Wednesday, October 7, 2026
More
    HomeOpinionTelangana Employees Two DA Release : బిగ్ బ్రేకింగ్, తెలంగాణ ఉద్యోగు లకు దసరా...

    Telangana Employees Two DA Release : బిగ్ బ్రేకింగ్, తెలంగాణ ఉద్యోగు లకు దసరా కానుక,రెండు డీఏ లు విడుదల

    📰 Generate e-Paper Clip

     

    Telangana Employees Two DA Release : ప్రజా దీవెన , హైదరాబాద్: తెలం గాణ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభు త్వం దసరా కానుకగా కీ లక శుభవార్త అందించింది. ఉ ద్యోగు లు, పెన్షనర్లు ఎంతోకాలం గా ఎదురు చూస్తున్న రెండు పెం డిం గ్ డీఏలపై ప్రభుత్వం ఉత్త ర్వులు జారీ చేసింది. వేర్వేరు పే స్కేళ్లకు అనుగుణంగా డీఏను స వరించడంతో ఉద్యోగుల వేత నా ల్లో గణనీయమైన పెరుగుదల చోటుచేసుకోనుంది. తాజా నిర్ణ యంతో బేసిక్ పే ఆధారంగా దాదాపు 6.43 శాతం మేర అదన పు ప్రయోజనం లభించనుంది.

       2024 జనవరి నుంచి తొలి డీఏ పెంపు

    సాధారణ పే స్కేళ్ల ఉద్యోగులకు 2024 జనవరి నుంచి డీఏను 33.67 శాతం నుంచి 37.31 శా తానికి పెంచారు. అనంతరం 20 24 జూలై నుంచి డీఏను 40.04 శాతానికి సవరించారు. రివైజ్డ్ పే స్కేల్-2020 ఉద్యోగులకు కూడా డీఏను 37.31 శా తం నుంచి నే రుగా 40.04 శాతానికి పెంచారు.2015 పే స్కేల్ పరిధిలోని ఉ ద్యో గులకు డీఏను తొలుత 73.344 శాతం నుం చి 78.06 శాతానికి పెంచారు. 2024 జూలై నుంచి అది 81.7 28 శాతానికి చేరింది.

    UGC, AICTE ఉద్యోగులకు కూ డా ప్రయోజనం

    ఉన్నత విద్యార్హతలతో కూడిన UGC, AICTE పే స్కేళ్ల ఉద్యో గుల విషయంలోనూ ప్రభుత్వం డీ ఏను పెంచింది. 2016 పే స్కేల్ ఉద్యోగులకు డీఏ 46 శాతం నుంచి 50 శాతానికి, 2024 జూలై నుంచి 53 శాతానికి పెరిగింది. 2006 పే స్కేల్ ఉద్యోగు లకు డీఏ 230 శాతం నుంచి 239 శాతానికి, ఆ తర్వాత 246 శాతానికి చేరింది.

    పార్ట్‌టైమ్ అసిస్టెంట్లు, VRAలకు అదనపు భత్యం

    క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే పార్ట్‌టైమ్ అసిస్టెంట్లు, గ్రామ రెవెన్యూ అసిస్టెంట్లు (VRA)కు కూడా ప్రభుత్వం ఊరటని చ్చింది. వారికి నెలకు అదనంగా రూ. 100 చొప్పున పెంచు తూ ఉత్తర్వుల్లో పేర్కొంది. పెంచిన డీఏను 2026 అక్టోబర్ నె ల వేతనంతో కలిపి నవంబర్ 1, 2026న ఉద్యోగులకు చెల్లిం చనున్నారు. దీంతో దసరా తర్వాత ఉద్యోగుల జీతాల్లో పెరిగి న డీఏ ప్రతిఫలించనుంది.

         బకాయిలకూ క్లియర్ ప్లాన్

    కేవలం ప్రస్తుత డీఏ పెంపుతోనే ప్రభుత్వం ఆగలేదు. గతంలో పే రుకుపోయిన డీఏ బకాయిల చె ల్లింపునకు కూడా మార్గం సు గమం చేసింది. 2024 జనవరి నుంచి 2026 సెప్టెంబర్ వ రకు ఉన్న బకాయిలను 33 సమాన వాయిదాల్లో, అలాగే 20 24 జూ లై నుంచి 2026 సెప్టెంబర్ వర కు ఉన్న బకాయిలను 27 వాయిదాల్లో చెల్లించనున్నారు.ఈ బకాయిలను ఉద్యోగుల GPF ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిం ది. దీంతో ఒకవైపు పెరిగిన డీఏ తో నెలవారీ వేతనంలో ఊరట లభించనుండగా, మరోవైపు పెం డింగ్ బకాయిలు కూ డా దశలవా రీగా ఉద్యోగుల ఖాతాల్లోకి చేర నున్నాయి.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.