Nalgonda Collector Chandrasekhar : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ ఎస్ఎల్ బిసి వద్ద నిర్మిస్తున్న “ఇం దిర మహిళ శక్తి పెట్రోల్ పంపు “ప నులను వారం రోజుల్లో పూర్తిచేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాల ని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధి కారులను ఆదేశించారు. బుధవా రం అయన ఇందిర మహిళ శక్తి పె ట్రోల్ పంపు పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు.మహిళా శక్తి పెట్రో ల్ పంపులో పనిచేసే సిబ్బందికి ఇ ప్పటినుండే శిక్షణ ఇవ్వాలని, ఐఓ సీఎల్ ద్వారా శిక్షణ ఇప్పించాలని ఎపిడి శ్రవణ్ ను ఆదేశించారు. అ దేవిధంగా పెట్రోల్ పంపు వద్ద పక్క నే ఉన్న ఖాళీ స్థలంలో సూపర్ మా ర్కెట్, రెస్టారెంట్ ఏర్పాటు చేస్తు న్నందున రాష్ట్ర రోడ్లు,భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి. కో మటిరెడ్డి వెంకటరెడ్డి చేతులమీ దు గా శంకుస్థాపన చేయించేందుకు ఏ ర్పాటు చేయాలన్నారు.
పెట్రోల్ పంప్, సూపర్ మార్కెట్, రె స్టారెంట్ అన్నింటికీ పనికి వచ్చే వి ధంగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చే యాలని, ప్రస్తుతము ఈ స్థలంలో ఉన్న ఎలక్ట్రికల్ లైనింగ్ మొత్తాన్ని షిఫ్ట్ చేయాలని ఎలక్ట్రికల్ అధికా రులను ఆదేశించారు. పెట్రోల్ పం పు కలరింగ్, నేమ్ ప్లేట్ తో సహా ల్యాండ్ స్కేప్, సుందరీకరణ పను లన్నింటిని ఈనెల 7లేదా 8 లోపు పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. రాష్ట్ర ప్ర భుత్వం ఇందిర మహిళశక్తి పెట్రోల్ పంపులకు అత్యంత ప్రాధాన్యత ఇ స్తున్న విషయాన్ని దృష్టిలో ఉంచు కొని నల్గొండ ఎస్ ఎల్ బిసీలో ని ర్మిస్తున్న పెట్రోల్ పంపు రాష్ట్రంలో ఉత్తమంగా ఉండేం దుకు కృషి చే యాలన్నారు. పెట్రోల్ పంపులో ఎ లాంటి ఆధారం లేని వారు, ఒంటరి మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. డిఆర్ డిఓ అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రవణ్ , విద్యు త్ ఏ.డిఈ వేణుగోపాల్, డివిజన ల్ ఇంజినీర్ ప్రసాద రావు, ఏ ఈ యాసిన్ అలీ, ఉన్నారు.
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర స వరణ (సర్) తప్పులు లేకుండా చే యాలి
నల్లగొండ: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాలలో వివ రా లను జాగ్రత్తగా నమోదు చేయా ల ని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ బి ఎల్ ఓలను ఆదేశించారు. బుధవా రం అయన నల్గొండ జిల్లా గట్టుప్ప ల్ మండల కేంద్రంలో “సర్” కార్యక్ర మాన్ని తనిఖీ చేశారు.బిఎల్ ఓలు ఇంటింటికి వెళ్లి నిర్వహిస్తున్న సర్ ను ప్రత్యక్షంగా పరిశీలించారు.
