BRSExMLAGadariKishore : ప్రజా దీవెన, తుంగతుర్తి: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ జా తిపిత మాజీ ముఖ్య మంత్రి బిఆర్ ఎస్ పార్టీ అధినాయకుడు కెసిఆర్ తొక్కని గడపలే దని మొక్కని బండ లేదని నాడు 11 రోజుల ఆమరణ నిరాహార దీక్ష వల్లనే 2009 డిసెంబ ర్ 9వ తేదీన మొదటిసారిగా నాటి కాం గ్రెస్ పాలకులు తెలంగాణ రా ష్ట్రాన్ని ప్రకటించారని అందుకే ప్రతి డిసెంబర్ 9వ తేదీని దీక్ష దివస్ విజ య దివస్ గా బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటుందని తుం గతుర్తి మాజీ శాసనస భ్యుడు డా. గాదరి కిషోర్ కుమార్ అన్నారు. మంగళవారం తుంగ తుర్తి మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహా నికి దీక్షా దివస్ సందర్భంగా పాలా భిషేకం నిర్వహించిన అనంతరం బి ఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలే కరుల సమావేశంలో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కో సం కెసిఆర్ తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆమరణ నిరాహార దీ క్ష చేశాడని మొదటిసారి తెలంగాణ ను ప్రకటించిన కాంగ్రెస్ పాలకులు ఆంధ్ర పాలకుల కుట్రలతో ఇచ్చిన హామీని వెను కకు తీసుకోవడంతో తిరిగి ఉద్యమం ఉవ్వెత్తున లేచిందని అన్నా రు. అప్పటికే 379 మంది ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్ర సాధ న కోసం బలి అయ్యారని అ న్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఏర్పడిందో నేటి యువతరానికి అవగతం కావడానికి దీ క్షా దివస్ ను విజయ దివస్ గా జరుపుకుంటున్నామని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పది సంవత్సరాలు రాష్ట్రంలో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు నిరా ఘాటంగా అమలు జరి గా యని అన్నారు .రైతుబంధు, రైతు బీమా, క ల్యాణ లక్ష్మి, తదితర పథకాలను ప్రజలకు అందించిన ఘనత కేసిఆ ర్ ది అని అన్నారు. రాష్ట్రంలో నూ తన జిల్లాలకు శ్రీకారం చుట్టింది కేసీ ఆర్ అని అన్నా రు. అలాగే నూతన మండలాలను ఎన్నో ఏళ్లుగా తండా వాసులు ఎదురుచూస్తున్న తండా లను గ్రామపంచాయతీలుగా మార్చే జీవో ను అమలు చేసిన ఘనత కూడా కెసిఆర్ దే అని అన్నారు. రా ష్ట్రంలో అనేక సంస్కరణలు తీసు కువచ్చిన కేసీఆర్ శిథిలావస్థలో ఉ న్న పరిపాలన భవనాలను నూతన భవనాలుగా తీర్చిదిద్దారని అన్నా రు.
ముఖ్యంగా రాజకీయాలకతీతంగా శిథిలమైపోయిన గ్రామీణ వ్యవ స్థ ను పునర్ నిర్మించడానికి అనేక సం స్కరణలు తెచ్చారని అన్నా రు. గ్రా మాల్లో మౌలిక వసతుల కల్పన కో సం సీసీ రోడ్లు, మురుగు నీటి కా లువలు ,చెత్త డంపింగ్ యార్డులు, స్మశాన వాటికలు, ప్రకృ తి వనాలు, అలాగే ప్రతి గ్రామంలో రోడ్ల వెంబడి వివిధ రకాల చెట్ల ను నాటించడం లాంటి అనేక పథకాలను ప్రవేశపెట్టి విజయవం తంగా అమలు చేశారని అన్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి వివిధ అవసరాల కోసం ట్రాక్టర్లను ఏర్పాటు చేశారని అన్నారు.
ఇచ్చిన పథకాలన్నీటిని నేటి ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుంగలో తొక్కారని అన్నారు. రైతుబంధు అరకొరగా ఇవ్వడం రైతు బీమా ఎక్కడ పోయిందో తెలియదని కళ్యాణలక్ష్మీ లో తులం బంగారం ఇస్తానని మాట తప్పారని గొర్రెల పంపిణీ పథకం అటకెక్కిందని కెసిఆర్ కిట్ లాంటి అనేక పథకా లను ప్రజలకు దూరం చేశారని అ న్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పొద్దస్తమానం తెలంగాణ రాష్ట్ర సాధకుడు అభివృద్ధి ప్రదాత కెసిఆ ర్ ను తిట్టడమే పనిగా పెట్టు కున్నా డని అంతకు తప్ప ముఖ్యమంత్రి ఏ అభివృద్ధి కార్యక్రమాన్ని అధికా రులతో సమీక్ష సమావేశాలు కానీ నిర్వహించడం లేదని అ న్నారు.
