Ex Minister Harish Rao : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ ముఖ్యమంత్రి ఎనుముల రేవం త్ రెడ్డి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓట మి భయంతో ఫ్రస్టేషన్ లో చివరకు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రజలను కూ డా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని మాజీ మంత్రి హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. చేసింది చెప్పు కునేది లేక జూబ్లీహిల్స్ నాయకు లు, పథకాలు ఆగిపోతాయని ప్రజ లను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని,
ముఖ్యమంత్రికి ఓటమి భయం చివ పట్టుకొని చివరికి ప్రజలనే బ్లాక్ మె యిల్ చేసే స్థాయికి దిగజారారని,
ప్రజాస్వామ్యంలో బెదిరింపులకు తావు లేదoటూ తీవ్ర స్థాయిలో ధ్వజ మెత్తారు. బ్లాక్ మెయిలర్ రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలని జూ బ్లీహిల్స్ ప్రజలకు పిలుపునిచ్చారు.
శుక్రవారం ఆయన హైదరాబాద్ ప్రె స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచే సి న మిడిది ప్రెస్ కార్యక్రమంలో హ రీ ష్ రావు చేసిన వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే…
జూబ్లీహిల్స్ ఎన్నిక నాలుగు లక్షల మంది ప్రజల భవిష్యత్తు కాదు, నా లుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల భవిష్యత్తు.ఈ అరాచక ప్రభుత్వా నికి జూబ్లీహిల్స్ ప్రజలు బుద్ధి చె ప్పాలి. ఈ తీర్పు రాష్ట్ర ప్రజలకు మేలు చేకూర్చాలని ప్రజలంతా ఎ దురుచూస్తున్నారు. రేవంత్ పాల నలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదు.రాష్ట్రంలో నలుగురు రేవంత్ బ్రదర్స్ మాత్రమే హ్యాపీగా ఉన్నారు
రెండేళ్ల రేవంత్ పాలన అరాచకాల కు జూబ్లీహిల్స్ ప్రజలు చరమగీతం పాడనున్నారు.
కేసిఆర్ పాలనలో వికాసం, రేవంత్ పాలనలో విధ్వంసం, ప్రజలు వికా సం కావాలా, వికాసం కావాలా ఆ లోచించాలి.రేవంత్ రెడ్డి ఒక బ్లాక్ మెయిలర్,సమాచార హక్కు చట్టం ఉపయోగించి రియల్ ఎస్టేట్, వ్యా పారవేత్తలను బ్లాక్ మెయిల్ చేశా డు.ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు అంటే, కాలేజీల మీద విజిలెన్స్ దా డులు, పోలీసుల దాడులు
బిఆర్ఎస్ ప్రభుత్వం 19,500 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించింది.
రెండేళ్లలో రేవంత్ రెండు రూపాయ లు కూడా ఇవ్వలేదు.
ఫీజు రియంబర్స్మెంట్ కాక కాలే జీ లు బందు పెట్టారు. ఆ పిల్లలు జూ బ్లీహిల్స్ లో కూడా ఉన్నారు. ఆరో గ్య శ్రీ వై ఎస్ తెచ్చిన పథకం అని గొప్పలు చెప్పడం కాదు, పథకం అ మలు చేయడం లేదు, ఆసుపత్రుల ను బెదిరిస్తున్నారు. రూ. 1900 కో ట్ల ఆరోగ్య శ్రీ బకాయిలు ఇవ్వలే దు.బకాయిలు అడిగితే అధికారు లు, విజిలెన్స్ దాడులు, పోలీసు దాడులు.
రాష్ట్రంలో 11 పెద్ద ప్రాజెక్టులు, 13 వేల కోట్ల విలువైనవి చెరువుల్లో క డుతున్నారు, ఉద్యోగ సంఘాలపై ఏసీబీ దాడులు. దేశంలో అత్యధిక డీఏలు పెండింగ్ లో ఉన్న రాష్ట్రం మన తెలంగాణ.కంటోన్మెంట్ ఎన్ని కల్లో అనేక హామీలు ఇచ్చారు. ఆ రువేల డబుల్ ఇల్లు కడతాం అ న్నారు. ఎక్కడ కట్టారు.స్పోర్ట్స్ కాం ప్లెక్స్ అన్నారు. డిఫెన్స్ లాండ్ రెగ్య లరైజ అన్నారు.నేను సవాల్ విసి రుతున్నా ఏం చేశారో చూపెట్టాలి.
