–సామాజిక న్యాయమే కాంగ్రెస్ పా ర్టీనీ కాపాడుతుంది
–పెద్దల సీటు, స్కాములు చేసే గద్ద లకి ఇవ్వకండి
–అగ్రకుల ధనవంతులకు ఇస్తే రా జ్యసభ సీటును వ్యాపారం కోసం వాడుకుంటారు
Jajula Srinivas Goud : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ రాష్ట్రం నుండి మార్చి నెలలో భ ర్తీ జరిగే రెండు రాజ్యసభ స్థానాల్లో ఒకటి బీసీకి, ఇంకోటి ఎస్సీ ఎస్టీల కు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి బీసీ సం క్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ విజ్ఞప్తి చేశా రు. ఈ మేరకు శనివారం రాహుల్ గాంధీ కి జాజుల శ్రీనివాస్ గౌడ్ లేఖ రాశారు. రాహూల్ కు వ్రాసిన లేఖ లో శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలు ఆయ న మాటల్లోనే…ప్రదానంగా దేశ వ్యాప్తంగా కులగనన జరగాలని కు లగణాంకాల ఆధారంగా జనాభా దామాషా ప్రకారం ఎవరి వాటా వా రికి దక్కలన్న మీ యొక్క మాటలు దేశంలోని 90 కోట్ల మంది బహు జనులకు ఎంతో స్ఫూర్తినిచ్చా యి.
ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో కూడా మీ మాట అమలు జరిగి తే నే దేశమంతా మిమ్మల్ని విశ్వసి స్తుంది. ముఖ్యంగా మీరు అధికా రంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం అమలు చేసే దిశగా ఆలోచన చేయవలసిన అ వసరం ఉన్నది, సామాజిక న్యాయ అమలే దేశంలో కాంగ్రెస్ పార్టీని అ గ్రభాగాన నిలబెడుతుందని, ఈ వాస్తవాన్ని మీరు గ్రహిస్తారని ఆశి స్తున్నా, ప్రస్తుతం మార్చ్ నెలలో భర్తీ చేయబోయే రెం డు రాజ్యసభ స్థానాలలో ఒకటి బీ సీలకు ఇంకొ కటి ఎస్సీ, ఎస్టీలకు కే టాయించా ల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాo.
రాజ్యసభ సీటు బడుగులకు అ స్తి త్వం అయితే, అగ్రకుల ధనవం తు లకు అలంకారం లాంటిది, పెద్దల సభకు పేదల అస్తిత్వం కోసం పో రాడే వారిని పంపించాలే కానీ, రా జ్యసభ సీటును అడ్డం పెట్టుకొని స్కాములు చేసే గద్దలకు అ వకా శం ఇస్తే ప్రజాస్వామ్యాన్ని కునీ చే స్తారు.బడుగులకు రాజ్యసభ సీటు మీరు కేటాయిస్తే తెలంగాణలో బీ సీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు క ల్పించాలని అసెంబ్లీలో చేసిన చ ట్టాన్ని పార్లమెంట్లో అమలు చేయా లని పోరాడుతారు, అదే మీరు అ గ్రకుల ధనవంతులకు అవకాశం క ల్పిస్తే రాజ్యసభ సీటుతో డిల్లి పాల కులతో రాజీ పడి సొంత లాభం కో సం రాజ్యసభ సీటును వ్యాపారం గా మలుచుకుంటారు. ఇప్పటికే తె లంగాణ రాష్ట్రం నుండి అగ్రకులా లకు వారి జనాభా దామాషా కంటే చట్టసభలలో 60% అధికంగా ప్రా తినిధ్యం పొందుతున్నారు.
పార్లమెంటులో కూడా అగ్రకులాల వారే అత్యధికంగా 80 శాతం ఉ న్నారు. మళ్ళీ ఇప్పుడు రాజ్యసభ సీట్లు అగ్రకులాలకు కేటాయిస్తే బీ సీ, ఎస్సీ, ఎస్టీలకు తీవ్రని అన్యా యం జరుగుతుంది.90 శాతం ఉ న్న బహుజనుల గొంతు చట్టసభ ల్లో వినిపించదు. తెలంగాణ రా ష్ట్రంలో బీసీల కోసం సుదీర్ఘకాలం గా జీవితాంతం పనిచేస్తున్న వారు అనేక మంది కాంగ్రెస్ పార్టీలో ఉ న్నారు, అందులో అగ్రగన్యుడుగా బీసీల పితామహుడుగా వి హ ను మంతరావు ముందు వరసలో ఉం టారు ఇలాంటి వారికి మీరు రా జ్యసభ అవకాశం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
వారే గా కుండా తెలంగాణ ఉద్య మంలో పదవులను వదులుకొని పనిచేసిన వారు, సామాజిక న్యా యం కోసం ప్రతినిత్యం పోరా డు తున్న వారు ఉన్నారు. ఇలాంటి వా రిని కూడ దృ ష్టిలో పెట్టుకొని బీసీ ల విషయంలో సానుకూలంగా నిర్ణ యం తీసుకుంటారని ఆశిస్తున్నo. లేదంటే అగ్రకుల ధనవంతులకు, వ్యాపారస్తులకు, అవకాశం కల్పిస్తే కాంగ్రెస్ పార్టీ దేశంలోనే అధోగతి పాలవక తప్పదని సున్నితంగా హె చ్చరిస్తున్నాం, అంటూ జాజుల శ్రీ నివాస్ గౌడ్ లేఖలో రహూల్ గాం దికి తెలిపారు.
