Monday, September 28, 2026
More
    HomeOpinionNalgonda ACB Surprise attack Raid : బిగ్ బ్రేకింగ్, నల్లగొండలో ఏసీబీ మెరుపుదాడి, రూ....

    Nalgonda ACB Surprise attack Raid : బిగ్ బ్రేకింగ్, నల్లగొండలో ఏసీబీ మెరుపుదాడి, రూ. 35 వేలతో ‘రె డ్ హ్యాండెడ్’గా పట్టుబడ్డ డిప్యూ టీ ఇన్‌స్పెక్టర్

    📰 Generate e-Paper Clip

    Nalgonda ACB Surprise attack Raid : ప్రజా దీవెన, నల్లగొండ: ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాల పర్వం ఎంతకీ తగ్గడం లేదు. సా మాన్యుల అవసరాన్ని ఆసరాగా చేసు కు ని అడ్డగోలుగా వసూళ్లకు పాల్పడుతున్న అధికారులు వరు సగా ఏసీబీ వ లలో చిక్కుతున్నారు. తాజాగా, నల్గొండ ఆ ర్డీఓ (RDO) కా ర్యాలయంలోని సర్వే మరియు భూ రికార్డు ల విభాగం డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ (DI) జి. పవన్ కుమార్ లం చం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా బుక్కయ్యా రు.

    ఫిర్యాదుదారునికి సంబంధించిన తల్లి మరియు అత్తగారి భూముల సర్వే నివే దిక (Survey Report) జారీ చే యా ల్సి ఉంది. ఈ అధికారిక పని ని పూర్తి చేయడానికి డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ పవన్ కుమార్ ఏకంగా రూ. 35,000 లంచం డి మాండ్ చేశారు. బాధితుడు అంత ఇచ్చుకో లేనని బ్రతిమి లాడినా అధికారి మనసు కరగలేదు.దీంతో చేసేదేమీ లే క బాధితుడు ముందస్తుగా (అడ్వా న్స్ కింద) రూ. 20,000 లను సదరు అధికారికి సమర్పించుకున్నాడు. మిగిలిన రూ. 15,000 ఇస్తేనే రిపోర్ట్ చేతికొస్తుందని చెప్పడంతో, బాధితు డు రహస్యంగా అవినీతి నిరోధక శాఖ (acb) అధికారులను ఆశ్రయించాడు.

     

    పక్కాప్లాన్ తో కలెక్టరేట్ సమీపంలో స్కెచ్

    బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ నల్గొండ రేం జ్ అధికా రులు పక్కా వ్యూహం రచించారు. శుక్రవారం న ల్గొండ కలెక్టరేట్ సమీ పంలో బాధితుడి నుండి మిగిలిన రూ.15,000 లంచం మొత్తాన్ని ప వన్ కుమార్ తీసుకుం టుండగా మాటు వేసిన ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేశారు. కెమికల్ పూసిన నోట్లను పవన్ కుమార్ తీ సుకున్న వెంటనే అధికారులు ఆ యనను పట్టుకున్నారు. ఆయన చే తులకు పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ రావడంతో, లం చం సొమ్ము రూ. 15,000లను స్వాధీనం చేసుకున్నారు. త న విధులను ని జాయితీ లేకుండా, అక్రమంగా ని ర్వహించి నందుకు గానూ ఆయన పై కేసు నమోదు చేశారు.

    ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉందని, అరె స్ట్ చేసిన నిందిత అధికారి జి. పవన్ కుమా ర్‌ను జ్యుడీ షియల్ రిమాండ్ నిమి త్తం హైదరాబాద్ నాంపల్లిలోని ‘SP E & ACB కేసుల మొదటి అద నపు ప్రత్యేక న్యాయమూర్తి’ ముం దు హాజరుపరుస్తున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారుడి వివరాలను ఏసీబీ పూర్తిగా గోప్యంగా ఉం చడం జరిగిందని ఏసీబీ అధికారులు వెల్లడించారు.

    లంచం అడిగితే వదలకండి.. ఇలా ఫిర్యాదు చేయండి

    అవినీతి రహిత సమాజం కోసం తెలంగాణ ఏసీబీ ప్రజలకు కీలక పి లుపునిచ్చింది. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం డిమాండ్ చేస్తే వెన కడుగు వేయకుండా కింది మార్గాల ద్వా రా సంప్రదించాలని కోరారు.📞 **టోల్ ఫ్రీ నంబర్:* 1064 ,వాట్సాప్ (WhatsApp): 94404 46106, *ఫేస్‌ బుక్: Tel angana ACB, ఎక్స్ (ట్విట్టర్): @Telang ana ACB, QR కోడ్: అన్ని ప్రభు త్వ కార్యాలయాలు, ప్రముఖ బహిరంగ ప్రదేశాలలో అందుబాటు లో ఉన్న ఏసీబీ QR కోడ్‌ను స్కాన్ చేసి కూడా ఫిర్యాదు చేయవచ్చని అన్నారు. కాగా లంచంపై ఫిర్యాదు చేసే బాధితులు లేదా సాక్షుల పేర్లు, పూర్తి వివరా లు అత్యంత గోప్యంగా ఉంచబడతాయని స్పష్టం చేశారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.