Tuesday, September 29, 2026
More
    HomePoliticsMinister Komatireddy Venkata Reddy : బిగ్ బ్రేకింగ్, మంత్రి కోమటిరెడ్డి వెం కటరెడ్డి కీలక...

    Minister Komatireddy Venkata Reddy : బిగ్ బ్రేకింగ్, మంత్రి కోమటిరెడ్డి వెం కటరెడ్డి కీలక ప్రకటన, రెండు నెల ల్లో ఉత్తర భాగం రీజినల్ రింగ్ రోడ్డు టెండర్ ప్రక్రియ ప్రారంభం

    📰 Generate e-Paper Clip

    Minister Komatireddy Venkata Reddy :

    ప్రజా దీవెన, చిట్యాల: రాబోయే రెం డు నెలల్లో రీజినల్ రింగ్ రోడ్డు ఉత్త ర భాగం టెండర్ ప్రక్రియ ప్రారంభం కానుందని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. డి సెంబర్ లోపు టెండర్లు పూర్తి చేసి జనవరిలో పనులు ప్రారంభించేలా చేస్తామని చెప్పారు. శనివారం మం త్రి చిట్యాలలో మీడియాతో మాట్లా డారు. 2017- 18 లో ప్రధాని మోదీ ఉత్తర భాగం రీజినల్ రింగ్ రోడ్డు కు అంగీకరిస్తే..బిఆర్ఎస్ ప్రభుత్వం భూ సేకరణ చేయకుండా నిర్లక్ష్యం వహించిందని మంత్రి కోమటిరెడ్డి నాటి కేసీఆర్ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. తాను ఎంపీగా ఉన్న పుడు రైతులకు అన్యాయం జరగ కుండా ధర్నాలో పాల్గొని, ప్రజా ప్ర భుత్వం వచ్చి మంత్రి అయిన త ర్వాత మార్కెట్ రేట్ ఇప్పించి రైతు లను ఒప్పించానన్నారు. తాను మంత్రిగా అయిన కొత్తలో 6శాతం భూసేకరణ మాత్రమే అయితే రై తు లను ఒప్పించి ఇప్పుడు 98శాతం పైగా పూర్తి చేసామని చెప్పారు.

    నాలుగు లేన్ల RRR 2035 నాటికి ట్రాఫిక్ రద్దీ పెరుగుతుందని, భవి ష్యత్ అవసరాల దృష్ట్యా 6లేన్లుగా మార్చుకున్నామని తెలిపారు. సం గారెడ్డి నుండి నర్సాపూర్, తూ ప్రా న్, గజ్వేల్,జగదేవపూర్ వయా భు వనగిరి,చౌటుప్పల్ వరకు 161.51 8కిలో మీటర్ల నార్త్ పార్ట్ ఉండనుం దన్నారు. భూసేకరణ కోసం 6వేల కోట్లు ఖర్చు అవుతున్నాయని కేం ద్రం,రాష్ట్రం చెరిసగం వాటా ఇస్తు న్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ వాటా 3వేల కోట్లు హడ్కో రుణం తె చ్చామని అన్నారు.

    ఇప్పటికే పలు మార్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిశామని,ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,తాను కేంద్ర ప్రభుత్వ అధికారులతో సమా వేశం అయ్యామని పనులు వేగం చే సేలా మాట్లాడామని చెప్పారు. ఉత్త ర భాగం అలైన్మెంట్ లో ఎలాంటి మార్పు ఉండదని,జనవరిలో పను లు ప్రారంభిస్తామని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు. అందుకు కేం ద్రం సహకరించాలని కోరారు.

    *దక్షిణ భాగం రీజినల్ రింగ్ రోడ్డు విషయంలో ఆందోళన వద్దు:*

    దక్షిణ భాగం విషయంలో రైతుల అ నవసర ఆందోళన చెందొద్దని మంత్రి భరోసా కల్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఆర్ అండ్ బి మినిస్టర్ అయిన తాను రైతుల అంగీకారం తోనే ముందుకు పోతామని తేల్చి చెప్పారు. నేను రైతు బిడ్డను రైతు కు అన్యాయం జరిగితే ఊరుకుం టానా అంటూ త్వరలోనే ముఖ్య మంత్రితో మాట్లాడి మంత్రుల కమి టీ వేస్తామని తనను కలిసిన రైతు లకు హామీ ఇచ్చారు. అయితే ఇటీ వల పత్రికల్లో,సోషల్ మీడియాలో రీజినల్ రింగ్ రోడ్డు విషయంలో అ సత్య ప్రచారం చేస్తున్నారని రైతు లు ఎవ్వరు ఆందోళన చెందాల్సిన అక్కర్లేదన్నారు.

    రీజినల్ రింగ్ రోడ్డు భూసేకరణ ని ర్మాణం కోసం 45వేల కోట్ల వరకు ఖ ర్చు అవుతుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు క ట్టిన,ఇప్పుడు లక్షన్నర కోట్ల విలువ గల ORR ను 7వేల కోట్లకు అమ్ము కున్న బిఆర్ఎస్ ప్రభుత్వం రైతుల ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నద ని, చరిత్రలో రోడ్లను అమ్ముకున్న పాపం బిఆర్ఎస్ ది మాత్రమేనని దుయ్యబట్టారు. రోడ్లు అమ్ముకున్న వాళ్లే..అబద్ధపు ప్రచారాలతో రైతు లను గందరగోళానికి గురిచేస్తున్నా రనీ, వాళ్ల ట్రాప్ లో పడొద్దని రైతుల ను కోరారు. వాళ్ళు ఒక్క ఇల్లు కట్ట లే,రేషన్ కార్డు ఇయ్యలే,సన్న బి య్యం ఇయ్యలే,ఇంటికి ఉచిత కరెం ట్ ఇయ్యలే కానీ లక్షల కోట్లు అప్పు లు మాత్రం చేసారని ఎద్దేవా చేశా రు.నితిన్ గడ్కరీ వ్యక్తిగతంగా తన ను ఇష్టపడే వ్యక్తని తన పేరు చెప్పి గౌ రెల్లి – భద్రాచలం హైవే,ఎల్బీ నగ ర్ – మల్కాపురం రోడ్డు జీవో ఇచ్చా రని గుర్తు చేశారు.

    హైదరాబాద్, విజయవాడ హైవే 8 లేన్ల నిర్మాణ పనులు వచ్చే ఫిబ్రవ రిలో ప్రారంభం అవుతాయని మ రో మారు స్పష్టం చేశారు. రీజినల్ రిం గ్ రోడ్డు విషయంలో ఎవరు ఆం దో ళన చెందాల్సిన అక్కర్లేదనీ, రైతు లు ధైర్యంగా ఉండాలని భరోసా క ల్పించారు.అలైన్మెంట్ విషయంలో పెద్ద వాళ్ళకు ఒక న్యా యం,పేద వాళ్లకు ఒక న్యాయం ఉండదని అందులో ఎలాంటి అనుమానం అ వసరం లేదని తేల్చిచెప్పారు. నల్ల గొండ బిడ్డగా ఈగడ్డకు అన్యాయం జరిగితే ఊరుకోనని మంత్రి వెంకట్ రెడ్డి పునరుద్ఘాటించారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.