Monday, September 28, 2026
More
    HomePoliticsCM Revanth Reddy : సీఎం రేవంత్ కీలక వ్యాఖ్య, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్...

    CM Revanth Reddy : సీఎం రేవంత్ కీలక వ్యాఖ్య, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ స్పూర్తిగా తెలంగాణలో కులగణన 

    📰 Generate e-Paper Clip

    CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: బహుజ నులు సమాజంలో ఎదగాలన్నా, ని లదొక్కుకోవాలన్నా చదువు ఒక్కటే మార్గమని ముఖ్యమం త్రి ఎ. రే వం త్ రెడ్డి ఉద్గాటించారు. బహు జను లు ఉన్నత చదువులు చదవాలన్న లక్ష్యంతోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనా రిటీ పిల్లల కోసం రాష్ట్ర వ్యాప్తంగా యంగ్ ఇండియా ఇంటి గ్రేటెడ్ రె సి డెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తు న్నామని చెప్పారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో శ్రీ శ్రీ శ్రీ సర్దార్ స ర్వాయి పాపన్న గౌడ్ మహా రాజ్ 375 వ జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని ఆ మహనీ యుని చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, సలహాదారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్న ఈ కార్యక్ర మంలో ముఖ్యమంత్రి మాట్లాడారు.

     

    బడుగు, బలహీన వర్గాల పక్షాన నిలబడ్డ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం తెలంగాణ సమా జా నికి ఆదర్శంగా నిలబడాలని, అం దుకే గుండెకాయ లాంటి సచివాల యం ఎదురుగా ట్యాంక్‌బండ్‌ పైన ఏర్పాటు చేస్తున్నాం. సర్దార్ పాప న్న గౌడ్ నిర్మించిన ఖిలాషాపూర్ కో టను చారిత్రక క్షేత్రంగా, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తున్నాం.

    వందేళ్లుగా ఎదురుచూస్తున్న బడు గు, బలహీన వర్గాలకు ఇచ్చిన మా ట ప్రకారం, ఏ రాష్ట్రంలో జరగని కు ల గణనను తెలంగాణలో పూర్తి చే సి బలహీన వర్గాలకు 42శాతం రి జర్వేషన్లు ఇవ్వాలని సంకల్పిం చాం. నూటికి నూరు శాతం చిత్తశు ద్ధితో పకడ్బందీగా జనాభాను లె క్కించి సమగ్ర సమాచారం సేకరిం చాం.

     

    తొండి వాదనలతో ప్రభుత్వం తీసిన లెక్కలను వక్రీకరిస్తే మళ్లీ రాబోవు వందేళ్ల వరకు బహుజనులకు న్యా యం జరగదు. క్షుణ్ణంగా ప్రతి అం శాన్ని పరిగణలోకి తీసుకుని అ త్యంత పకడ్బందీగా సమాచారాన్ని సేకరించి క్రోడీకరించాం. ఆ వివరాల ఆధారంగానే బీసీలకు స్థానిక సంస్థ ల్లో 42 శాతం, విద్య ఉద్యోగావకా శాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పి స్తూ మంత్రిమండలి తీర్మానించి శా సనసభలో సమగ్ర చర్చ చేసి ఆమో దించిన రెండు బిల్లులను గవర్నర్ కి పంపించాం. అలాగే స్థానిక సంస్థల్లో మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దా టడానికి వీలులేకుండా గత ప్రభు త్వం చేసిన పంచాయతీ రాజ్ చ ట్టం అడ్డంకిగా మారడంతో ఆ గరిష్ట పరిమితిని తొలగిస్తూ ఆర్డినెన్స్ జా రీ చేశాం.

    ఆ మూడింటినీ గవర్నర్ గారు రా ష్ట్రపతికి పంపించారు. వాటిని ఆ మోదించాల్సిన అవసరం ఉంది. గ డిచిన అయిదు నెలలుగా పెండింగ్‌ లో పెట్టారు. వాటిని ఆమోదించా ల ని కేంద్రంపై ఒత్తిడి చేయడానికి యా వత్ మంత్రిమండలి, ఎంపీలు, ఎ మ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజా సం ఘాల ప్రతినిధులందరం ఢిల్లీలో ఆందోళన చేశాం.కుల గణన లెక్క ల్లో ఎక్కడా ఒక్క తప్పు లేదు. ప్రతి 150 ఇండ్లకు ఒక ఎన్యుమరేటర్ చొప్పున 95 వేల మంది ఎన్యుమ రేటర్లు 60 రోజుల పాటు ఇంటింటికీ తిరిగి సమాచారాన్ని సేకరించారు. ఆ సమాచారాన్ని సంపూర్ణంగా కం ప్యూటర్ లో క్రోడీకరించాం.

     

    దేశంలో మత ప్రాతిపదికన రిజ ర్వే షన్లకు చట్టంలోనే తావు లేదు. తె లంగాణ పంపించిన రెండు బిల్లు లు, ఆర్డినన్స్‌లో అందుకు సంబం ధించి ఒక ముక్కలేదు. వెనుకబా టు తనం ఆధారంగానే రిజర్వేషన్లు కల్పించాం.సమస్యలన్నీ ఒక్కొక్క టిగా అధిగమిస్తూ ముందుకు పో వాలి. ప్రస్తుత పరిస్థితుల్లో బహు జనులు చదువుకోవడం ద్వారానే తలరాత మార్చుకోగలరు. బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం కావాలంటే అందరూ చదువుకోవా లి. అప్పుడే రాష్ట్రం అభివృద్ధి జరిగి ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకుంటుం ద ని ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు.

     

    ఈ కార్యక్రమంలో మంత్రులు జూ పల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సలహాదారులు కే. కేశవరా వు, వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ, పీ సీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కు మార్ గౌడ్ పాటు ఎమ్మెల్సీలు, ఎ మ్మెల్యేలు, నగర మేయర్, వివిధ కార్పొరేషన్ చైర్మన్లతో పాటు పలు వురు ప్రముఖులు పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.