Monday, September 28, 2026
More
    HomeOpinionEx Minister Harish Rao : మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్, సి ద్దిపేట...

    Ex Minister Harish Rao : మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్, సి ద్దిపేట పై కాంగ్రెస్ ప్రభుత్వ కక్షసా ధింపు చర్యలు

    📰 Generate e-Paper Clip

    –బీఆర్ఎస్ కట్టిన భవనాలకు రిబ్బన్ కటింగ్ చేస్తున్నారు

    — శ్రమ మాది, శిలాఫలకం రేవంత్ రెడ్డిది పెడుతున్నారు

    –సిద్దిపేట అభివృద్ధిపై రాజకీయ కక్షతో రూ.1070 కోట్లు ర ద్దు చేశారు

    –ఎగ్గొట్టిన మూడుసీజన్ల రైతుబంధు తక్షణమే చెల్లించాలి

    –సీఎం రేవంత్ కు హరీశ్ రావు బహిరంగ లేఖ

    Ex Minister  Harish Rao : ప్రజా దీవెన, సిద్దిపేట: తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తన సిద్దిపేట నియోజకవర్గం పై కక్ష సాధింపు చర్యలతో అన్యా యం తలపెడుతున్నారని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు తీవ్రస్థాయిలో మండి పడ్డారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన నేపథ్యంలో మా జీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే త న్నీరు హరీశ్ రావు తన క్యాంపు కా ర్యాలయంలో మీడియాతో మాట్లా డారు. ఈ సందర్భంగా సీఎం పర్య టనను, సిద్దిపేట పై కాంగ్రెస్ ప్రభు త్వ కక్షసాధింపు తీరును తీవ్రంగా ఎండగడుతూ ముఖ్యమంత్రికి ఒక బహిరంగ లేఖను విడుదల చేశా రు.

    ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీ శ్ రావు చేసిన వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే….ఈ రెండున్నర సంవ త్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన లో సిద్దిపేట నియోజకవర్గానికి కొత్త గా మంజూరైన కార్యక్రమం ఒక్కటీ లేదు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేటలో ప్రారంభించబోతున్న కార్యక్రమాలన్నీ గత బీఆర్ఎస్ ప్ర భుత్వం మంజూరు చేసి, నిధులు కేటాయించి, నిర్మాణాలు పూర్తి చేసినవే.

    మాదేమో శ్రమ ఫలితం, రేవంత్ రె డ్డిదేమో శిలాఫలకం అంటూ శిలా ఫలకాల మీద నీ పేరు ఉండొచ్చు రేవంత్ రెడ్డి,కానీ, సిద్దిపేట ప్రజల మనోఫలకాల మీద ఉండేది మా త్రం కేసీఆర్ పేరే.రూ. 300 కోట్లతో నర్మెట్టలో ప్రారంభించబోతున్న ఆ యిల్ పామ్ ఫ్యాక్టరీ గత బీఆర్ఎ స్ ప్రభుత్వ ఘనతే. దేశంలోనే అ త్యుత్తమ టెక్నాలజీతో ఈ ఫ్యాక్టరీ రావడానికి, రిఫైనరీ పెట్టడానికి మే మే నిర్ణయం తీసుకున్నాం.

    టీజీఐసీ ద్వారా 62 ఎకరాల భూ మిని సేకరించి ఇచ్చాం. రైతులను స్వయంగా ఒప్పించి మొక్కలు నా టించాం.నాడు కాళేశ్వరాన్ని కూలే శ్వరం అని ఎగతాళి చేసిన రేవంత్ రెడ్డి.. ఇవాళ అదే కాళేశ్వరం జలా లతో నడిచే ఫ్యాక్టరీని ప్రారంభించ డం శోచనీయం.

    ఈ ఫ్యాక్టరీ కోసం కాలువ పొడి గిం చి 20 కోట్ల లీటర్ల సామర్థ్యం గల చెరువును నిర్మించి నీరందించింది మేమే. పక్కనే పారుతున్న కాళేశ్వ రం కాలువ నీళ్లను నెత్తిన జల్లుకు ని ఫ్యాక్టరీని ప్రారంభించు. కాళేశ్వ రం, మల్లన్న సాగర్ కట్టేటప్పుడు ప్రాజెక్టును అడ్డుకోవడానికి కోర్టుల్లో కేసులు వేసి ఎన్ని కుట్రలు చేసినా.. మొక్కవోని దీక్షతో ప్రాజెక్టును పూర్తి చేసి ఈ నేలకు జలాలను అందిం చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వా నిది. ఆరోగ్య శాఖ మంత్రిగా నాడు నేను మంజూరు చేసి, నిర్మాణాలు పూర్తి చేసిన భవనాలకు ముఖ్య మంత్రి ఇవాళ రిబ్బన్ కటింగ్ చేస్తు న్నారు.3.60 కోట్లతో సెంట్రల్ డ్రగ్ స్టోర్, రూ. 25 కోట్లతో ఆయుష్ ఆ స్పత్రి, గట్ల మల్యాలలో రూ. 1.40 కోట్లతో పీహెచ్‌సీ, సిద్దిపేట పట్టణం లో అర్బన్ పీహెచ్‌సీ భవనాలు క ట్టింది మేమే.

