Ex Minister Harish Rao : ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: దేశ వ్యా ప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో అత్యున్నత న్యా యస్థానం కీలక తీర్పు వెలువరిం చింది. తెలంగాణ ను ఒక దశలో ఓ కుదుపు కుదిపేసి సంచలనం సృ ష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మా జీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకు సుప్రీంకోర్టు భారీ ఊరట ల భించింది. ఈ కేసులో రాష్ట్ర ప్రభు త్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పి టిషన్ (SLP)ని సుప్రీంకోర్టు కొట్టివే సింది.
హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టే షన్‌లో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కే సులో హరీష్ రావుకు వ్యతిరేకంగా సరైన ఆధారాలు లేవంటూ హైకోర్టు గతంలోనే కొట్టివేసింది. హైకోర్టు ఇ చ్చిన తీర్పును సవాల్ చేస్తూ తెలం గాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్ర యించిన విషయం తెలిసిందే.
అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తరఫు న సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా వాదనలు వినిపించగా ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ కొనసాగుతోం దని, దీనికి సంబంధించి కీలక ఆధా రాలు ఉన్నందున హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వా లని కోరారు.
ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీం కోర్టు, ప్రభుత్వం సమర్పించిన వాద నలతో విభేదించింది. ఫోన్ ట్యాపిం గ్ వ్యవహారంలో హరీష్ రావుకు ఎ టువంటి సంబంధం లేదని గతంలో నే హైకోర్టు స్పష్టం చేసిన విషయా న్ని అత్యున్నత న్యాయస్థానం ఈ సందర్భంగా గుర్తు చేసింది. ఈ నే పథ్యంలో, ఇకపై ఫోన్ ట్యాపింగ్ కే సులో హరీష్ రావును విచారించేం దుకు వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఈ తీర్పుతో ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుపై ఉన్న ఆరోపణలన్నీ దాదాపు ముగిసినట్లేనని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. భవిష్య త్తులో ఈ కేసు విచారణలో ఆయన ను ప్రతివాదిగా చేర్చే అవకాశం లేద నే విషయం కోర్టు తీర్పు ద్వారా వెళ్ల డవుతోంది.
