Nalgonda BRS : ప్రజా దీవెన నల్లగొండ: ముఖ్య మం త్రి రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై నల్లగొండ జిల్లా బీ ఆ ర్ ఎస్ పార్టీ ముఖ్య నాయకులు మం గళవారం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చే సింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీలో ఆందోళన కలి గించే విధంగా శాంతి భద్రతలకు వి ఘాతం కల్పించే రీతిలో ఉన్నా య ని తెలియజేశారు.
తెలంగాణ తొలి ముఖ్య మంత్రి కెసి ఆర్ ని, బిఆరెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను అవమానపరిచే విధం గా బిఆర్ఎస్ పార్టీని బొంద పెట్టమ ని, పార్టీ జెండా దిమ్మెలు కూల్చివే యాలని వ్యాఖ్యానించడం పట్ల స మాజంలో అలజడి సృష్టించే అవ కాశం ఉందన్నారు.ప్రజాస్వామ్యాని కే విఘాతం కలిగించేలా వారి వ్యా ఖ్యలు ఉన్నందువలన, వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు పత్రాన్ని అందచేశారు.
ఎస్పీ ని కలిసిన వారిలో శాసన మండలి సభ్యులు మంకెన కోటి రెడ్డి, జడ్పి మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, మాజీ శాసనస భ్యు లు కంచర్ల భూపాల్ రెడ్డి, నల్లమో తు భాస్కరరావు, నోముల భగత్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు రేగట్టే మల్లికా ర్జు న రెడ్డి నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి,పట్టణ పా ర్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, కొండూరు సత్యనారాయణ, సయ్య ద్ జాఫర్ జమల్ ఖాద్రి తదితరులు ఉన్నారు.