రెండేళ్లలో ఎందుకు మైనార్టీ మంత్రి పదవి ఇవ్వలేదు.ఎందుకు డబుల్ బెడ్ రూమ్ లు ఇవ్వలేదు. ఎన్నిక లు రాగానే ఎన్టీఆర్, పీజేఆర్ గుర్తు వస్తాడు. కొల్లూరు డబుల్ బెడ్ రూ మ్ ఏనాడైనా వెళ్లారా, ఇప్పుడు మంత్రులు అందరూ లైన్ పడుతు న్నారు. ప్రశ్నించే గొంతును గెలిపిం చాలి.మూసి, హైడ్రా పేరిట ఇల్లు కూల్చితే నిలబడ్డది బి ఆర్ ఎస్.
బీఆర్‌ఎస్ హయాంలో రాష్ట్రవ్యా ప్తంగా 10లక్షల సీసీ కెమెరాలు పెట్టినం. అందులో 6లక్షల దాకా హైద్రాబాద్ లోనే పెట్టినం.ఇప్పుడు వాటి నిర్వహణ కూడా లేదు.
శాంతిభద్రత నిర్వహణ లేకుండా పోయింది. నడి రోడ్డుపై మర్డర్లు జరుగుతున్నాయి. మొన్న జగద్గిరి గుట్ట లో నడిరోడ్డుపై మిట్ట మధ్యా హ్నం దారుణంగా కత్తితో దాడి చేస్తే ఒక యువకుడు చనిపోయిండు.
రాష్ట్రమంతా ఆ దృశ్యాలను చూ సింది. రక్తపు మరకలు ఇంకా పోలే దు. పోలీసులకు జీతాలు, బెన్ఫిట్స్ ఇవ్వకుండా వారికి నరకం చూపిస్తు న్నడు. రేవంత్ రెడ్డి పాలనలో అన్ని రంగాల్లో తిరోగమనం, ఒక్క క్రైంలో మాత్రమే పురోగమనం.
ఏ రంగం నమోదు చేయలేని వృద్ధి పోలీసు శాఖ నమోదు చేసింది.
కేసీఆర్ అగ్రికల్చర్ పెంచితే, రేవం తు గన్ కల్చర్ పెంచిండు మేం నోటి కి అనడం లేదు. 2025 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు రాష్ట్రంలో నమోదైన క్రైం రేటు చూస్తే రేవంత్ ఘనత ఏపాటిదో అర్థమైతది.
మొత్తం 189 మర్డర్లు జరిగితే, అం దులో 88 నడిరోడ్డుపై, అందరూ చూస్తుండగా జరిగిన హత్యలు.
1700 కిడ్నాప్లు, 123 రేప్ కేసులు 1051 దొంగతనాలు, 6411 ఇండ్ల లో దొంగతనాలు, మహిళల పట్ల జరుగుతున్న నేరాల శాతం 12.3 % పెరిగాయి.గడిచిన ఏడాదితో పో ల్చితే అత్యాచారాలు 28శాతం,కిడ్నాపులు 26శాతం ఇప్పుడు సైబ రాబాద్‌లో 41 శాతం, హైదరాబా ద్‌లో 60 శాతం క్రైమ్ రేటు పెరిగిం ది.
