–నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
Collector Ila Tripathi : ప్రజా దీవెన,నల్లగొండ : గ్రామపంచాయతీ ఎన్నికల్లో నామి నేషన్ పత్రాల పరిశీలనను నిబంధ నలకు అనుగుణంగా, పూర్తిస్థాయి పారదర్శకంగా నిర్వహించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. బుధ వారం ఆమె నిడమనూరు, ముకుం దాపురం గ్రామపంచాయతీలలో నా మినేషన్ల పరిశీలన కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎన్ని నామినేషన్లు దాఖలయ్యాయి, ఎన్ని తిరస్కరించ బడ్డాయి అనే వివరాలను బాధ్యులై న అధికారులను అడిగి తెలుసుకు న్నారు. అభ్యర్థులు సమర్పించిన కుల ధ్రువీకరణ పత్రాలు, బ్యాంక్ అకౌంట్ బుక్స్ తదితర పత్రాలపైనా సమగ్రంగా ఆరాతీశారు.
ప్రతి అభ్యర్థి సమర్పించే పత్రాలు పూర్తి వివరాలతో, నిబంధనలకు అ నుగుణంగా ఉండేలా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించి న కలెక్టర్, నామినేషన్ల పరిశీలనలో అత్యంత బాధ్యతతో, నిజాయితీ తో వ్యవహరించాలని స్పష్టం చేశా రు. కలెక్టర్ వెంట స్థానిక సంస్థల అ దనపు కలెక్టర్ నారాయణ అమిత్, జడ్పీ సీఈఓ శ్రీనివాసరావు, జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, తహసిల్దార్ జయకృష్ణ, ఎంపీడీవో హిమబిందు తదితరులు ఉన్నారు.
