Sunday, September 27, 2026
More
    HomePoliticsSection 144 Jubilee Hills : బిగ్ బ్రేకింగ్, జూబ్లీహిల్స్ నియోజ కవర్గంలో ఆ రెండు...

    Section 144 Jubilee Hills : బిగ్ బ్రేకింగ్, జూబ్లీహిల్స్ నియోజ కవర్గంలో ఆ రెండు రోజులు144 సెక్షన్ అమలు 

    📰 Generate e-Paper Clip

    Section 144 Jubilee Hills : ప్రజా దీవెన, హైదరాబాద్: హైద రా బాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నే పథ్యంలో నియోజకవర్గ పరిధిలో ఆంక్షలు విధిస్తూ పోలీసు శాఖ నో టిఫికేషన్ జారీ చేసింది. ప్రజా శాం తి, భద్రత కోసం జూబ్లీహిల్స్ అసెం బ్లీ నియోజకవర్గంలో సెక్షన్ 144 అ మల్లో ఉంచుతూ ఆదేశాలు జారీ చే స్తున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమి షనర్ సజ్జన్నార్ పేర్కొన్నారు. ఐదు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్య క్తులు ఒకేచోట గుమికూడడంపై ని షేధం విధిస్తున్నట్లు తెలిపారు.

    ఈ నిషేధం 200 మీటర్ల పరిధిలో ఉ న్న పోలింగ్ స్టేషన్లకు వర్తిస్తుంది. పో లింగ్ జరిగే తేదీ నవంబర్ 11న ఉ దయం 6 గంటల నుంచి పోలింగ్ పూర్తయ్యే వరకు నియోజకవర్గ పరి ధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుం దని సజ్జనార్ స్పష్టం చేశారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితం వెల్లడిం చే నవంబర్ 14న ఉదయం 6 గం టల నుంచి, నవంబర్ 15న ఉద యం 6 గంటల వరకూ 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీస్ శాఖ వెల్లడించింది.

    జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ప్రజా శాంతి, శాంతి మరి యు ప్రశాంతతను కాపాడే ఉద్దేశం తో నగర పోలీస్ చట్టం, 1348 (నం.IX) సెక్షన్ 67 (సి) కింద తన కు ఇవ్వబడిన అధికారాలను విని యోగించుకుని ఈ ఆదేశాలను ఇ చ్చినట్లు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ పేర్కొన్నారు. ఉ ప ఎన్నిక ఓట్ల లెక్కింపు సందర్భం గా పబ్లిక్ రోడ్లపై, బహిరంగ ప్రదేశా లలో టపాసులు పేల్చడం, టపా సు లు విసరడం నిషేధం అని ఈ నోటీ సుల్లో పోలీసులు స్పష్టం చేశారు.

    పోలీసు శాఖ ఆదేశాలను ఉల్లం ఘించిన ఏ వ్యక్తి అయినా ప్రాసి క్యూషన్‌కు గురవుతారని పోలీసు లు హెచ్చరించారు. ఏ ఒక్కరూ తమ ఆదేశాలను బేఖాతర్ చేసినా కఠిన చర్యలకు వెనుకాడబోమని హెచ్చరించారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.