Tuesday, September 29, 2026
More
    HomePoliticsNalgonda Collector Chandrashekhar : నల్లగొండ కలెక్టర్ అప్పీల్, బాలల భద్రత రక్షణ,మత్తుపదార్థాలకు నో చెప్పండి...

    Nalgonda Collector Chandrashekhar : నల్లగొండ కలెక్టర్ అప్పీల్, బాలల భద్రత రక్షణ,మత్తుపదార్థాలకు నో చెప్పండి సంక్షేమవారోత్సవంపై అ వగాహన కల్పించాలి 

    📰 Generate e-Paper Clip

    Nalgonda Collector Chandrashekhar : ప్రజా దీవెన, నల్లగొండ: ప్రజా పాల న ప్రగతి ప్రణాళిక 99 రోజుల కా ర్యక్రమంలో భాగంగా ఈ నెల 27 నుండి మే 2 వరకు నిర్వ హించ నున్న “బాలల భద్రత రక్షణ మత్తు పదార్థాలకు నో చెప్పండి” సంక్షేమ వారోత్సవంపై ప్రజలకు పెద్ద ఎత్తు న అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ జిల్లా అధి కారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవా రం ఆయన కలెక్టర్ కార్యాలయం లోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరిం చారు.

    ఫిర్యాదుల స్వీకరణ అనంతరం జి ల్లా అధికారులతో సమీక్షిస్తూ ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్ర మంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ వారంపైన పేర్కొన్న అంశంపై వారోత్సవాలను నిర్వహించాలని ఆదేశించడం జరిగిందని, మండలా ల ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు మండల స్థాయిలో ఈ కార్యక్రమాలకు హాజరై కార్యక్రమా న్ని విజయవంతం చేసేలా కార్యా చరణ ప్రణాళిక రూపొందించాల న్నారు.

    ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కా ర్య క్రమంలో సంబంధిత అధికారుల తో పాటు, జిల్లా అధికారులందరూ పాల్గొనాలని ఆదేశించారు. జిల్లా సంక్షేమ, బాలల పరిరక్షణ కమిటీ, పోలీస్, విద్యా శాఖల ఆధ్వర్యం లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించా లని, మత్తు పదార్థాలపై పెద్ద ఎత్తు న ప్రజలకు అవగాహన కల్పించాల ని, ప్రత్యేకించి విద్యార్థులకు సమా చారం చేరే విధంగా చర్యలు తీసు కోవాలని ఆదేశించారు.ఇందులో భాగంగానే జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఈ వారంలో మత్తు ప దార్థాల డిఅడిక్షన్ సెంటర్ ను ప్రా రంభించేలా చర్యలు తీసుకోవా ల ని ప్రధాన ఆస్పత్రి సూపరింటిండెం ట్ ను ఆదేశించారు.

    వచ్చే నెల నుండి పూర్తిస్థాయిలో అన్ని శాఖలు ఫైళ్లను ఈ- ఆఫీస్ ద్వారానే పంపించాలని చెప్పారు. జనగణన లో భాగంగా ప్రతి ఒక్క రు స్వీయ జనగణనను వెంటనే పూర్హి చేయాలని ఈ విషయంపై అందరికి అవగాహన కల్పించాల న్నారు. ఈనెల 28న జిల్లాకు రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషన్ రానున్నందున జిల్లా అధికారులం దరూ వారి వారి కార్యాలయాలకు సంబంధించిన సమాచార హక్కు చట్టం దరఖాస్తులు, రిజిస్టర్లు అ న్నింటినీ సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పారు.

    ఇందిరమ్మ గృహ నిర్మాణాలు పూ ర్తయిన చోట గృహప్రవేశాలకు సి ద్ధం చేయాలన్నారు.ప్రజావాణి ద్వా రా స్వీకరించిన పిర్యాదులన్నీ తక్ష ణమే పరిష్కరించాలని, ఈ అంశా నికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇస్తున్నదని, దీన్ని దృ ష్టిలో ఉంచుకొని ఎప్పడి ఫిర్యాదు లు అప్పుడే పరిష్కరించాలని అ న్నారు.రాష్ట్రప్రభుత్వం ప్రభుత్వ ఉద్యో గు ల బదిలీలకు జీవో జారీ చేసినందున జిల్లాలో బదిలీలు పా రదర్శకంగా నిర్వహించాలని చె ప్పారు. జిల్లాలో పెద్ద ఎత్తున జాబ్ మేళా నిర్వహణకు చర్యలు తీసు కోవడం జరుగుతున్నదని, అందు వల్ల ఆయా శాఖల వారీగా ఖాళీల ను ఈ నెల 30లోగా జిల్లా క్రీడలు, మరియు యువజన సర్వీసుల శా ఖ అధికారికి పంపించాలని ఆదే శించారు.

    అలాగే జిల్లా అధికారులందరూ క్షే త్రస్థాయి పర్యటనకు సంబంధిం చి న టూర్ డైరీలను శనివారంలోగా సమర్పించాలని ఆదేశించారు. కా గా ఈ సోమవారం( 58) ఫిర్యా దు లు, ఇతర శాఖలకు (39 )ఫి ర్యా దులు వచ్చాయి. రెవెన్యూ అ దన పు కలెక్టర్ జె. శ్రీనివాస్, స్థానిక సం స్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, ఆర్డీవోలు రమణారెడ్డి, శ్రీదేవి, జిల్లాకు నూతనంగా కే టా యించిన ట్రైనీ ఐఏఎస్ అసిస్టెంట్ కలెక్టర్ ఎన్. శ్రీకాంత్ రెడ్డి తదిత రులు ఉన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.