తెలంగాణలో 22శాతం క్రైం రేటు పెరిగినట్లు పోలీసు యాన్యువల్ రి పోర్టే స్పష్టం చేసింది.రేవంత్ రాక్షస పాలన చూసి పెట్టుబడులు తరలి పోతున్నాయి. రియల్ ఎస్టేట్ ఢ మాల్ అయింది. కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, ఫ్లైఓవర్లు, అండర్ పాసులు కడితే రేవంత్ పేదల ఇం డ్లు కూల్చాడు.కేసీఆర్ కాలంలో “ఇ న్వెస్ట్‌మెంట్ హబ్”గా ఉన్న హైద రాబాద్ — ఇప్పుడు “ఇన్‌సెక్యూ రిటీ హబ్” అయింది.మిట్ట మ ధ్యా హ్నం, అందరూ చూస్తుండగానే మర్డర్లు జరుగుతున్నాయి.ఇదంతా ప్రభుత్వ వైఫల్యం కాదా.
మహారాష్ట్రలోని ముంబై పోలీసు లు హైదరాబాద్‌లోని చర్లపల్లిలో వేల కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుకు న్నారంటే అంతకంటే అవమానం ఉంటుందా.రేవంత్ అయితే జూ బ్లిహిల్స్ ప్యాలెస్, లేదంటే కమాండ్ కంట్రోల్ లో కూర్చొని రివ్యూ చేస్తా డు. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో కూర్చొని క్రైం మీద రివ్యూ చేయ డం లేదు గాని కమిషన్ల మీద రి వ్యూ చేస్తున్నాడు.
రేవంత్ రెడ్డి మున్సిపల్ మంత్రిగా ఫెయిల్, విద్యా మంత్రిగా ఫెయిల్,
హోం మంత్రిగా ఫెయిల్,టోటల్ గా రేవంత్ రెడ్డి సీఎం గా అట్టర్ ఫెయి ల్. మంత్రులకు నమ్మకం లేదు రే వంత్ రెడ్డి మీద, ప్రభుత్వం మీద
ఒక ఎమ్మెల్యే ప్రపంచ బ్యాంకుకు నిధుల కోసం లేఖ రాసిండు. జూ బ్లీహిల్స్ లో 5000 కోట్ల అభివృద్ధి చేసినం అని కేటీఆర్ మొన్న విడు దల చేశారు. నువ్వు ఏం చేశావు రేవంత్ రెడ్డి బ్లాకెయిల్ తప్ప.
జూబ్లీహిల్స్ ప్రజలకు నీళ్ళు, కరెంట్ ఇచ్చింది బిఆర్ఎస్ మేము పట్టాలు ఇస్తే, నువ్వు ఇండ్లు కూల్చావు
బిజెపి ఎట్లా ఏం చేసేది లేదు,బిజెపి ఇవ్వదు, కాంగ్రెస్ కోట్లడదు. తెలం గాణ ఏం చేసినా దేశానికి ఆదర్శం అయింది.ఆరు గ్యారెంటీల మీద, రుణమాఫీ మీద గల్లా పట్టి అడిగాం
బి ఆర్ ఎస్ పోరాటం వల్లనే రెండు రైతు బంధు వచ్చింది. బోనస్ ఏది అంటే ఒక పంటకు ఎగ్గొట్టాడు.
గురుకులాల మీద నిలదీస్తే మొద్దు నిద్ర లేచిండు.హైడ్రా విషయంలో, హెచ్ సి యు భూముల విషయ ములో, టీమ్స్ ఆసుపత్రుల విష యంలో, బస్తీ ఉద్యోగుల కోసం, ప్ర జల కోసం ప్రభుత్వాన్ని నిలదీసింది బి ఆర్ ఎస్ మాత్రమే.
కాంగ్రెస్ అభ్యర్థి సోదరుడు వెంకట్ యాదవ్ కు మూడు ఓట్లు ఉన్నా యి అని ఎన్నికల కమిషన్ కు ఇస్తే యాక్షన్ లేదు, ఓట్ చోరీ అనే రా హుల్ గాంధీ ఎందుకు ఇక్కడ ఓటు చోరీ గురించి మాట్లాడడు.కాంగ్రెస్ నాయకులే షబ్బీర్ అలీ బీహార్ లో బిజెపి బిటీమ్ ఏంఐఎం అంటాడు.
