Indiramma Housing Scheme : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్ల గొండ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, గ్రౌండింగ్, చెల్లింపులు, ఇండ్ల పురోగతిలో నల్గొండ జిల్లా రా ష్ట్రంలో రెండవ స్థానంలో నిలిచిం ది. నల్లగొండ జిల్లా రెండో స్థానంలో నిలిచినందుకు గాను రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ పి. గౌతమ్ జిల్లా యంత్రాంగానికి అభి నందనలు తెలిపారు. అంతేకాక బు ధవారం హైదరాబాద్ లోని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో నల్గొండ జిల్లా గృహ నిర్మాణ శాఖ ప్రాజక్టు డైరెక్టర్ రాజకుమార్ ను అభినం దించడమే కాక, ల్యాప్ టాప్ ను, ప్రశంసా పత్రాన్ని అందజేశారు.
ఇదిలా ఉండగా నల్గొండ జిల్లాకు ఇందిరమ్మండ్ల పథకం కింద మొత్తం 19625 గృహాలు కేటాయించగా, జి ల్లా యంత్రాంగం 17247 గృహా ల ను మంజూరు చేసింది. ఇప్పటివ రకు 13581 గృహాలు గ్రౌండ్ కాగా, వాటిలో 10116 గృహాలు వివిధ ద శలలో ఉన్నాయి. వీటిలో కొన్ని గృ హాలు పూర్తయ్యాయి.
ఒక్కసెప్టెంబర్ మాసంలోనే జిల్లా లో 5919 గృహాలు గ్రౌండ్ అయ్యా యి.అంతేకాక, సెప్టెంబర్ నెలలో జిల్లావ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు 80 కోట్ల రూపాయల చెల్లింపులను చేయడం జరిగింది.ఇందిరమ్మ ఇం డ్ల పై రాష్ట్ర వ్యాప్త సమీక్ష సందర్బం గా రాష్ట్రవ్యాప్తంగా వివిధ అంశాల ను పరిశీలించగా, నల్గొండ జిల్లా గ్రా మీణ, పట్టణ ప్రాంత సర్వే ,ఇందిర మ్మ ఇండ్ల ఫిజికల్, ఫైనాన్షియల్ పు రోగతి,ఎల్ 1,ఎల్2,ఎల్3 దరఖా స్తుల పరిశీలన, మోడల్ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం తదితర అన్ని రం గాలతో పాటు, చెల్లింపులలో కూడా నల్గొండ జిల్లా 2 వ స్థానంలో నిలి చింది. కాగా మొదటి స్థానంలో నా రాయణపేట జిల్లా ఉంది.
ఇందిరమ్మ ఇండ్ల పథకంలో నల్గొండ జిల్లా రెండో స్థానంలో నిలిచినందు కు గాను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం తన క్యాంపు కార్యాల యంలో గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్ కుమార్ ను శాలువాతో స న్మా నించారు .ఈ సందర్భంగా పలువు రు జిల్లా అధి కారులు జిల్లా యం త్రాంగానికి, గృహ నిర్మాణ శాఖ పి డికి శుభాకాంక్షలు తెలిపారు.