కాలయాపన పనులతో ప్రచార ఆ ర్భాటంతో నేటి ముఖ్యమంత్రి తది తర మంత్రులు పని చేస్తున్నారని అ న్నారు .విద్యాశాఖ తన వద్దనే పె ట్టుకున్న ముఖ్యమంత్రి ఆ శాఖలో పేద విద్యార్థుల కోసం అమలు చే స్తున్న ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేయకపోవడంతో విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. హోం శా ఖ మాత్యులు ముఖ్యమంత్రి కావడం రాష్ట్రంలో శాంతిభద్రత క్షీణిం చి ఒకపక్క హ త్యలు మరోపక్క మానభంగాలు దోపిడీలు సాగు తున్నాయని అన్నారు .రాష్ట్రంలో పరిపాలన పూర్తి గా డి తప్పిందని ఎద్దేవా చేశారు. కెసి ఆర్ పాలన హయాంలో తుంగతుర్తి నియోజక వర్గంలో వరి ధాన్యం లక్ష న్నర టన్నుల ఉత్పత్తి నుండి 10 లక్షల టన్నుల వరకు పెరిగిందని 30 వేల ఎకరాల భూమి సేద్యం నుండి 1,10,000 ఎకరాల వరకు భూమి సాగు పెరిగిందని అన్నారు.
ఏ చెరువులలో చూసిన కుంటల లో చూసిన కాలేశ్వరం జలాలే గల గల పారాయని నేడు రైతులు సకా లంలో సాగునీరు అందక లబో దిబో మంటున్నారని పండిన పంటను స రియైన రీతిలో కొనుగోలు జరుపక రైతులను గోస పెడుతున్నారని అ న్నారు. తుంగతుర్తి నియోజకవర్గం లో బిఆర్ఎస్ పార్టీ హయాంలో ప్రశాంత వాతావర ణంలో పరిపాలన కొనసాగిందని నేటి కాంగ్రెస్ పాలనలో దాడులు దౌర్జన్యాలు బెదిరింపు లు తిరిగి మొదలయ్యా యనన్నారు. పోలీ సులు అధికార పార్టీకి వ త్తాసు పలుకుతున్నారని పోలీసులు చట్ట ప్రకారం విధులు నిర్వర్తిం చాలని సూచించారు.
రానున్న కాలంలో తిరిగి తాము అధికారంలోకి వస్తామని బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త లు ఎవరు అధైర్య పడవద్దు అని ప్ర తి కార్యకర్తకు తాము అండగా ఉం టామని అన్నారు. అధికారం అనేది ప్రజా స్వా మ్యంలో ఎవరికి సొంతం కాదని తిరిగి తాము అధికారంలోకి రావ డం ఖాయమని గాదరి కిషోర్ ధీమా వ్యక్తం చేశారు. తుంగతుర్తి నియోజకవర్గంలో స్థానిక సంస్థలైన సర్పంచ్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు గెలుపు కోసం పోరాడు తున్నారని తమ పార్టీ అభ్యర్థు లు గెలుపు ఖాయమని అన్నారు.
ఎన్నికల ప్రశాంత వాతావరణంలో ఎలాంటి ఘటనలు జరగకుండా నిర్వహించాలని అధికారులకు సూచించారు . ఈ సందర్భంగా నూ తనకల్ మండల టిడిపి అధ్యక్షుడు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గుజ్జ యుగంధర్ రావు, మండల పార్టీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య, మాజీ ఎంపి పి గుండ గాని కవిత, జిల్లా నాయకులు కల్లెట్లపల్లి శోభన్ బాబు, సంకేపల్లి రఘునందన్ రెడ్డి ,గుండగాని రాములు గౌడ్, ఎస్ ఏ ర జాక్, మాజీ వైస్ ఎంపీపీ శ్రీశైలం ,తునికి సాయిలు, గాజుల యా దగిరి, తుంగతుర్తి పట్టణ అధ్యక్షుడు గోపగాని శ్రీనివాస్, గునిగంటి సంతోష్ ,గోపగాని వెంకన్న, లతోపాటు పలు గ్రామాలలో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు కార్యకర్తలు పాల్గొన్నారు.