బిఎల్వోలు ఎన్యూమ రేషన్ ఫారా లు ఓటర్లకు ఇవ్వడం, వాటిలో వి వరాల నమోదు ను తనిఖీ చేశా రు. 2002లో ఓటరు వివరాలున్న ట్లయితే ఇప్పుడు ఎన్యుమరేషన్ ఫారంలో ఎలాంటి వివరాలు న మోదు చేస్తున్నారు ? లేనట్లయి తే ఎలాంటి వివరాలు పొందుపర చాలో అడిగి తెలుసుకున్నారు. పక్కనే ఉన్న ఇంటి యజమాని గు మ్మకొండ నర్సిరెడ్డి యాదిరెడ్డితో మాట్లాడుతూ మీ ఇంట్లో ఎన్ని ఓ ట్లు ఉన్నాయని? ఎంతమంది ఉన్నారని? ఎన్యుమరేషన్ ఫామ్స్ ఇచ్చారా? వాటిని నింపారా? ఏ పోలింగ్ కేంద్రంలో మీకు ఓట్లు ఉ న్నాయి? అని అడిగారు. ఒక కు టుంబం మొత్తం ఒక పోలింగ్ కేం ద్రంలోకి వచ్చేలా చూడాలని, బి ఎల్వోలు ఇల్లిల్లు సందర్శించే స మయంలోనే ఫామ్ -6, 8 వెంట బెట్టుకుని వెళ్లాలని చెప్పారు. ఒక ఓటరుకు రెండుచోట్ల ఓటు నమో దు ఉన్నట్లయితే ప్రస్తుతం తనకు ఓటు ఎక్కడ ఉండాలో ఓటరే నిర్ణ యించుకోవాలని, లేనట్లయితే అ ధికారులే రికార్డుల ఆధారంగా ఒక చోట తొలగించడం జరు గుతుం ద ని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఎవరికీ రెండుచోట్ల ఓటు హక్కు ఉండరాదని తెలిపారు. పంచాయ తీ కార్యదర్శులు ఎన్యుమరేషన్ ఫారాలు నింపడంలో బిఎల్ఓ లకు సహకారం అందించాలని,ఈ విష యమై పంచాయతీ కార్యదర్శులు బిఎల్వోలతో ప్రత్యేకంగా సమావే శం ఏర్పాటుచేసి తెలియజేయా లని ఎంపిడిఓ హిమబిందును ఆ దేశించారు. ఎన్యూమరేషన్ ఫా మ్స్ నింపిన తర్వాత ఓటరు జా బితా ప్రదర్శన, కొత్త ఓటు నమో దు ,తప్పులను సరి చేయడం వం టివి చేపట్టడం జరుగుతుందని, అందువల్ల ఓటర్లు త్వరితగతిన వారి వివరాలను సమర్పించి ఎ న్యుమరేషన్ ఫామ్స్ ప్రక్రియను పూర్తిచేసేలా సహకరించాలని కోరా రు.
ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన ప్రజలతో జిల్లా కలెక్టర్ మాట్లాడు తూ సర్ లో ఏమైనా సందేహాలు ఉన్నాయా? అని అడిగారు. హైద రాబాదు నుండి గట్టుప్పల్ కు ఓ టును ట్రాన్స్ఫర్ చేసుకోవడం గు రించి వారు జిల్లా కలెక్టర్ తో సందే హాలను నివృత్తి చేసుకున్నారు. బిఎల్ ఏలు అందరికీ గుర్తింపు కా ర్డులు ఇవ్వాలని కలెక్టర్ తహసిల్దా ర్ రాములు ను ఆదేశించారు. అ నంతరం జిల్లా కలెక్టర్ ఇదే మం డ లం, వెలమకన్నెలో రావులసత్యం ఇంటి వద్ద ఎన్యుమరేషన్ జరుగు తుండగా అక్కడికి వెళ్లి ఇంట్లో ఎవ రెవరు ఉంటారని? ఎంతమంది ఓ టర్లు ఉన్నారని? అందరిదీ ఒకే పో లింగ్ కేంద్రంలోనే ఓటు ఉందా? అ ని అడిగారు.
బిఎల్ఓతో మాట్లాడుతూ ఇప్పటి వరకు ఎన్ని ఎన్యూమరేషన్ ఫా మ్స్ ఇచ్చారని? ఇచ్చిన వారంద రూ తిరిగి ఇచ్చారా? 100% ఫా ర్మ్స్ డిస్ట్రిబ్యూషన్ పూర్తయిందా? ఇంకా ఎవరైనా మిగిలి ఉన్నారా? అని అడిగి తెలుసుకున్నారు. కాగా తను అంగన్వాడీ కార్యకర్తగా ప ని చేస్తున్నానని తెలుపగా రెండు పనులను ఏలాంటి ఇబ్బందులు లే కుండా చేయాలని, అంతే కాకుండా తప్పులు లేకుండా ఫామ్స్ నింపాల ని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా కలె క్టర్ వెంట చండూర్ ఆర్డీవో శ్రీదేవి, సర్పంచ్ ఎం .జగన్నాథం తదిత రు లు ఉన్నారు.
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా ప్రేమకరణ్ రెడ్డి
నల్లగొండ టౌన్: నల్గొండ జిల్లా స్థా నిక సంస్థల అదనపు కలెక్టర్ గా నంద్యాల ప్రేమ్ కరణ్ రెడ్డి బుధ వారం ఉద్యోగ బాధ్యతలు స్వీకరిం చారు. ఇప్పటివరకు నల్గొండ ఆర్డీ వో యారాల అశోక్ రెడ్డి స్థానిక సం స్థల అదనపు కలెక్టర్ గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తుండగా ఆ యన స్థానంలో జిల్లా పరిషత్ ము ఖ్య కార్య నిర్వహణ అధికారిగా పనిచేస్తున్న ప్రేమ్ కిరణ్ రెడ్డికి అద నంగా బాధ్యతలు అప్పగించారు. స్థానిక సంస్థల మీద లోతైన అవ గాహన ఉన్న ప్రేమ కరణ్ రెడ్డికి బా ధ్యతలు అప్పగించడం వల్ల స్థానిక సంస్థల్లో పనులు వేగవంతం కా నున్నాయి.