ఇక్కడ కాంగ్రెస్ బి టీమ్ ఎవర్ని మో సం చేస్తున్నారు. బీసీ రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్, బిజెపి కలిసి మోసం చేశాయి,జూబ్లీహిల్స్ ఎన్ని కల్లో రెండు పార్టీలు కలిసి పని చేస్తు న్నాయి.
కాంగ్రెస్ ఎప్పుడూ వచ్చింది, ము స్లిం ఎప్పుడూ వచ్చింది జమాత్ ఉల్మా హింద్ అజాద్ కోసం లొల్లి చేసింది.అప్పుడు కాంగ్రెస్ ఎక్కడ ఉంది.తప్పుడు వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి ముస్లింలకు వెంటనే క్షమాపణ చెప్పాలి.4000 కోట్ల బడ్జెట్ ఏమైంది. ఇమాం మౌజం గౌరవ వేతనాల పెంపు ఏమైంది
బిఆర్ఎస్ నిలదీయడం వల్ల అ జా రుద్దీన్ కు మంత్రి పదవి వచ్చింది.
రాంరెడ్డి వెంకట్ రెడ్డి చనిపోతే అక్క డ వారి భార్యను నిలబెడితే రండ రాజకీయం అన్నడు రేవంత్ రెడ్డి
ఈరోజు జూబ్లీహిల్స్ లో సునీత ని నిలబెడితే దారుణంగా మాట్లాడు తున్నావు. పిల్లల మీద కేసులు పెడుతున్నావు. తులం బంగారం ఉత్తదే అని మొన్న మంత్రి మా ట్లాడాడు.మహిళా సంఘాలను ప్ర లోభ పెడుతున్నారు.వాళ్ల బ్యాం కు బుక్స్ తీసుకొని బ్లాక్ మెయిల్ చేస్తు న్నాడు. మహాలక్ష్మి కింద 50 వేల రూపాయలు బాకీ పడ్డాడు బతు కమ్మ చీరెలు ఇవ్వలేదు. మహిళ లను మోసం చేశావు. మహిళా సం ఘాలకు కేసీఆర్ పెట్టిన పథకాలు బంద్ పెట్టావు.
పైసలు లేవు అంటవు,ఫ్యూచర్ సి టీ, ముసి శుద్ధికి డబ్బులు లేవు అం టవు. పథకాలకు డబ్బులు లేవు అంటవు, ఫీజు రియంబర్స్మెంట్ డ బ్బులు లేవు అంటవు.బిజెపి ఎంపీ రఘునందన్ ప్రశ్న అడిగితే, 2.80 లక్షల కోట్లు మాత్రమే బి ఆర్ ఎస్ అప్పు అని.కానీ రెండేళ్లలో రెండు లక్షల ఎనిమిది వేల కోట్ల అప్పు చే సినవు.డిల్లీకి మూటలు మోయడం తప్ప, నువ్వు చేసింది ఏముంది రే వంత్. మీరు ఓటర్లు కాదు న్యాయ నిర్ణేతలు, కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి
ఆత్మ సాక్షిగా ఓటు వేయాలి.
రెండే టీంలు ఉన్నాయి.ఒకటి ఆరు గ్యారెంటెలు ఎగ్గొడుతున్న టీమ్.. ఒకటి, అమలు చేయాలని పోరా డుతున్న టీం. ఆరు గ్యారంటీలు అ మలు కావాలంటే, కాంగ్రెస్ మెడలు వంచాలంటే కారు గుర్తుకు ఓటు వే యాలి. సునితమ్మకు ఓటు వేయా లి. రాష్ట్ర ప్రగతికి దోహదం చేయా లి.అన్ని సర్వేలు బి ఆర్ ఎస్ గెలు స్తుందని స్పష్టం చేస్తున్నాయి సైలెం ట్ వేవ్ రాబోతున్నది జూబ్లీహిల్స్ ఎన్నికల్లో నిశ్శబ్ద విప్లవం రాబో తు న్నది. బి ఆర్ ఎస్ గెలిపించాలని జూబ్లీహిల్స్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తు న్నానని పునరుద్ఘాటించారు.
