CM Revanth Reddy : ప్రజా దీవెన, వరంగల్: రాష్ట్రంలోభారీ వర్షాల వల్ల 16 జిల్లాల్లో జరి గి న నష్టంపై జిల్లాల వారి గా సమగ్ర మైన నివేదికలు తయారు చేయాల ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలిచ్చారు. భారీ వ ర్షాలు, వరదల వల్ల 12 జిల్లాల్లో తీ వ్రంగా నష్టం వాటిల్లిందని, పంట న ష్టానికి పరి హా రం చెల్లించాల్సి ఉ న్నందున అధికారులు క్షే త్రస్థాయి లో పర్య టిం చి వారంరోజుల్లో సమగ్రమైన నివేదికలు అందించాలని స్పష్టం చేశా రు. భారీ వర్షాల వల్ల నష్టపోయిన ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖ మ్మం తదితర ప్రాంతాల మీదుగా ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే చే శారు. అనంతరం హనుమకొండ చేరుకున్న ముఖ్యమంత్రి జిల్లా లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయి లో పర్యటించి బాధితు లతో మాట్లాడారు. వరద నష్టంపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబి షన్ ను పరిశీలించారు. అనంతరం మంత్రులు పొంగులేటి శ్రీనివాస రె డ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, ప్రజాప్రతి నిధులు, ఉన్నతాధికా రులు, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారుల తో సమీక్షా సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి బాధిత కుటుం బాలను ఆదుకునే విషయంలో స్పష్టమైన సూచనలు ఇచ్చారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన మాట ల్లోనే…వరి, పత్తి పంటలకు తీవ్ర నష్టం జరిగింది. నష్టపోయిన రై తాంగానికి ఎకరాకు 10 వేల రూపాయ ల చొప్పున పరిహారం అం దించాలని అనుకుంటున్నాం. క్షేత్రస్థాయిల్లో పంట నష్టం వివరాలను నమో దు చేస్తూ నివేదికలివ్వాలి. వరదల వల్ల ప్రాణాలు కోల్పోయి న వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల చొ ప్పున నష్టపరిహారం అందించాలని ప్రభుత్వం ఇదివరకే ఉత్తర్వులు జారీ చేసింది. విధా నపరమైన లోటు పాట్లు లేకుండా వెంటనే వివరాలను నమోదు చేయాలి.
ఎన్ఆర్ఈజీఎస్‌లో భాగంగా పొలా ల్లో ఇసుక మేట తొలగించాలి. దాని కి అంచనాలు రూపొందించండి. వ రదల వల్ల నష్టపోయిన వారికి ఎం త చేసినా వారి నష్టం పూడ్చలేనిది. ఇండ్లు నష్టపోయిన వారికి 15 వేల చొప్పున పరిహారం అందించాలి. అత్యంత నిరుపే దలు ఉంటే వారి అర్హత మేరకు అదనంగా ఇందిరమ్మ ఇండ్లను కే టాయించాలి. వరదల వల్ల నిరాశ్రయులైన వారి జాబితాలను త యారు చేయండి.
భారీ వర్షాల ప్రభావిత ప్రాంతాల్లో దాదాపు అన్ని చోట్లా దాదాపుగా ఇ దే రకంగా నష్టం వాటిల్లింది. క్షేత్రస్థా యిలో ప్రాణ నష్టం, ఆస్తి న ష్టం, పం ట నష్టం, పశు నష్టంతో పాటు ఇం డ్లు, రోడ్లు, కల్వర్టుల వంటి మౌలిక సదుపాయాలు దెబ్బతిన్న ప్రాంతా లకు సంబంధించి సమగ్రమైన నివే దికలు తయారు చేయాలి. ప్రజాప్రతినిధులు సైతం కిందిస్థాయిలో జరిగిన నష్టంపై కలెక్టర్లకు నివేదికలు సమర్పించాలి.
నష్టం అంచనాలను తయారు చేయడంలో విపత్తు నిర్వహణ విభా గం ఒక ఫార్మేట్‌ను తయారు చేసి అ న్ని జిల్లాల నుంచి నివేదికలు తెప్పించాలి. ఇలాంటి విపత్తు సమ యాల్లో రాష్ట్ర ప్రభుత్వం అం దించే సహాయంతో పాటు కేంద్రం నుంచి కూడా నిధులను రాబట్టు కోవలసిన అవసరం ఉంది. ఇందులో ఏమా త్రం అలసత్వం వద్దు.
ఇలాంటి సమయాల్లో కేవలం తాత్కాలిక పరిష్కారం వైపు కాకుండా శాశ్వత పరిష్కారాలకు కృషి చే యాలి. వరదల విషయంలో అడ్డం కులను తొలగించకపోవడం కూడా నష్టం ఎక్కువగా జరగడానికి ఆ స్కారమించింది. నీటి వనరుల ఇన్ ఫ్లోస్, అవుట్‌ఫ్లోస్ విషయాల్లో నీటి పారుదల శాఖ అంచనాలను పరిగ ణలోకి తీసుకోవాలి. లేదం టే వర్షాలొచ్చినప్పుడు మళ్లీ ఇదే సమస్యలు వస్తాయి. అలాంటివి రానివ్వకండి.
