Nalgonda collector Chandrashekhar : ప్రజా దీవెన, నల్లగొండ:ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులకు సంబంధించి బి ఎల్ వో లే ఓటర్ల ఇంటింటింకి వెళ్లి దృవాత్రాలను పరిశీలిస్తు న్నారని జిల్లా కలెక్టర్ బి.చంద్రశే ఖర్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అ ధి కారికి తెలిపారు.గురువారం హై దరాబాద్ నుండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఎస్ ఐఆ ర్ ప్రక్రియపై, అలాగే గ్రాడ్యూయే ట్ ఎం ఎల్ సి ఎన్నికల పై వీడి యో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
నల్గొండ జిల్లాలో ఎస్‌ఐఆర్‌కు సంబంధించి 100 శాతం నోటీసు లు జారీ చేశామని, బి ఎల్ ఓ లు ఇంటింటింకి వెళ్లి సరియైన డా క్యూమెంట్స్ ద్వారా విచారించ టం జరుగుతున్నదని,ఫారం -6 దరఖాస్తులు ఇప్పటివరకు 430 0 పరిశీలించామని జిల్లా కలెక్టర్ వివరించారు. నల్గొండ -వరంగల్- ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎం ఎల్ సి స్థానానికి సంబంధించి రూల్ 31 (బి ) ప్రకారం నోటిస్ పబ్లిస్ చే యటం జరిగిందని, ఇప్పటి వర కు ఫారం -18 ద్వారా 42,972 దరఖాస్తులు వచ్చాయని వాటిని త్వరితగతిన క్షేత్రస్థాయి పరిశీల న చేసి వేగంగా పూర్తి చేస్తామని వివరించారు.ఇప్పటికే గ్రాడ్యుయే ట్ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధిం చి రాజకీయ పార్టీల ప్రతినిధుల తో సమావేశం నిర్వహించడం జ రిగిందని, గతంలో 605 పోలింగ్ స్టేషన్లు ఉండగా, ప్రస్తుతం 644 పోలింగ్ స్టేషన్లకు ప్రతిపాదనలు పంపించడం జరిగిందని వివరిం చారు.
అంతకుముందు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, సర్ లో భాగంగా ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది కలగ కుండా బి ఎల్ ఓ లే క్షేత్ర స్థాయి లో ఇంటింటింకి వెళ్లి విచారించా లని, వృద్దులకు ప్రత్యేకంగా హె ల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేయాల ని, ఫారం -6 లకు కచ్చితంగా డి క్లరేషన్ తీసుకోవాలని, ఫారం -6, 7,8 లకు సంబందించిన వివరాల ను ఎప్పటికప్పుడు రాజకీయ పా ర్టీ ప్రతినిధులకు తెలియజేయాల నీ సూచించారు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి గతంలో ఓటు హ క్కు ఉన్నప్పటికీ మరల కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని, 31 -1 0- 2023 నాటికి డిగ్రీ పూర్తి అ యిన వారు మాత్రమే అర్హులని, ఎమ్మెల్సీ స్థానానికి సంబంధిం చి న జ్యూరిడిక్షన్ పరిధిలో నివాసం ఉండి ఓటు హక్కు కలిగి ఉండా లని, గ్రాడ్యు యేట్ మెమో మీద తప్పనిసరిగా గెజిటెడ్ అధికారి సంతకం ఉండా లని తెలిపా రు. విఈ వీడియో కా న్ఫరెన్స్ లో (రెవిన్యూ) అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్ ,జిల్లా రెవె న్యూ అధికా రి దశరథ ,ఆర్ డి ఓ ఆశోక్ తది తరులు హాజరయ్యారు.


