yadadri bhuvanagiri acb rides : ప్రజా దీవెన, యాదా ద్రి భువనగిరి:రైతుకు న్యాయంగా రావాల్సిన విద్యుత్ కనె క్షన్ కోసం రూ. 35,000 లంచం డిమాండ్ చేసిన ఒక విద్యు త్ శాఖ అధికారికి ఏసీబీ అధికా రులు గట్టి ‘షాక్’ ఇచ్చారు. అవినీ తి నల్లధనాన్ని చేతుల్లోకి తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొ ని కటకటాల్లోకి నెట్టారు. సంఘట నకు సంబంధించి పూర్వాపరాలు ఇలా ఉన్నాయి.
మోటకొండూరు లోని TGSPDCL కార్యాలయంలో పప్పుల రమేష్ అసిస్టెంట్ లైన్ మ్యాన్ (ALM)గా పనిచేస్తున్నా డు. అదే ప్రాంతానికి చెందిన ఒక రైతు తన వ్యవసాయ భూమి లోని బోర్‌వెల్స్‌కు విద్యుత్ సరఫరా కా వాలని దరఖాస్తు చేసు కున్నాడు. పొలంలో కరెంట్ స్తంభా లు పాతి, ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేసి, కనెక్షన్ ఇవ్వడం సదరు లైన్ మ్యాన్ బాధ్యత. కానీ, రమేష్ మా త్రం రూ. 35,000 ఇస్తేనే ఫైల్ క దులుతుంది, పని అవుతుంది అంటూ సదరు రైతును వే ధించడం మొదలుపెట్టాడు.
లంచం ఇవ్వడం ఇష్టం లేని ఆ రైతు నేరుగా అవినీతి నిరో ధక శాఖ (ACB) అధికారులను ఆశ్రయిం చాడు.రైతు ఇచ్చి న సమాచారం తో నల్గొండ రేంజ్ ఏసీబీ అధికారులు రంగం లోకి దిగారు. మే 16న పక్కా వ్యూహం తో నిఘా పెట్టారు. లైన్‌మ్యాన్ ర మేష్ బాధితుడి నుం చి రూ. 35, 000 లం చం తీసుకుంటుండగా, ఏసీబీ అధికారులు ఒక్కసారిగా ఎ టాక్ చేసి రసాయన పరీక్షలతో సహా అతడిని రెడ్ హ్యాండె డ్గా పట్టుకున్నారు. నింది తుడి వద్ద నుంచి లంచం సొమ్ము ను స్వాధీనం చేసుకున్నారు.
తన విధిని పక్కన పెట్టి, అక్రమ సంపాదనకు ఆశపడ్డ లైన్ మ్యాన్ రమేష్‌ను ఏసీబీ అధికారులు అరె స్ట్ చేశారు. హైద రాబాద్ నాంపల్లి లోని SPE & ACB కేసుల మొదటి అద నపు ప్రత్యేక న్యాయమూర్తి ముందు హాజరుపరిచి, జ్యుడిషి యల్ రిమాండ్‌కు తరలిస్తున్నారు. కేసు దర్యాప్తు కొనసాగు తోంది. భ ద్రతా కారణాల దృష్ట్యా బాధితుడి వివరాలు గో ప్యంగా ఉంచబడ్డాయ ని తెలిపారు.
ఇదిలా ఉండగా ఏదైనా ప్రభుత్వ కార్యాలయంలో అధికారు లు మీ వద్ద లంచం డిమాండ్ చేస్తే భయప డకుండా మీ పే రు, వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని, వెంట నే క్రింది మార్గాల ద్వారా తె లంగాణ ఏసీబీని సంప్రదించా లని కోరుతున్నారు. టోల్ ఫ్రీ నంబర్ 1064, వాట్సాప్ 944 0446106, ఫేస్బుక్:తెలంగాణ ఏసీబీ (Tela ngana AC B), ఎక్స్ (ట్విట్టర్) @ తెలంగాణ ఏసీబీ, అన్ని ప్రభుత్వ కా ర్యాలయాలు, ప్రముఖ బహిరం గ ప్రదేశాలలో అందుబా టులో ఉ న్న ఏసీబీ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి కూడా ఫి ర్యాదు చేయవచ్చని ఏసీబీ అధికారులుచెబుతున్నారు.


