–లక్ష్మీనరసింహస్వామి ధీవెనతో బీఆర్ఎస్‌కు పూర్వవైభవంఖాయం
–పంచాయతీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన బీఆర్ఎస్
–జిల్లా పరిషత్ ఎన్నికలకు సిద్ధం కావాలి
Ex Minister KTR : ప్రజా దీవెన యాదాద్రి భువనగిరి: బీఆర్ఎస్ పార్టీకి పూర్వవైభవం ప్రారంభమైందని, భవిష్యత్తులో సా ధించబోయే అఖండ విజయాలకు యాదాద్రి భువనగిరి జిల్లా గడ్డ పు నాది వేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆ ర్ స్పష్టం చేశారు. గురువారం ఆయ న యాదాద్రి భువనగిరి జిల్లా పార్టీ కార్యాలయంలో నూతనంగా ఎన్ని కైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యుల అభినందన సభలో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభు త్వ వైఫల్యాలను ఎండగడుతూ కా ర్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపా రు.పెద్దలు చెప్పినట్లు ఎక్కడైతే అధి కారం పోగొట్టుకున్నామో, అక్కడే వె తుక్కోవాలని, ఈరోజు సర్పంచ్ ఎ న్నికల ఫలితాలు ఆ ఉత్సాహాన్ని ఇ స్తున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. రెండేళ్ల కిందట అసెంబ్లీ ఎన్నికల్లో కొ ద్దిపాటి ఓట్ల తేడాతో నిరాశ ఎదురై నా, నేడు భువనగిరిలో 56 మంది, ఆలేరులో 74 మంది, మునుగోడు లో 15 మంది, తుంగతుర్తిలో 9 మంది, నకిరేకల్‌లో 7 మంది. ఇలా జిల్లా వ్యాప్తంగా మొత్తం 161 మం ది సర్పంచులను గెలిపించుకోవడం సామాన్య విషయం కాదని ఆయన కొనియాడారు. ఈ విజయం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులకు వెయ్యి ఏ నుగుల బలాన్ని ఇచ్చిందని, లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో గులాబీ జెండా మళ్లీ రెపరె పలా డుతుందని ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన త ర్వాత రాజకీయం అత్యంత గలీజు గా మారిందని కేటీఆర్ మండి పడ్డా రు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆ ర్ఎస్ కార్యకర్తలపై జరుగుతున్న దాడులను ఆయన తీవ్రంగా ఖండిం చారు. నూతనకల్ మండలంలో మల్లయ్య యాదవ్‌ను కిరాతకంగా చంపడం, నల్గొండలో అభ్యర్థిపై దా డి చేసి అమానవీయంగా మూత్రం తాగించి అవమానించడం వంటి ఘ టనలు కాంగ్రెస్ నాయకుల వికృత మనస్తత్వానికి నిదర్శనమని ధ్వజ మెత్తారు. పదేళ్ల పాలనలో కేసీఆర్ ఎప్పుడూ ఇలాంటి చిల్లర రాజకీ యాలకు తావివ్వలేదని గుర్తు చేశా రు.
అధికారులు కూడా అధికార పక్షాని కి కొమ్ముకాస్తూ, గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థులను దొంగతనంగా ఓడించే ప్రయత్నం చేస్తున్నారని, 150కి పై గా గ్రామాల్లో జరుగుతున్న ఈ అ న్యాయంపై కోర్టుల ద్వారా న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు.
పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యే లపై కేటీఆర్ నిప్పులు చెరిగారు. అ భివృద్ధి కోసమే కాంగ్రెస్‌లోకి వెళ్లా మని సిగ్గు లేకుండా మైకుల్లో చెబు తున్న కడియం శ్రీహరి వంటి నాయ కులు, అసెంబ్లీలో ఏ పార్టీలో ఉన్నా రో చెప్పుకోలేని హీనస్థితిలో ఉన్నా రని ఎద్దేవా చేశారు. 70 ఏళ్ల వయ సులో సంపాదించుకున్న గౌరవాన్ని రేవంత్ రెడ్డి సంకలో చేరి నాశనం చే సుకున్నారని, గబ్బిలాలు సూరు పట్టుకుని వేలాడినట్లు వీరి పరిస్థితి తయారైందని ఘాటుగా విమర్శిం చారు.
