Sunday, September 27, 2026
More
    HomePoliticsDistrict Collector Ila Tripathi : ఎన్నికల కోడ్ కూసింది, తక్షణమే అ మల్లోకి ఎన్నికల...

    District Collector Ila Tripathi : ఎన్నికల కోడ్ కూసింది, తక్షణమే అ మల్లోకి ఎన్నికల ప్రవర్తనా నియమా వళి 

    📰 Generate e-Paper Clip

    –కొత్త పథకాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిషేదం

    –హోయార్డింగులు, కటౌట్లు, పోస్ట ర్లు, బ్యానర్లు ఉండకూడదు

    –నవంబర్ 11 వరకు ఎన్నికల ప్రవ ర్తనా నియమావళి

    –అప్పటి వరకు ప్రజావాణి, ఇతరే తర పనులు రద్దు

    — నల్లగొండ జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

    District Collector Ila Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ :రాష్ట్ర ఎన్ని కల సంఘం ఎంపీటీసీ, జడ్పిటిసి, గ్రామపంచాయతీ ఎన్నికల షె డ్యూ ల్ ప్రకటించినందున తక్షణమే ఎన్ని కల ప్రవర్తనా నియమావళి అమలు లోకి వచ్చిందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఎన్నికల ప్రవర్త నా నియమావళి అమలులోకి వ చ్చినందున ఎన్నికల ప్రవర్తనా ని యమావళిని తు.చా తప్పకుండా పాటించాలని ఆమె అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలె క్టర్ కార్యాలయ సమావేశ మందిరం లో ఆమె జిల్లా అధికారులతో మా ట్లాడుతూ ఎన్నికల ప్రవర్తనా నియ మావళిని దృష్టిలో ఉంచుకొని కొత్త గా ఎలాంటి ప్రభుత్వ పథకాలు మంజూరు చేయడం, శంకుస్థాప నలు, ప్రారంభోత్సవాలు చేయడం, గ్రౌండింగ్ వంటివి చేయకూడదని తెలిపారు.

    ఎన్నికల సందర్భంగా ఏర్పాటుచే సిన ఎఫ్ ఎస్ టి, ఎస్ ఎస్ టి బృం దాలు పక్కగా పని చేయాలని అ న్నారు. అధికారులు, సిబ్బంది ప్రజా ప్రతినిధులతో ఎలాంటి సమావేశా లు, అధికారిక కార్యక్రమాలు, సమీ క్షలు నిర్వహించకూడదని, వారితో సమావేశాలలో పాల్గొనకూడదని చె ప్పారు. ఇది వరకే ప్రారంభించిన ప్ర భుత్వ పథకాలు, అమలవుతున్న పథకాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. జిల్లా అంతటా గ్రామపం చాయతీ, ఎంపిటిసి, జడ్పిటిసి ఎ న్నికల ప్రవర్తనా నియమావళి అ మల్లో ఉంటుందని చెప్పారు.

    ప్రత్యేకించి ముఖ్యమైన తాగునీరు, వైద్యం వంటి అత్యవసర పనులు కొనసాగుతాయని చెప్పారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలను దృష్టిలో ఉం చుకొని క్షేత్రస్థాయి వరకు అధికా రు లు అందరూ సిబ్బంది ఎన్నికల ని యమ, నిబంధనలపై పూర్తిగా స్ప ష్టత కలిగి ఉండాలని ఆదేశించారు.

    ఎన్నికల ప్రవర్తనా నియమావళి అ మల్లోకి వచ్చినందున జిల్లా వ్యా ప్తంగా ఎక్కడ రాజకీయ పార్టీలకు సంబంధించిన, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన హోయార్డింగులు, క టౌట్లు, పోస్టర్లు, బ్యానర్లు ఉండ కూ డదని ఆమె స్పష్టం చేశారు. గ్రామ పంచాయతీ, ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల ప్రవర్తన నియమావళి అ మలులో ఉన్న దృష్ట్యా వచ్చే సో మవారం నుండి ప్రజావాణి కార్య క్ర మాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ తె లిపారు. నవంబర్ 11 వరకు ఎన్ని కల ప్రవర్తనా నియమావళి అమలు లో ఉంటుందని, అప్పటివరకు ప్ర జావాణి కార్యక్రమం జరగదని, అం దువలన జిల్లా ప్రజలు ఈ విషయా న్ని దృష్టిలో ఉంచుకొని, వినతుల ను సమర్పించేందుకు సోమవారం జిల్లా కేంద్రానికి రావద్దని ఆమె విజ్ఞ ప్తి చేశారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, రెవె న్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, ఆర్డిఓలు అశోక్ రెడ్డి, రమణారెడ్డి, శ్రీదేవి, గృహ నిర్మాణ శాఖ పీడి రా జ్ కుమార్, జిల్లా అధికారులు ఉ న్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.