Nalgonda District Collector Ila Tripathi :
ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ ప్ర భుత్వ ప్రధాన ఆస్పత్రి ఆవరణలోని పట్టణ నిరాశ్రయుల వసతి కేంద్రా న్ని సోమవారం తెల్లవారుజామున జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆక స్మి కంగా తనిఖీ చేశారు. సోమవారం ఉదయం 5 గంటలకే జిజిహెచ్ కు చేరుకున్న కలెక్టర్ ఏలాంటి ఆశ్రయం లేని వారు నిరాశ్రయుల వసతి కేం ద్రాన్ని సద్వినియోగం చేసుకోవా ల ని సూచించారు.
నిరాశ్రయులు, బిచ్చగాళ్లు, ఫుట్ పా త్ లపై పడుకునేవారు చలి తీవ్ర త కు ఇబ్బందులు పడకుండా ప్రభు త్వ ప్రధాన ఆస్పత్రిలో ఉన్న నిరాశ్ర యుల వసతి కేంద్రాన్ని ఉపయోగిం చుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రి పాఠి కోరారు. సోమవారం ఉదయం 5 గంటలకే ఆమె నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో ఉన్న పట్టణ ని రాశ్రయుల వసతి కేంద్రాన్ని ఆకస్మి కంగా తనిఖీ చేసి నిరాశ్రయులకు ఏర్పాటు చేసిన వసతి , డార్మెటరీ లు,మంచాలు, దుప్పట్లు తదితర సౌకర్యాలను పరిశీలించారు. అంతే కాక నిరాశ్రయుల వసతి కేంద్రంలో ఉన్న వారితో మాట్లాడి సౌకర్యాల పై ఆరా తీశారు.
నల్గొండ పట్టణంలో అనేకమంది ని రాశ్రయులు, బిచ్చగాళ్లు, ఫుట్ పా త్ పై పడుకునేవారు ఉన్నారని, ప్ర స్తుతం చలికాలం కారణంగా చలి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని వీ రం దరూ నిరాశ్రయుల వసతి కేంద్రాన్ని వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని,ఇందుకు గాను అక్క డక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాల ని నల్గొండ ఆర్డిఓ వై. అశోక్ రెడ్డి ని, మున్సిపల్ కమిషనర్ ఆదేశించా రు. గడిచిన రెండు, మూడేళ్ల నుం డి నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆస్ప త్రిలో నిరాశ్రయుల వసతి గృహన్ని నిర్వహించడం జరుగుతున్నదని, దీన్ని వినియోగించుకునాలనుకునే వారు ఆధార్ కార్డు, చిరునామా, ఫోన్ నంబర్ సమర్పిస్తే చేయాల న్నారు.
ప్రస్తుతం నిరాశ్రయుల వసతి కేం ద్రంలో 17 మంది ఉన్నారని, 60 మందికి వసతి కల్పించేందుకు ఇ క్కడ అవకాశం ఉందని, మహిళ లు, పురుషులకు వేరువేరుగా డా ర్మెటరీలతో పాటు, టాయిలెట్ సౌ కర్యం ఉన్నాయని తెలిపారు. ఎ లాంటి ఆధారం లేని వారు, ఆశ్ర యం లేనివారు, వివిధ కారణాల వల్ల ఇంటి నుండి బయటకు వచ్చి న నిరాశ్రయులు ఈ నిరాశ్రయుల వసతి కేంద్రంలో ఉండవచ్చని,జిల్లా ప్రధాన ఆస్పత్రిలో ఉన్న నిరాశ్రయు ల వసతి కేంద్రం పూర్తి భద్రతతో ఉందని తెలిపారు.రోడ్డు ప్రమాదా లలో గాయపడి ఆసుపత్రిలో చికి త్సకు వచ్చిన వారి సహాయకులు, అత్యవసర చికిత్సలకు వచ్చిన వా రి సహాయకులు ఈ నిరాశ్రయుల వసతి కేంద్రాన్ని సద్వినియోగం చే సుకోవాలని ఆమె కోరారు. నిరాశ్ర యుల వసతి గృహంలో ఉన్న వా రికి వివిధ ఎన్జీవోలు భోజన సదు పాయాలు కల్పిస్తున్నాయని తెలి పారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పట్ట ణంలో ఫుట్ పాత్ లపై, జంక్షన్ ల వద్ద, రాత్రిపూట నిద్రించే వారిని గు ర్తించి సర్వే నిర్వహించి అందరిని వ సతి కేంద్రానికి తీసుకువచ్చేలా చూ డాలని అధికారులను ఆదేశించా రు. నిరాశ్రయుల వసతి గృహంలో ఉండే వారు ఎవరైనా జ్వరము, ఇ తర వ్యాధులతో బాధపడుతున్న ట్లయితే వైద్య చికిత్స అందించా లని జి జి హెచ్ డిప్యూటీ ఆర్ ఎం ఓ డాక్టర్ నగేష్ ను ఆదేశించారు. డాక్టర్లు వారానికి ఒకసారి వసతి కేం ద్రాన్ని సందర్శించి వైద్య పరీక్షలు ని ర్వహించాలని ఆదేశించారు. ఆస్ప త్రి ఆవరణలో నిరాశ్రయుల వసతి గృహానికి సంబంధించి ఫ్లెక్సీ, బోర్డ్ ఏర్పాటు చేసి అందరూ వినియో గించుకునేలా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలన్నారు.
