Nalgonda Mayor Burri Chaitanya Srinivas Reddy: ప్రజా దీవెన, నల్లగొండ నగరం: ప్రజా పాలన- ప్రగతి ప్రణా ళి క” కార్యక్రమం అమలులో భాగంగా సోమ వారం నల్లగొండ మున్సిపల్ కార్పొ రేషన్ ఆధ్వర్యంలో ఎన్జీ కళాశాల మైదా నం నుండి క్లాక్ టవర్ వరకు నిర్వహించిన 5 కే రన్ ను న గ ర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రె డ్డి జండా ఊపి ప్రారం భించారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉంటే అన్నీ ఉన్నట్లే న ని, అందువల్ల ప్రతి ఒక్కరూ వారి వా రి ఆరోగ్యాలపై దృష్టి సారించాలని కోరారు.
ప్రతి ఒక్కరు ప్రతినిత్యం ఇంట్లో కాకుండా బయటకు వచ్చి వాకింగ్ లేదా వ్యాయామం చేస్తే ఆరోగ్యం మెరుగు పడు తుందని చెప్పారు.ప్రభుత్వం అమలు చేస్తున్న పథకా లను ప్రజల్లోకి తీసుకువె ళ్లి వారు ఆపథకాల లబ్దిపొందేందుకు రా ష్ట్ర ప్రభుత్వం “ప్ర జాపాలన- ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కా ర్యచరణ ప్రణాళికను చేపట్టిందని, ఈ అవకాశాన్ని సద్వి ని యోగం చేసుకోవాలని ఆమె కోరారు.
జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ మాట్లా డుతూ ప్రభుత్వ ఆదేశా ల మేరకు ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన కల్పించడం ప్రభు త్వ పథకాల్ని ప్ర జలకు చేరవేయడం లక్ష్యంగా ఈ కార్యక్ర మాన్ని నిర్వహించామన్నారు.”ఆరోగ్యానికి మించిన ఆస్తి మ రొకటి లేదని, ఆరోగ్యం బాగుంటే అన్ని బాగుంటాయని కలె క్టర్ అన్నారు.
ప్రస్తుతం చాలామంది లైఫ్ స్టైల్ సమస్యలతో బాధపడు తు న్నారని, వాటిని దూరం చేసుకోవడానికి ఫిట్‌నెస్ అవస ర మన్నారు. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో వ్యా యామాన్ని భాగంగా చేసుకోవాలని, ప్రతిరోజూ శక్తి మేరకు న డక లేదా వ్యాయామం చేయాలని సూచించారు.5 కె రన్ ను ఎన్జీ కా లేజీ నుండి క్లాక్ టవర్ వరకు కొన సాగించారు.
అనంతరం మానవహారం నిర్వహించి రన్ లో పాల్గొన్న వారి తో జిల్లా కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో స్థా నిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, ము న్సిపల్ కమిషనర్ బి. శరత్ చంద్ర, మాజీ మున్సిపల్ చైర్మ న్ బుర్రి శ్రీనివాసరెడ్డి, కార్పొరేటర్లు పెరిక స్వాతి , మామిడి కార్తీక్ డా క్టర్ పుల్లారావు, ప్రజాప్రతినిధులు, యువత అధి కారులు, మున్సిపల్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నా రు.


