ డబ్ల్యూజే (Tuwj ) రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు అల్లం నారా యణ, ఆస్కానిమారుతి సాగర్, తెంజు అధ్యక్ష, కార్యదర్శు లు విష్ణువర్ధన్ రెడ్డి, ఎ. రమణకుమార్ లు, టీయూడబ్ల్యూ జె నల్లగొండ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గుండగోని జయ శంకర్ గౌడ్, వీరస్వామి, శివ ప్రసాద్, జిల్లా తెంజు, అధ్యక్ష కార్యద ర్శులు వెంకటరెడ్డి, జానయ్యలు పేర్కొన్నారు.

    జర్నలిస్టులు గానీ, ఆ వార్త సంస్థ గాని నిరాధారమైన, అ సత్య వార్త కథనాలు రాస్తే ఆ విషయంలో ఖండన కోరు కో వచ్చు అప్పటికీ వారు స్పందించకపోతే చట్ట పరమైన చ ర్య లు తీసుకోవచ్చు కానీ, ఇలా అ ర్థరాత్రి ఎలాంటి నోటీసులు ఇవ్వ కుండా వారిని అరెస్టు చేయడం సరైంది కాదు. ఈ ము గ్గురూ జర్నలిజంలో కొనసాగుతున్న సీనియర్ జర్నలిస్టులు. వీరి అరెస్టును తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్న లిస్టుల సంఘం తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఇదే సమ యంలో జర్నలిస్టులకు సంఘం తరఫున ఒక సూచన కూ డా చేస్తున్నామన్నారు.

    ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, చిన్నారుల విషయంలో నిరాధారమైన వార్తలను ప్రసారం గాని, ప్రచురించవద్దని, ఆ ధారాలు ఉంటేనే వార్తలు వేయాలని, ముఖ్యoగా ఎవరి వ్య క్తిగత ప్రతిష్టను దెబ్బతీసే విధం గా వార్త కథనాలు రాకుండా చూసు కోవాల్సిన బాధ్యత ఆయా మీడియా సంస్థలపై ఉం టుందని గుర్తు చేశారు. ఏది ఏమైనా జర్నలిస్టులపై కేసులు నమోదు చేయడం అర్ధరాత్రి పూట తీవ్రవాదుల అరెస్టు చే యడం ఎంత మాత్రం సమంజసం కాదని, వెంటనే ప్రభు త్వం ఈ విష యంలో చొరవ తీసుకొని అరెస్టు చేసిన జర్న లిస్టులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తు న్నామన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.