Wednesday, September 30, 2026
More
    HomePoliticsGodavari Pushkaras Preparations : సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం, దక్షిణ భారత కుంభమేళాగా గోదావరి...

    Godavari Pushkaras Preparations : సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం, దక్షిణ భారత కుంభమేళాగా గోదావరి పు ష్కరాల నిర్వహణకు సిద్ధమవ్వాలి

    📰 Generate e-Paper Clip

    Godavari Pushkaras Preparations :

    ప్రజా దీవెన, హైదరాబాద్: గోదావరి పుష్కరాలను దక్షిణ భారత కుంభ మేళాగా ఘనంగా నిర్వ హించేందు కు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాల ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గో దా వరి పుష్కరాలకు శాశ్వత ప్రాతి పదికన ఏర్పాట్లు చేయడానికి అ వ సరమైన ముందస్తు ప్రణాళికలు త యారు చేయాలని అధికారులకు ది శానిర్దేశం చేశారు.రాష్ట్రంలో గోదా వరి తీరం వెంట ఉన్న ప్రధాన ఆల యాల అభివృద్ధికి అత్యంత ప్రా ధా న్యమివ్వాలని ఆదేశించారు.అదే క్ర మంలో పుష్కరాల ఏర్పాట్లు, రా బోయే భక్తుల రద్దీని అంచనా వేసు కొని మౌలిక వసతులు కల్పించాల ని చెప్పారు. పుష్కర స్నానాలు ఆ చరించేందుకు వచ్చే లక్షలాది భక్తు లకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా సదుపాయాలు కల్పించేందుకు ప్ర త్యేక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని చెప్పారు. గోదావరి పుష్కరాల స న్నద్ధత, ముందస్తు ప్రణాళికలపై కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ముఖ్య మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వ హించారు.

    2027లో జులై 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్న గోదావరి పుష్క రాలకు వ్యవధి ఉన్నందున శాశ్వ తమైన మౌలిక వసతులు, అభివృ ద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించా లని ముఖ్యమంత్రి ఆదేశించారు. మహారాష్ట్ర నుంచి తెలంగాణలో ప్రవేశించే గోదావరి నదికి రాష్ట్రంలో 560 కిలోమీటర్ల తీరం వెంట దాదా పు 74 ప్రాంతాల్లో పుష్కర ఘాట్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉం టుందని అధికారులు ముఖ్యమం త్రికి వివరించారు.

    బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి తీరం వెంట ఉన్న ధర్మపు రి, కాళేశ్వరంతో పాటు అన్ని ప్రధా న ఆలయాల వద్ద భక్తుల రద్దీ ఎ క్కువగా ఉంటుందని, అందుకని వాటిని మొదట అభివృద్ధి చేయాల ని ఆదేశించారు. ఆలయాల అభి వృద్ధితో పాటు ఆయా ప్రాంతాల్లో శా శ్వత పుష్కర ఘాట్ల నిర్మాణం చేప ట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేయా లని సూచించారు.

    పుష్కర స్నానాలకు వీలుగా ఉండే గోదావరి తీర ప్రాంతాలను అభివృ ద్ధి చేయాలని చెప్పారు. ఒకే రోజు రెండు లక్షల మంది భక్తులు పుష్క ర ఘాట్లకు తరలివచ్చినా ఇబ్బంది లేకుండా రోడ్లు, రహదారుల నిర్మా ణంతో పాటు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వాహనాల పార్కింగ్, తా గు నీరు, స్నానాల ఘాట్లతో పాటు భక్తులకు అవసరమైన వసతి సదు పాయాలన్నీ ఉండేలా ప్లాన్ చేసుకో వాలని చెప్పారు.

    మహా కుంభమేళాతో పాటు గ తం లో వివిధ రాష్ట్రాల్లో పుష్కరాలు, ఆలయాల అభివృద్ధి, భక్తులకు అవసరమైన సౌకర్యాల రూప క ల్ప నలో అనుభవమున్న కన్సల్టెన్సీల ను నియమించుకోవాలని సూచిం చారు. గోదావరి తీరం వెంట ఉన్న ప్రధాన ఆలయాలను సందర్శించి విడివిడిగా ప్రాజెక్టు నివేదికలు సిద్ధం చేసుకోవాలని చెప్పారు. అలాగే స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఆలయాల అభివృద్ధికి డిజైన్లు రూ పొందించాలన్నారు.

    పుష్కరాల ఏర్పాట్లకు కేంద్రం ప్ర భు త్వ ప్రాయోజిత పథకాలను సద్విని యోగం చేసుకోవాలని ముఖ్య మం త్రి సూచించారు. స్వచ్ఛ భారత్, జ ల్ జీవన్ మిషన్‌తో పాటు అందు బాటులో ఉన్న కేంద్ర పథకాలన్నింటి తో సమన్వయం ఉండే పనులు గు ర్తించి, వాటికి అవసరమైన అనుమ తులు తీసుకోవాలని ఆదేశించారు.

    దక్షిణ భారత కుంభమేళాకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి స్పెషల్ ప్యా కేజీ కోరేందుకు వీలుగా ఈ పనుల జాబితాను సిద్ధం చేయాలని చెప్పా రు. పుష్కరాల నిర్వహణకు ముం దస్తు ఏర్పాట్లలో పర్యాటక, నీటి పారుదల, దేవాదాయ శాఖలు స మన్వయంతో పనిచేయాలని ము ఖ్యమంత్రి ఆదేశించారు. ఈ సమా వేశంలో మంత్రి కొండా సురేఖ గ, సలహాదారు వేం నరేందర్ రెడ్డితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నా రు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.