Wednesday, September 30, 2026
More
    HomeOpinionBC resorvations Ultimatum : బీసీసంఘాల అల్టిమేటం, దేశంలో కులగణన జరిపితీరాల్సిందే, బీసీరిజర్వేషన్లు పెంచాల్సిందే

    BC resorvations Ultimatum : బీసీసంఘాల అల్టిమేటం, దేశంలో కులగణన జరిపితీరాల్సిందే, బీసీరిజర్వేషన్లు పెంచాల్సిందే

    📰 Generate e-Paper Clip

    –ఢిల్లీలో బీసీల మహా ధర్నాలో పా ల్గొన్న 16 మంది ఎంపీలు, 15 రా ష్ట్రాల ఓబిసి నేతలు

    –మహాధర్నాకు మద్దతు ప్రకటించి న కాంగ్రెస్, టిఆర్ఎస్, టిడిపి, ఎ న్సిపి, ఇతర పార్టీలు

    –కుటుంబాలు లెక్కించనిది, కులగ నణ ఎలా చేస్తారో కేంద్రం సమాధా నం చెప్పాలి

    –బీసీ కులగణన పై పార్లమెంటులో ప్రత్యేక చర్చపెట్టాలి

    –ఢిల్లీ మహాధర్నాలో అఖిలభారత బిసి నేతలు జాజుల, కేసన, బబన్ రావ్ ల వెల్లడి

    BC resorvations Ultimatum : ప్రజా దీవెన, న్యూఢిల్లీ: బీసీల సు దీర్ఘ పోరాట ఫలితంగా దేశవ్యాప్తంగా జరిగే జాతి జనగణలో సమగ్ర కులగణన చేపడతామని గత సంవత్స రం ఏప్రిల్ 30వ తేదీన జరిగి న కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీ సుకున్నారని, రేపు రాబోయే ఏప్రిల్ ఒకటో తేదీ నుండి దేశ వ్యాప్తంగా జనగణలలో భాగంగా కుటుంబాల లెక్కింపు చే స్తూ, బీసీ కుటుంబాలను మాత్రం లెక్కించకపోవడం దా రు ణమైన అన్యాయమని బీసీ సం క్షేమ సంఘం జాతీయ అ ధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, రాష్ట్రీయ ఓబీసీ మహా సంఘం అ ధ్యక్షులు ప్రొఫెసర్ బబన్ రావ్ తైవాడే, ఏపీ అధ్యక్షులు కేస న శంకర్రావులు అన్నారు. సోమవారం బీసీ సంక్షేమ సం ఘం, రా ష్ట్రీయ ఓబీసీ మహా సంగ్ ఆ ధ్వర్యంలో జాతిజ న గణనలలో బీసీ కుటుంబాలను లెక్కించి కులగనన ప్రారం భించాలనే డిమాండ్ తో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పె ద్ద ఎత్తున మహాధర్నా చేపట్టారు.

    బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆ ధ్వర్యంలో జరిగిన మహా ధర్నాకు దేశంలోని 16 మంది పార్లమెంట్ సభ్యులు, ఎనిమిది రాజకీయ పార్టీలు, 15 రాష్ట్రాల నుండి ఓబీసీ ప్రతినిధులు పాల్గొన్నారు. కాంగ్రె స్ నుండి ఎంపీ మల్లు రవి, టిఆర్ఎస్ నుండి మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌ డ్, టిడిపి ఎంపీలు అప్పలనాయు డు, నాగ రాజు, రాష్ట్రాల నుండి కాంగ్రెస్, ఎన్సిపి, తదితరులు పా ల్గొ ని మహాధర్నాకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

    ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బీసీ కులగణన పై కేంద్ర ప్రభుత్వం మొదటి నుండి కొర్రీలు పెడు తూ, అయిష్టంగా వ్య హరించిందని, దేశవ్యాప్తంగా బీసీ ల లో వచ్చిన చైతన్యం తప్పని పరి స్థితుల్లో కులగణన చేస్తా మని ప్రకటించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం జాతి జనగణన ను రెండు దపాలుగా చేపట్టాలని నిర్ణయించి, మొదటి దపా లో కుటుంబాలను లెక్కిం చాలని 33 ప్రశ్నలతో గెజిట్ నోటి ఫికేషన్ విడుదల చేసిందని, అం దులో ఎస్సీ ఎస్టీ కుటుం బాలను లె క్కించాలని కోరుకుంటూ బీసీ కు టుంబాలను లెక్కించడమే లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై బీసీ ల కు అనుమానాలు ఉన్నాయా నీ, బీసీల అనుమానాలను ని వృత్తి చేయడానికి ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బీసీ కు లదానాపై ప్రత్యే కంగా చర్చించి కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.