నిరాశ్రయుల వసతి గృహంలో ఎవ రైనా సీనియర్ సిటిజన్లు ఉన్నట్ల యితే వారిని గుర్తించి వారికి పెన్షన్ తో పాటు, ఇతర సౌకర్యాలు కల్పిం చేలా చూడాలన్నారు. అర్హత ఉన్న వారికి ఇందిరమ్మ ఇంటిని ఇచ్చేం దుకు గుర్తించాలని చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆసుపత్రి ఆవరణలో ఉన్న యేసు అనే కుష్టి రోగితో మాట్లాదగా తనకు బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్ కావాలని కోర గా మంజూరు చేశారు. ఆస్పత్రి ఆ వరణలో ఉన్న చెత్త,మూళ్ళ పొద లు తొలగించాలని, ఓపెన్ మా న్యువల్స్ వెంటనే మూసివే యా ల ని, వారం రోజుల్లో పరిసరాలన్నీ శు భ్రంగా ఉంచాలని ఆసుపత్రి వర్గా ల ను ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్యా జువాలిటీ తో పాటు, ఆసుపత్రికి క్యాంటీన్ ,నిర్మాణంలో ఉన్న పీజీ హాస్టల్ ను పరిశీలించారు. ఆస్పత్రి ఆవరణలో ఉన్న సీసీ కెమెరాలు అన్ని పనిచేసేలా చర్యలు తీసు కో వాలని, స్టోర్ రూమ్ కు ఉపయో గి స్తున్న గదులు సద్వినియోగం చేసు కోవాలని,మున్సిపల్ వాహనాల ద్వారా ఎప్పటికప్పుడు చెత్తను తొ లగించాలని ఆదేశించారు. అనం త రం జిల్లా కలెక్టర్ ఎన్జీ కళాశాల వద్ద ఉన్న వీధి వ్యాపారుల షెలెటర్లలో రెండింటిలో ర్యాకులు ఏర్పాటు చే సి వినియోగించని దుస్తులు, చెప్పు లు,బూట్ల వంటివి అవసరమైన వా రు వినియోగించుకునేందుకు ఒక కేంద్రం ఏర్పాటు చేయాలని ఆర్డీవో తో పాటు, మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. ఎవరైనా విని యోగించని దుస్తులు అలాగే దా త ల ద్వారా సమర్పించే దుస్తులను ఏ ర్పాటు చేయాలని, అవి అవసరం ఉన్నవారు తీసుకునే విధంగా వారి ఫోన్ నెంబర్, ఆధార్ ఆధారంగా వారికి ఇచ్చే విధంగా చూడాలని చె ప్పారు. ఆర్డీవో వై. అశోక్ రెడ్డి తో పాటు ,మున్సిపల్ కమిషనర్ స య్యద్ ముసాబ్ అహ్మద్, జిజిహెచ్ డిప్యూటీ ఆర్ ఎం ఓ డాక్టర్ నగేష్, తహసిల్దార్ పరశురాం, తదితరులు ఉన్నారు.