    ఎన్నికల కోడ్ వల్ల ప్రారంభానికి నో చుకోకపోయినా ఇప్పటికే సేవలం దిస్తున్నాయి. సిబ్బందిని నియమిం చకుండానే వాటికి శిలాఫలకాలు వే సుకోవడం సిగ్గుచేటు. దేవాలయా లు, విద్యాలయాలతో పాటు రూ. 78 కోట్లతో, 30 ఎకరాల స్థలంలో జిల్లా జైలును నిర్మించింది కూడా మేమే.అమృత్ ఫేజ్-2 కింద కేంద్రం నుంచి సాధించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు కూడా బీఆర్ఎస్ హయాంలో మంజూరైనవే. మేం కట్టిన భవనాలకు శిలాఫలకాలు వేసుకోవడానికే ఈ ముఖ్యమంత్రి పర్యటన.

    ఎన్నికల ముందు దేవుళ్ల మీద ఒ ట్లు పెట్టిన రేవంత్ రెడ్డి రుణమాఫీ పేరిట రైతులను దారుణంగా మో సం చేశారు. సిద్దిపేట నియోజక వ ర్గంలో ఇంకా 52 శాతం మందికి, అంటే 22,819 మంది రైతులకు రు ణమాఫీ కాలేదు. రూ. 300 కోట్ల బకాయిలున్నాయి. సీఎం పర్యటి స్తున్న నర్మెట్ట గ్రామంలోనే 350 మంది రైతులకు మాఫీ కాలేదు. పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయ కుండా ఏ ముఖం పెట్టుకుని సిద్దిపే ట పర్యటనకి వస్తున్నారు. వరు స గా మూడు పంటలకు రైతుబంధు ఎగ్గొట్టారు. ఆగిన మూడు సీజన్ల రైతుబంధు బకాయిలు వెంటనే వి డుదల చేయాలి.2024 – 25ఏ ప్రి ల్ నెలలో వడగండ్ల వానకు నష్టపో యిన సిద్దిపేట రైతులకు వెంటనే పంట నష్టపరిహారం, బీమా అందిం చాలి.

    ముఖ్యమంత్రి అయ్యాక సిద్దిపేట అభివృద్ధిపై కక్షగట్టి 1070 కోట్ల ప నులను రేవంత్ రెడ్డి రద్దు చేశారు. సగం పనులైన ప్రభుత్వ వెటర్నరీ కాలేజీని ఇక్కడి నుంచి తన సొంత నియోజకవర్గం కొడంగల్‌కు ఎత్తు కుపోయారు. ఇది ముఖ్యమంత్రి స్థాయికి తగిన పనేనా? సిద్దిపేట అ భివృద్ధిని అడ్డుకున్నది నేనే అని చెప్పడానికి ఇక్కడికి వస్తున్నారా?

    రంగనాయక సాగర్ టూరిజం ప్రాజె క్ట్, కోమటి చెరువుపై శిల్పారామం, సిద్దిపేట ఔటర్ రింగ్ రోడ్ , అగ్రిక ల్చర్ కాలేజీ, మిట్టపల్లి ఎస్సీ గు రు కులం, సిద్దిపేట స్పోర్ట్స్ స్టేడియం, టూ టౌన్, త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లు, సిద్దిపేట-ఇల్లంతకుంట, సిద్దిపేట -కిష్టాపూర్ ఫోర్ లేన్ రోడ్లు, ఆడిటో రియం, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పను లను అర్ధాంతరంగా ఆపేశారు.కేవలం రాజకీయ కక్షతో రద్దు చేసి న ఈ రూ. 1070 కోట్ల పనులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పునరు ద్ధరించాలని డిమాండ్ చేస్తున్నా మని హరీష్ రావు వ్యాఖ్యానిం చారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.