స్పీకర్ కూడా ముఖ్యమంత్రి చెప్పిన ట్లు ఆడుతూ, ఫిరాయింపులు కన పడనట్లు నటిస్తున్నారని దుయ్య బట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూడు ఫీట్లు ఉన్నా ముప్పై ఫీట్ల డైలాగులు కొడతారని, కానీ క్షేత్రస్థా యిలో ప్రజలు మోసపోయామని గ్రహిస్తున్నారని కేటీఆర్ అన్నారు. తులం బంగారం ఇస్తామని, పిం ఛన్లు పెంచుతామని లంగ మాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిం దని, ఇప్పుడు రైతుబంధు రాక రై తులు అల్లాడుతున్నారని పేర్కొ న్నారు. తినే పళ్లెంలో మన్ను పో సు కున్నామని, పాలిచ్చే బర్రెను వదిలి తన్నే దున్నపోతును తెచ్చుకు న్నా మని ప్రజలు బాధపడుతున్నారని వ్యాఖ్యానించారు.
వచ్చే జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీఆ ర్ఎస్ సత్తా చాటాలని, భువనగిరి కోటపై గులాబీ జెండా ఎగరాలని పి లుపునిచ్చారు. సర్పంచులు, ఎం పీ టీసీలు సమన్వయంతో పనిచేయా లని, పార్టీ బి-ఫామ్ మీద జరిగే ఈ ఎన్నికల్లో కారు గుర్తుకు తిరుగులేని విజయం అందించాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు ఎవరి అత్త సొమ్ము కాదని, అవి రాజ్యాం గబద్ధంగా ప్రజలకు అందాల్సిన హ క్కులని, ఏ ఎమ్మెల్యే వాటిని ఆపలేడని భరోసా ఇచ్చారు.
గత పదేళ్లలో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ, ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా సాధించిన అభివృద్ధిని కేటీఆర్ వివ రించారు. “ఒక్క మెడికల్ కాలేజీ లేని నల్గొండలో నేడు మూడు మె డికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు వచ్చాయి. యాదాద్రి లక్ష్మీనరసిం హస్వామి ఆలయాన్ని 1800 కోట్ల తో ప్రపంచస్థాయి అద్భుతంగా తీ ర్చిదిద్దిన ఘనత కేసీఆర్ గారిదే. మిషన్ భగీరథ ద్వారా ఫ్లోరోసిస్ పీడను పోగొట్టి ఇంటింటికీ కృష్ణా, గోదావరి జలాలు అందించామన్నా రు.
24 గంటల ఉచిత విద్యుత్, రైతు బంధు ద్వారా 73 వేల కోట్లు నేరు గా రైతుల ఖాతాల్లో వేసిన చరిత్ర మనది. మిషన్ కాకతీయ, డంప్ యార్డులు, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలతో మన పల్లెలను జా తీయ స్థాయిలో 30 శాతం అవార్డు లు గెలుచుకునేలా తీర్చిదిద్దిన ఏకైక నాయకుడు కేసీఆర్” అని ఆయన గర్వంగా ప్రకటించారు.సర్పంచ్ ఎ న్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ ప్రతిని ధులను కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తోం దని, దీనికి భయపడాల్సిన పని లే దని కేటీఆర్ భరోసా ఇచ్చారు. “కాం గ్రెస్ ఎమ్మెల్యేలు ఇందిరమ్మ ఇళ్లు ఇ య్యనియ్యం, పింఛన్లు ఆపుతాం అని బెదిరిస్తున్నారు. ఇవేమీ మీ అ త్త సొత్తో, అబ్బ సొత్తో కాదు.. అవి ప్రజల హక్కులు. రాజ్యాంగం ప్రకా రం సర్పంచ్‌లకు ఉన్న అధికారాల ముందు ఏ ఎమ్మెల్యే ఆటలు సా గ వు. నూతనకల్ మండలం లింగం పల్లిలో మన కార్యకర్త మల్లయ్య యాదవ్‌ను చంపినా, నల్గొండలో యాదగిరిపై అమానవీయంగా దాడి చేసినా మనోళ్లు మొక్కవోని ధైర్యం తో నిలబడ్డారన్నారు.
అధికార దుర్వినియోగంతో రీకౌం టింగ్ పేరిట మన గెలుపును దొంగి లించిన 150 గ్రామాల్లో కోర్టుల ద్వా రా న్యాయపోరాటం చేస్తాం. మీరు ధైర్యంగా ఉండండి, పార్టీ మీకు అం డగా ఉంటుందని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జ గదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్ రెడ్డి, గొంగిడి సునీత, గాదరి కిషోర్ కుమార్, చిరుమర్తి లింగ య్య, బూడిద బిక్షమయ్య గౌడ్, జి ల్లా స్థాయి ముఖ్య నాయకులు, వే లాది మంది కార్యకర్తలు పాల్గొన్నా రు.



