CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదే శించారు. వాతావరణ శాఖ సమా చారం ప్రకారం జగిత్యాల మినహా 15 జిల్లాల్లో అధిక వర్షపాతం, మిగ తా జిల్లాల్లో సాధారణ వర్షపాతం న మోదైందని సీఎం తెలిపారు. నిజా మాబాద్, సంగారెడ్డి, మెదక్, వికా రాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖ మ్మం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనే వాతావరణ శాఖ సూచనల నేప థ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం ఉదయం ఉన్నతాధికారు లతో మాట్లాడారు.
వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాల్లో ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎ ఫ్ బృందాలను ముందుగానే మో హరించామని, వారు కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ సహా యక చర్యలు చేపడతారని సీఎం తెలిపారు. వాగులు, వంకలు పొంగే ప్రమాదం ఉన్నందున జిల్లా అధికా రులు అప్రమత్తంగా ఉండాలని, లో తట్టు ప్రాంతాల్లోని కుటుంబాలను సహాయక శిబిరాలకు తరలించా లని సీఎం ఆదేశించారు. నీటి పా రుదల శాఖ అధికారులు, సిబ్బంది రిజర్వాయర్లు, చెరువులు, కుంటల నీటి మట్టాన్ని ఎప్పటికప్పుడు పరిశీ లిస్తూ నీటి విడుదలపై ముందుగా నే కలెక్టర్లు, క్షేత్ర స్థాయి సిబ్బందికి సమాచారం ఇవ్వాలని పేర్కొన్నా రు. పూర్తిగా నిండిన చెరువులు, రి జర్వాయర్ల వద్ద ఇసుక బస్తాలను ముందుగానే సిద్ధంగా ఉంచాలని సీఎం ఆదేశించారు.
రోడ్లపై నీరు నిలిచిన ప్రాంతాల్లో, లో లెవల్ బ్రిడ్జిలు, కాజ్‌వేలపై నుంచి రాకపోకలు పూర్తిగా నిషేధించాలని, పోలీసులు, రెవెన్యూ అధికారులు వాటి సమీపంలో బారికేడ్లు ఏర్పా టు చేసి పర్యవేక్షణ చేయాలన్నా రు. నిరంతరాయంగా వర్షాలు కు రుస్తున్న నేపథ్యంలో వర్షపు నీరు ని ల్వ ఉండి దోమలు, ఇతర క్రిమికీట కాలు విజృంభించి అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున నగర, పురపాలక, గ్రామ పారిశుద్ధ్య సిబ్బం ది ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పను లు చేపట్టాలని సీఎం ఆదేశించారు.
వైద్యారోగ్య శాఖ తగినంత మందు లు అందుబాటులో ఉంచుకోవాల ని, అవసరమైన చోట్ల వైద్య శిబిరా లు ఏర్పాటు చేయాలని సీఎం సూ చించారు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పశు నష్టం చోటుచేసుకోకుండా జా గ్రత్తలు వహించాలని సీఎం తెలిపా రు. రెవెన్యూ, విద్యుత్, పంచాయ తీరాజ్, ఆర్ అండ్ బీ, వైద్యారోగ్య, పురపాలక, పోలీస్, అగ్నిమాపక శాఖలు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సమ న్వయంతో సాగాలని సీఎం సూ చించారు.
హైదరాబాద్ నగరంలో ప్రజల నుం చి వచ్చే వినతులకు జీహెచ్ఎంసీ, హైడ్రా, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక శా ఖ సిబ్బంది తక్షణమే స్పందించాల ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
