Wednesday, September 30, 2026
More
    Homeహైదరాబాద్Moinabad Municipality ACB Trap : బిగ్ బ్రేకింగ్, మొయినాబాద్ ము న్సిపాలిటీలో ఏసీబీ ట్రాప్,...

    Moinabad Municipality ACB Trap : బిగ్ బ్రేకింగ్, మొయినాబాద్ ము న్సిపాలిటీలో ఏసీబీ ట్రాప్, రూ. 75 వేల లంచంతో పట్టుబడ్డ టౌ న్ ప్లానింగ్ ఆఫీసర్

    📰 Generate e-Paper Clip

    Moinabad Municipality ACB Trap : ప్రజా దీవెన, మొయి నాబాద్: మొయినాబాద్ మున్సిపాలిటీ లో లంచం వ్యవహా రం కలకలం రేపింది. ఓ నిర్మాణాన్ని అక్రమ నిర్మాణంగా పరిగ ణించి కఠిన చ ర్యలు తీసుకోకుండా అధికారికంగా అనుకూ లంగా వ్యవహరించేం దుకు రూ.75 వేల లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తున్న సమయంలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ (AO-1) గుండు వాణిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

    ACB సిటీ రేంజ్-2 అధికారులు సెప్టెంబర్ 30న నిర్వహించిన ట్రా ప్‌లో ఈ వ్యవహారం వెలుగు లోకి వచ్చింది. ఈ లంచం వ్య వహారంలో మొయినాబాద్ గ్రామ పం చాయతీ మాజీ కార్యద ర్శి, ప్ర స్తుతం మొయినాబాద్ మున్సి పాలిటీలో డిప్యుటేషన్‌పై సీని యర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న యలమోని సుదర్శన్ (AO-2) మధ్యవర్తిగా వ్యవహరించినట్లు ఏసీబీ వెల్లడించింది.

    AO-2 వద్ద ఉన్న రూ.75,000 లంచం సొమ్మును ఏసీబీ అధికా రులు స్వాధీనం చేసుకున్నారు. అధికారిక విధులను అక్రమం గా, నిజాయితీకి విరుద్ధంగా నిర్వ హించి అక్రమ లబ్ధి పొందేం దుకు ప్రయత్నించినట్లు నిందితులపై ఆరోపణలు నమోద య్యాయి.

       న్యాయస్థానం ముందు హాజరు

    ట్రాప్ అనంతరం AO-1, AO-2ల ను న్యాయపరమైన రిమాం డ్ కోసం నాంపల్లిలోని SPE & ACB కేసుల అదనపు ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరుస్తున్నట్లు ఏసీబీ అధికారు లు తెలిపారు. కేసు ద ర్యాప్తు కొనసాగుతోంది. భద్రతా కారణా ల దృష్ట్యా ఫిర్యాదుదారు డి వివరాలను గోప్యంగా ఉంచిన ట్లు ఏసీబీ పేర్కొంది.

    లంచం డిమాండ్ చేస్తే 1064కు ఫిర్యాదు చేయండి

    ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా లం చం డిమాండ్ చేస్తే ప్రజలు వెం టనే ACB టోల్‌ఫ్రీ నంబర్ 1064కు సమాచారం ఇవ్వాలని అ ధికారులు సూచించారు. వాట్సాప్ 94 40446106, ఫేస్‌బుక్‌లో Telangana ACB, X (ట్విట్టర్)లో @Telangan a ACB ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ప్రభు త్వ కార్యాల యాలు, ప్రముఖ బహిరంగ ప్రదే శాల్లో ACB QR కోడ్‌లను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్ల డించారు. ఫిర్యాదుదారులు, బాధితుల పేర్లు మరియు వివ రాలను గో ప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.