Monday, September 28, 2026
More
    HomePoliticsCM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్య, తె లంగాణ బలమైన...

    CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్య, తె లంగాణ బలమైన ఆర్థికశక్తిగా తీర్చి దిద్దాలి 

    📰 Generate e-Paper Clip

    CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి వందేళ్ల నా టికి తెలంగాణను 3 ట్రిలియన్ డా లర్ల బలీయమైన ఆర్థిక శక్తిగా తీర్చి దిద్దాల్సిన గురుతరమైన బాధ్యత గ్రూప్-2 లో ఎంపికైన అభ్యర్థులం దరిపైనా ఉందని, అందుకోసం శక్తి వంచన లేకుండా కృషి చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలు పునిచ్చారు. శిల్పకళా వేదికలో ఏ ర్పాటు చేసిన “ప్రజాపాలనలో కొలు వుల పండుగ” కార్యక్ర మంలో భా గంగా గ్రూప్ –2 సర్వీసులకు ఎంపి కైన 783 మంది అభ్యర్థులకు ము ఖ్యమంత్రి చేతుల మీదుగా లాం ఛ నంగా నియామక పత్రాల అందజే శారు.

    దీపావళి పండుగ శుభవేళ ఉద్యోగ నియామక పత్రాలను అందుకుంటు న్న అభ్యర్థులు, వారి తల్లిదండ్రుల కు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభినందనలు తెలియజేశా రు. తెలంగాణ బలమైన ఆర్థిక శక్తి గా తీర్చిదిద్దాలని తెలంగాణ రైజింగ్ – 2047 లక్ష్యాలను నిర్ధేశించామని ముఖ్యమంత్రి గుర్తుచేస్తూ, గ్రూప్-2 లో ఎంపికైన వారంతా తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలన్నారు.మనిషి జీవితంలో జ న్మదినం ఎంత ముఖ్యం, ఉద్యోగా నికి సంబంధించిన నియామక ప త్రం అందుకోవడం కూడా అంతే ముఖ్యమైన రోజు. ఈరోజు అం దు కోబోయే నియామక పత్రం జీవితం లో ఒక భావోద్వేగం. ఈరోజు నుం చి మీరంతా బాధ్యత కలిగిన అధి కారులు. ఎల్లప్పుడు అప్రమత్తంగా వ్యవహరించండి. 4 కోట్ల తెలంగా ణ ప్రజల భవిష్యత్తును భద్రంగా కా పాడుకుంటూ ముందుకు సాగాలి.

    ప్రభుత్వ అధికారులుగా ఉద్యో గం లో చేరడానికి తమ రక్తాన్ని చమ ట గా మార్చి మిమ్మల్ని భూజాన మో సిన తల్లిదండ్రులను మరిచిపోవ ద్దు. కన్న తల్లిదండ్రులను, పుట్టి పె రిగిన ఊరిని అభివృద్ధి చేసు కో వ డం మీ బాధ్యత. ఈరోజు నుంచి అధికారులుగా మీవద్దకు వచ్చే ఏ పేదవాడిలోనైనా తల్లిదండ్రులను గుర్తు తెచ్చుకుని సేవలు అందిం చాలి. నిస్సహాయులకు అండగా సహాయం అందించడమే బాధ్యత గా విధులు నిర్వర్తించాలి. ఎవరైనా తల్లిదండ్రులను విస్మరిస్తే వారి జీ తం నుంచి 10 శాతం కోత పెట్టి త ల్లిదండ్రుల ఖాతాల్లో వేసేట్టుగా చ ట్టం చేయబోతున్నాం.ముందుగానే గ్రూప్-2 ఫలితాలు వెల్లడించినట్ట యితే ఎంపికైన అభ్యర్థులు తిరిగి గ్రూప్-1 లో కూడా సెలెక్షన్ వస్తే అందులోకి వెళ్లినప్పుడు గ్రూప్-2 ఖాళీల్లో కొందరు అభ్యర్థులు అవకా శాలు కోల్పోతారని భావించి ముం దుగా గ్రూప్-1 ఫలితాలు విడుదల చేశారు. అదే క్రమంలో గ్రూప్ -3 ఆ తర్వాత గ్రూప్-4 ఫలితాలను కూ డా వెల్లడిస్తారు.ప్రజా ప్రభుత్వం అ ధికారం చేపట్టిన తర్వాత మొదటి సంవత్సరంలోనే 60 వేల ఉద్యోగా లను భర్తీ చేశాం. అలాగే, సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న ఎస్సీ వ ర్గీకరణకు శాశ్వత పరిష్కారం చూ పించాం. దేశంలో ఎక్కడా లేని వి ధంగా కుల గణన పూర్తి చేశామని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్ర అ భివృద్ధి కోసం సమర్థవంతంగా ప ని చేయాలని ఉద్బోధించారు. ఈ కా ర్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మ ల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు సలహాదారులు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హాజరయ్యారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.