    మా డిమాండ్ల ను అంగీకరించలేని నిపక్షంలో దేశవ్యాప్తంగా పోరాడ డానికి జాతీయస్థాయిలో జేఏసీ ని ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా బ స్సు యాత్ర చేపట్టి లక్షలాది మంది తో ఢిల్లీని ముట్టడిస్తామని హెచ్చ రించారు.

    పార్లమెంట్ వేదికగా కేంద్రంతో పోరాడుతం..

    దేశవ్యాప్తంగా బీసీ కులగన చేస్తా మని విధాన నిర్ణయం ప్రక టించిన కేంద్రం ఇప్పుడు మాట తప్పి వ్యవహరిస్తుందని, కేం ద్రం ప్రభుత్వం యొక్క రెండు నాలుకల ధోరణిపై పార్లమెంట్ లో వేదికగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం దిగివచ్చే వరకు పో రాడుతామని కాంగ్రెస్ ఎంపీలు మల్లురవి తెలిపారు

    బీసీ ప్రధాని హయాంలో బీసీలకు అన్యాయమా

    దేశంలో బీసీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నప్పటికీ బీసీ లకు అన్యా యం జరుగుతూనే ఉందని, కులగ నన చేయక పోవడమే కాకుండా, కేం ద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రి త్వ శాఖ ఏర్పాటు చేయకపోవడం, మహిళా బిల్లులు బీసీ మ హిళలకు సబ్ కోట కల్పించకపోవడం, కొత్త సవాళ్లు బీసీల కు రిజర్వే షన్లు పెట్టకపోవడం చాలా అన్యాయమని టిఆ ర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ అ న్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి ఇ లాగనే ఉంటే అన్ని పార్టీలు కలుపు కొని ఢిల్లీ కూటమి లక్షలాది మందితో ముట్టడిం చ డానికి సిద్ధం కావా లని ఆయన పిలుపునిచ్చారు.

    ప్రధానితో చర్చించి బీసీకులగనన జరిగేలా కృషి చేస్తాం

    బీసీల విషయంలో టిడిపి మొదటి నుండి సానుకూల దృ క్పథంతోనే ఉన్నదని, బీసీ కులగన విషయం లో తమ అధి నేత చంద్రబాబు నా యుడుతో చర్చించి ప్రధానమంత్రి పైన ఒత్తిడి పెంచి బీసీ కులగణన సవ్యంగా జరిగేలా కృషి చేస్తా మని టిడిపి పార్లమెంటు సభ్యులు అప్ప లనాయుడు, అం బిక లక్ష్మీనారాయణ, కర్నూలు ఎంపీ నాగరాజు తెలిపారు ఎన్ డి ఏ కూటమిలో భాగస్వామిగా ఉన్నప్పటికీ బీసీల వి షయంలో రాజీ పడకుండా పోరాడుతామని, బీసీ సంఘా లు చేస్తున్న ధర్నా సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తున్నామని వారు తెలిపారు

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సం ఘం అధ్యక్షులు కేసిన శంకర్రావు మాట్లాడుతూ బీసీ కుటుంబాల లెక్కింపు తదనం తరం కులగన లె క్కింపు తర్వాత జనాభా దామాషా ప్రకా రం బీసీ రిజర్వేషన్లు పెంచాల ని, బీసీల వాటా బీసీలకు త గ్గేవర కు పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఆయన వెల్లడిం చారు

    ఈ కార్యక్రమంలోబీసీ జేఏసీ వ ర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, బీసీ సం క్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర వ ర్కింగ్ ప్రెసిడెంట్ కుల్కచర్ల శ్రీని వాస్ ముదిరాజ్, బీసీ విద్యార్థి సం ఘం జా తీయ అధ్యక్షులు తాటికొండ విక్రమ్ గౌడ్, బీసీ యువజన సం ఘం జాతీయ అధ్యక్షులు కనకాల శ్యామ్ కురుమ, వడ్డె ర సంఘం జా తీయ అధ్యక్షులు పిట్ల శ్రీధర్, బీసీ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షు రాలు బి మని మంజరి సాగర్ , రా వులకోల్ నరేష్ ప్రజాపతి, గొడుగు మహేష్ యాదవ్, ఈడిగ శ్రీనివాస్ గౌడ్, వల్లపు శివకుమార్, గూడూరు భాస్కర్ మీ రు, ఉదయ్ నేత, సంధ్యారాణి, శివమ్మ, వల్లపు శివ కుమా ర్, మడత వెంకట్ గౌడ్, స దానందం, జనగాం రవీందర్ గౌ డ్, కొప్పుల చందు, కొత్త నరసిం హ స్వామి, డేగల శ్రీనివాస్, బోదాసు రవి, నాగరాజుగౌడ్, బండిగారి రాజుగౌడ్ తదితరు లు పాల్గొన్నా రు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.