Sunday, September 27, 2026
More
    HomePoliticsDistrict Collector Badugu Chandrashekhar : సమన్వయంతోనే రోగులకు అ త్యుత్తమ సేవలు 

    District Collector Badugu Chandrashekhar : సమన్వయంతోనే రోగులకు అ త్యుత్తమ సేవలు 

    📰 Generate e-Paper Clip

    — నల్లగొండ జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్

    District Collector Badugu Chandrashekhar : ప్రజా దీవెన, నల్లగొండ: వివిధ య జమాన్యాలకింద పని చేస్తున్న ప్ర భుత్వ వైద్యులు కలిసి కట్టుగా, స మన్వయంతో పనిచేయడం ద్వా రా ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు ఇంకా ఉత్తమ సేవలను అందించవచ్చని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. ప్రభుత్వాసు పత్రులకు వచ్చే రోగుల సమస్య ల ను గుర్తించి వారికి ఇంకా మెరుగైన వైద్య సేవలను అందించేందుకు ఉ ద్దేశించి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేం ద్రాలు, ఏరియా ఆసుపత్రులు, వై ద్య కళాశాలల అధిపతులతో స మన్వయ సమావేశాలను నిర్వ హించేందుకు ప్రభుత్వం నల్గొండ జి ల్లాను పైలెట్ ప్రాజె క్టు కింద అమ లు చేసేందుకు ఎంపి క చేయడం జరిగింది.

    ఇందులో భాగంగానే గురువారం న ల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉమ్మడి నల్గొండ జిల్లా మూడు ప్ర ధాన విభాగాల అధిపతులతో ఏ ర్పాటుచేసిన సమన్వయ సమావే శానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథి గా హాజరయ్యారు. ప్రస్తుతం ప్రాథ మిక వైద్య ఆరోగ్య కేంద్రాలు, ఏరి యా ఆసుపత్రులు, వైద్య కళాశాల ద్వారా డాక్టర్లు అద్భుతమైన సేవ లు అందిస్తున్నారని, అయితే ఇం కా బాధ్యతతో చేయడం ద్వారా ఇంకా మంచి సేవలు అందించవ చ్చని అన్నారు.

    వైద్యులకు ఎదురయ్యే సవాళ్లను గుర్తించి వాటిని ఎలా పరిష్కరిం చాలో ఆలోచించాలన్నారు. ఇం దుకుగాను ఇలాంటి సమన్వయ సమావేశాలు బాగా ఉపయోగప డతాయని తెలిపారు. మెరుగైన సే వలు అందించడానికి గాను ఆసు పత్రులలో ఖాళీగా ఉన్న ఔట్సోర్సిం గ్ ఉద్యోగాలను భర్తీ చేయడం, స మస్యలపై ఎప్పటికప్పుడు చర్చిం చుకోవడం, తద్వారా, ప్రైవేటు ఆ సుపత్రులతో పోటీపడి వైద్య సేవ లు అందించేందుకు కృషి చేయాల ని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల మెలిగే పద్ధతి, బాధ్యత ఇవన్నీ ప్రభుత్వ ఆసుప త్రుల పట్ల ప్రజలకు ఇంకా నమ్మకా న్ని పెంచుతాయన్నారు.

    ప్రభుత్వ వైద్యులు నూటికి నూరు శాతం అంకితభావంతో పనిచేసి ప్ర జలకు మంచి సేవలు అందించవ చ్చని, ముఖ్యంగా ప్రాథమిక వైద్య కేంద్రా లు, ఏరియా ఆసుపత్రులు, వైద్య కళాశాలల వైద్యులు, సిబ్బం ది కలిసికట్టుగా పనిచేస్తే ఉత్తమ సే వలు అందించవచ్చని కలెక్టర్ అ న్నారు. ప్రాథమిక వైద్య ఆరోగ్య కేం ద్రాల నుండి ప్రోటోకాల్ ప్రకారమే రి ఫరల్ కేసులను పంపించాలన్నా రు.

    డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ నరేంద్ర కుమార్, డైరెక్టర్ ఆ ఫ్ హెల్త్ డాక్టర్ రవీంద్రనాథ్, తెలం గాణ వైద్య విధాన పరిషత్ కమిష నర్ డాక్టర్ అజయ్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారుల రా ష్ట్ర అధ్యక్షులు, జిల్లా వైద్య ఆరో గ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీని వాస్, డిసిహెచ్ఎస్ డాక్టర్ మాతృ, నల్గొండ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ జె .సత్యనారాయణ ప్రభుత్వ ఆ సుపత్రి ప్రధాన సూప రింటిండెంట్ నేత నరసింహారావు, సూర్యాపేట జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటర మణ, యాదాద్రి భువనగిరి జిల్లా డిఎంహెచ్వో డాక్టర్ మనోహర్ తది తరులు మాట్లాడారు. ఈ సమావే శాని ఉమ్మడి నల్గొండ జిల్లా పిహె చ్సీలు, ఏరియా ఆసుపత్రులు, వై ద్య కళాశాల అధిపతులు హాజర య్యారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.