
PF Security for MiddleClass Employees : ప్రజా దీవెన, న్యూఢిల్లీ: మధ్యత రగతి, ప్రైవేట్ రంగ ఉద్యోగుల భవిష్యత్ ఆర్థిక భద్రతకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వే సింది. ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండ్ గా ఉన్న ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPFO) వేతన పరిమితి పెంపునకు కేంద్ర కేబినెట్ ఆమో దం తెలిపింది. దీంతో ఇప్పటి వ రకు రూ.15 వేలుగా ఉన్న పీఎఫ్ వేతన పరిమితి రూ.25 వేలకు పెరగ నుంది.కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా 51 లక్షలకు పైగా కొత్త ఉద్యోగులు పీఎ ఫ్ పరిధిలోకి రానున్నా రు. దీంతో తక్కువ, మధ్యస్థ వేతనాలు పొందుతున్న ప్రైవే ట్ రంగ ఉద్యో గులకు భవిష్యత్ పొదుపు మరింత బలో పే తం కానుంది.
ఒకే నిర్ణయంతో మూడు ప్రయోజనాలు
EPFO పరిధిలోకి వచ్చే అర్హులైన ఉద్యోగులకు కేవలం పీఎ ఫ్ పొదుపు మాత్రమే కాకుండా EPF, EPS, EDLI వంటి మూ డు కీలక సామాజిక భద్రతా ప్రయోజనాలు అందుబా టులోకి రానున్నాయి. ఉద్యోగ విరమణ తర్వాత ఆర్థిక భ ద్రతతో పాటు పెన్షన్, జీవిత బీమారక్షణకు ఇది ఉపయోగప డనుంది.
ఏటా రూ.11,339 కోట్ల అదనపువ్యయం
ఉద్యోగుల సామాజిక భద్రతను విస్తరించేందుకు కేంద్ర ప్రభు త్వం ఏటా రూ.11,339 కోట్ల అదనపు ఆర్థిక భారాన్ని భరిం చనుంది. పెరుగుతున్న జీవన వ్యయాలు, ద్రవ్యోల్బణం నే పథ్యంలో వేతన జీ వులకు ఈ నిర్ణయం ప్రాధాన్యత సంత రించుకుంది.
భవిష్యత్‌కు బలమైన పునాది
రూ.25 వేల లోపు వేతనం పొందుతున్న ప్రైవేట్ రంగ ఉ ద్యోగులకు ఈ మార్పు పీఎఫ్ పొదుపు పరిధిని విస్తరించ నుంది. ఉద్యోగ జీవితంలోనే భవిష్యత్ ఆర్థిక అవసరాల కో సం పొదుపు పెంచు కునే అవకాశం కల్పించడంతో పాటు, పదవీ విరమణ అనంతర భ ద్రతకు కూడా ఇది బలమైన పు నాదిగా మారనుంది.కేంద్ర కేబినె ట్ నిర్ణయంతో లక్షలాది వేతన జీ వుల భవిష్యత్ ఆర్థిక భద్రతకు కొత్త దిశ ఏర్పడ నుంది.




