Monday, September 28, 2026
More
    HomePoliticsElected MLA Naveen : బిగ్ బ్రేకింగ్, రాహుల్ గాంధీతో ము గిసిన రేవంత్ బృందం...

    Elected MLA Naveen : బిగ్ బ్రేకింగ్, రాహుల్ గాంధీతో ము గిసిన రేవంత్ బృందం భేటీ, కొత్త ఎ మ్మెల్యే నవీన్ కు అధిష్టానం అభినందలు 

    📰 Generate e-Paper Clip

    Elected MLA Naveen : ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: ప్రతిష్టాత్మ కమైన జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఘన విజయం సాధించిన నేప థ్యం లో ఢిల్లీలో ఏఐసిసి అగ్రనేత రాహు ల్ గాంధీని ముఖ్యమంత్రి రేవంత్ రె డ్డి బృందం మర్యాదపూర్వకంగా క లిసింది. ఈ సందర్భంగా జూబ్లీ హి ల్స్ ఉప ఎన్నికలో గెలుపొందిన న వీన్ యాదవ్ ను రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ పరిచయం చేయగా అధిష్టాన వర్గం కొత్త ఎమ్మెల్యేకు అ భినందనలు తెలిపింది తెలిపింది. కార్యక్రమంలో సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీ పీసీసీ అధ్యక్షుడు మహేష్‌ గౌడ్‌,ల లు ఉన్నారు

    *రాహుల్ గాంధీ తో మంతనా లు…* తెలంగాణ కాంగ్రెస్‌ కీలక నా యకుల బృందం ఢిల్లీ పర్యటనలో భాగంగా అఖిల భారత కాంగ్రెస్‌ క మిటీ నేత రాహుల్‌ గాంధీ ని కలి సింది. సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ అ ధ్యక్షుడు మహేష్‌ గౌడ్‌, ఎమ్మెల్యే న వీన్‌ యాదవ్‌ ఈ భేటీలో పాల్గొన్నా రు.సుమారు గంటపాటు సాగిన స మావేశంలో తెలంగాణలో తాజా రా జకీయ పరిణామాలు, పార్టీ వ్యవ హారాలు, స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలు, ఇటీవల ముగిసిన జూ బ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ఫలితాలు వం టి అంశాలు ప్రధాన చర్చగా నిలిచా యి.

    జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ సాధించిన విజయం రాష్ట్ర రాజకీ యాలకు దిశానిర్దేశంగా భావిస్తున్న పార్టీ అధినేతలు, దీనిపై రాహుల్‌ గాంధీ సంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. రాష్ట్రంలో పార్టీ బ లా న్ని మరింత పటిష్ఠం చేయడానికి తీ సుకోవాల్సిన చర్యలపై నాయకుల కి రాహుల్‌ సూచనలు ఇచ్చినట్లు వర్గాల సమాచారం.

    స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తు న్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక, బలహీన ప్రాంతాల్లో పార్టీ బలోపే తం, ప్రత్యర్థి బృహత్‌ ప్రణాళికలను ఎదుర్కొనే రోడ్‌మ్యాప్‌పై కూడా చ ర్చ సాగింది.

    రాష్ట్రంలో పార్టీ పునర్వ్యవస్థీకరణ, కొత్త నియామకాలు, కీలక నేతల బాధ్యతల బదిలీపై కూడా సూచన లు వెల్లువెత్తినట్టు పార్టీ వర్గాలు వె ల్లడించాయి.ఢిల్లీ పర్యటన ముగిం చుకుని రేవంత్ బృందం శనివారం రాత్రి వరకు హైదరాబాద్‌కు చేరు కో నుంది.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.