CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: మేడారం అభివృద్ధికి సంబంధించిన పనులు వంద రోజుల్లో పూర్తయ్యే లా ప్రణా ళికలు రూపొందించాలని ముఖ్య మంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికా రు లను ఆదేశించారు. మేడారం, బా సర ఆలయాల అభివృద్ధిపై ము ఖ్య మంత్రి ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు.ఈ సం దర్భంగా మే డారం, బాసర ఆలయాల అభి వృ ద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్‌ను అధికారులు వివరించగా, మేడారం సమ్మక్క, సారలమ్మ మహా జాతర నాటికి భక్తులకు సౌకర్యంగా ఉండే లా ఆలయాన్ని అభివృద్ధి చేయాల ని సూచించారు.
మేడారం అభివృద్ధికి సంబంధించి పలు డిజైన్లను పరిశీలించిన ము ఖ్యమంత్రి వంద రోజుల్లో అభివృద్ధి పనులు పూర్తయ్యేలా ప్రణాళికలు ఉండాలని అన్నారు. ప్రపంచంలో అతిపెద్ద గిరిజన పండుగకు సం బం ధించి నిర్మాణాలు పూర్తిగా సహజ సిద్ధమైన రాతి కట్టడాలతో చారిత్రా త్మకంగా ఉండేలా చర్యలు తీసుకో వాలని సూచించారు. భక్తులకు సౌ కర్యంగా ఉండేలా ఎంట్రీ, ఎగ్జిట్, పా ర్కింగ్ వసతులు అన్నీ సక్రమంగా ఉండాలని చెప్పారు.
భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని జంపన్న వాగులో నీరు నిలిచేలా ప్రాంతాల వారిగా చెక్ డ్యామ్‌ల నిర్మాణాలకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ వారంలో మేడా రంకు వచ్చి క్షేత్రస్థాయి పరిశీలన చే స్తానని చెప్పారు.
దీనితో పాటు బాసర శ్రీ జ్ఞాన స ర స్వతీ దేవాలయ విస్తరణ, అభి వృ ద్ధికి సంబంధించిన ముఖ్యమంత్రి ప లు సూచనలు చేశారు. అన్ని దేవా లయాల అభివృద్ధికి సంబంధించి స్థానిక సెంటిమెంట్‌ను గౌరవించడం తో పాటు, స్థానిక నిపుణులు, పూ జారుల అభిప్రాయాలు పరిగణన లోకి తీసుకోవాలని సూచించారు.
ఈ సమీక్షా సమావేశంలో మంత్రు లు కొండా సురేఖ, ధనసరి అన సూ య సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రె డ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస రాజు, దే వాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి శై లజా రామయ్యర్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
