— నల్లగొండ జిల్లా కలెక్టర్ చంద్ర శేఖర్
District Collector Chandrasekhar : ప్రజా దీవెన, నల్లగొండ:రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ ద్వారా గ్రామస్థాయి నుం డి ప్రపంచ స్థాయి వరకు క్రీడా ప్రతి భను వెలికితీసే అవకాశాలు కలుగు తున్నాయని జిల్లా కలెక్టర్ బి.చంద్ర శేఖర్ అన్నారు.బుధవారం నల్గొండ కేంద్రంలో గడియారం సెంటర్ లో సీ ఎం కప్ టార్చ్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు.
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ నెల 17 నుండి సీఎం కప్ పోటీలు ప్రారం భమవుతాయన్నారు. ముఖ్య ఉద్దే శం గ్రామస్థాయి నుంచి ప్రపంచ స్థా యికి నేటి అథ్లెట్స్ ని తయారు చే యడం సంకల్పంతో ప్రారంభించా మని, గ్రామ, మండల, జిల్లాస్థాయి రాష్ట్రస్థాయిల క్రీడాకారులను ప్రో త్సహించాలని ఎంఈఓలు పీ ఈటీలతో కోరారు.
ఈ పోటీలలో అందరినీ భాగస్వా ములు చేసి మెరుగైన అథ్లెట్స్ ను నల్గొండ జిల్లాకు సిద్ధం చేయాలని కోరారు. క్రీడల ద్వారా క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, జట్టు భావ న పెరుగుతాయని తెలిపారు. గ్రామీ ణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రీడా ప్రతి భను గుర్తించి ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సీఎం కప్‌ను విస్తృతంగా నిర్వహిస్తోందని, ప్రతి ఒక్కరూ ఇం దులో ఉత్సాహంగా పాల్గొనాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
విజయం, పరాజయం కంటే పాల్గొ నడమే ముఖ్యమని, క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. క్రీడల ద్వారా ఆరోగ్యంతో పాటు, సామాజిక బాధ్యత పెరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏ ఎస్ పి రమేష్, ఎస్బిఐ మల్లారెడ్డి,జిల్లా గ్రంథాలయ చైర్మన్ హఫీజ్‌ఖాన్, కో మటిరెడ్డి ప్రతీక్ రెడ్డి కాలేజ్ సీఈవో గోనారెడ్డి, అబ్బగోని రమేష్ గౌడ్, గుమ్మల మోహన్ రెడ్డి, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి మీరు అక్బర్ అ లీ, పిడిలు,పి ఈ టి లు, కోచెస్ తది తరులు పాల్గొన్నారు.