శాఖల మధ్య సమన్వయం ఉం డా లి. ముఖ్యంగా రోడ్లు భవనా లు, నీ టి పారుదల, మున్సిపల్, వైద్య ఆరోగ్య, విద్యుత్ తదితర శాఖల మ ధ్యన సమన్వయం ఉండాలి. ఏ విభాగం తర్వాత ఏ విభాగం పనులు పూర్తి చేయాలన్న సమన్వయం ఉండాలి. నా లా లను కబ్జా చేసి అడ్డం కులు సృష్టించే వారి విషయంలో ఎవరినీ వ దలొద్దు. కఠినంగా వ్యవహరించాలి. పది మంది కబ్జాలకు పా ల్పడి తే పది వేల మందికి నష్టం జరుగుతోంది.
ఉమ్మడి వరంగల్ కోర్ అర్బన్ ప్రాంతంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రో డ్లు ఇతర మౌలిక సదుపాయాల విష యంలో ఇంచార్జీ మంత్రి ము న్సిపల్, నీటి పారుదల శాఖ అధికారుల తో సమన్వయ పరిచి స మగ్రమైన ప్రణాళిక తయారు చేయాలి. కొన్ని చోట్ల స్మార్ట్ సిటీ పను లను వదిలేశారు. పనులను వదిలేయడానికి వీలులేదు. మిగిలి పోయిన పనులను పూర్తి చేయడానికి నివేదికలివ్వండి.
క్లౌడ్ బరస్ట్ ఇక అయిపోయిందన్న నిర్లక్ష్యం వద్దు. గత ఏడాది కూ డా ఇలాంటి వర్షాలొచ్చాయి. వాతావర ణంలో పెనుమార్పులు సంభవిస్తు న్నాయి. ఈ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించ డానికి కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాల్సిందే.
భారీ వర్షాల వల్ల జరిగిన నష్టం, తీసుకోవలసిన చర్యలపై వారం రో జు ల్లోగా కలెక్టర్లు నివేదికలు అందించా లి. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో ప ర్యటించాల్సిందే. నివేదికలను బట్టి వారం రోజుల్లో అన్ని జిల్లాల కలెక్టర్లు నివే దికలు అందించాలి. నివేదికలు అందిన తర్వాత రా ష్ట్ర స్థాయిలో అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్షా సమావే శం నిర్వ హించి అవసమైన చర్యలు తీసుకుంటాం.
వరద సహాయక కార్యక్రమాల కోసం ప్రభుత్వం పూర్తిగా సహకరి స్తుంది. బాధితులను ఆదుకోవడంలో లేదా క్షేత్రస్థాయిలో నివేదికలు రూపొం దించడంలో ఎవరు నిర్లక్ష్యం వ హిం చిన ప్రభుత్వం తీవ్రం గా పరిగణి స్తుందని ముఖ్యమంత్రి అన్నారు. ఈ వరదల సమయం లో కొందరు అధికారులు బాగా పనిచేశారని చెబుతూ వారిని ము ఖ్యమంత్రి అభినందించారు.
*వరదప్రాంతాల్లో సీఎం క్షేత్రస్థాయి పరిశీలన...* వరదలతో దెబ్బ తిన్న ప్రాంతాలను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరి శీలించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ పరిశీలన అనంత రం, హనుమకొండ చేరుకున్న ముఖ్యమంత్రి పట్టణంలోని సమ్మ య్య నగర్, కాపువాడ, పోతననగర్ తదితర ప్రాంతాల్లో పర్యటిం చారు.వరదల వల్ల తీవ్రంగా దెబ్బతిన్న ఆ ప్రాంతాలను పరిశీలిస్తూ బాధితులతో మాట్లాడారు.
అవసరమైన సహాయక చర్యలు తీ సుకుని, అన్ని రకాలుగా ఆదు కుంటామని బాధితులకు భరోసానిచ్చా రు. దెబ్బతిన్న రోడ్లు, కల్వ ర్టులు, నాలాలను పరిశీలించి, మరమ్మతు లు చేయించాలని అధి కారులను ఆదేశించారు. తక్షణం పారిశుధ్య పనులు చేపట్టాలని ఆ దేశాలిచ్చారు.
ముఖ్యమంత్రి వెంట మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ తో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే లు, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలె క్టర్లు, ఇతర అధికారులు ఉన్నారు.ఆయా ప్రాంతాల్లో చేపట్టాల్సిన ప నులు, తక్షణం తీసు కోవలసిన చ ర్యలపై ఈ సందర్భంగా అధికారు ల కు పలు సూచ నలు చేశారు. సహా యక చర్యలను మరింత ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.





