–ఎర్రబారిన పత్తికాయలతో దర్శన మిస్తున్న పత్తిచేలు
–పంట నష్టాన్ని అంచనాకు కదలని యంత్రాంగం
–తుంగతుర్తి ,నూతనకల్ మండ లాల ఏవో పోస్టులు ఖాళీ
–తమను ఆదుకోవాలని మొరపె ట్టుకుంటున్న రైతాంగం
Thungathurthi cotton farmers : ప్రజా దీవెన, తుంగతుర్తి: ఆరుగా లం కష్టించి పంటలు పండించి కు టుంబాలను పోషించుకునే రైతన్న ఈ ఏడాది తెల్ల బంగారంగా పిలు వబడే పత్తి పంటను నమ్ముకుని అ కాల వర్షాలతో నట్టేట మునిగా డు. పత్తి పంట ఒక ఏడాది పోయిన మ రో ఏడాది కలిసి రాకపోతుందా అ ని నమ్మకంతో సాగు చేసే రైతన్నకు ఈ ఏడాది విత్తనం వేసిన దగ్గర నుండి పత్తి చేతికొచ్చే లోపే అనేక సమస్యలు చుట్టుముట్టి పత్తి పంట చేతికి రాకపోవడంతో తలలు పట్టు కున్నారు.
విత్తనం వేసేటప్పుడు సరైన వర్షాలు సకాలంలో రాక మొల కలు సరిగా రాక నానా ఇబ్బందులు పడ్డ రైతాం గానికి తీరా కురిసిన కొద్దిపాటి వర్షా లకు మొలిచిన పత్తి చేలు పూత పూసి కాయలు కాసి పత్తి చేల కా యలు పగిలే దశలో విస్తారంగా వ ర్షాలు కురియడంతో పత్తి కాయలు చేలపైనే కొన్ని మురిగిపోగా కొన్ని ప గిలిన పత్తి ఏరడానికి వర్షాలతో తడిసి ముద్దయి ఆగమాగం కా వడం రైతులను తీవ్ర నష్టాల్లోకి నెట్టిందని చెప్పవచ్చు.
భారీ వర్షాలకు పత్తి చేలు పూర్తిగా ఎర్రబారిపోయాయి ఎర్రజక్క నెల లో కొంతమేర తట్టుకున్న రేగడి భూ ముల్లో మాత్రం పత్తి చేలు తుడిచిపె ట్టుకుపోయాయని చెప్పవచ్చు. ఏరి న పత్తి ఆరక పోవడంతో రంగు మా రడంతో మార్కెట్లో ధర లేకుండా పో యిందనేది రైతుల మాట. ఏరకుం డానే చేలల్లోనే వర్షార్పణమైన పత్తి ఎక్కడ చూసినా కానవస్తుంది.
మురిగిన కాయలు వర్షానికి తడిసి ముద్దాయి కింద పడిపోయిన పత్తి ఎర్రబారిన పత్తి తీరు రైతుల బతు కులను మసకబారించాయని చెప్ప వచ్చు. ఆర్థికంగా బలమైన దెబ్బ ప త్తి చేల వల్ల రైతులకు తగిలింది. ఎ క్కడ చూసినా పాడైన పత్తి చేలు ద ర్శనమిస్తున్నాయి. తుంగతుర్తి మం డలం లో ప్రతి సంవత్సరం మాదిరి గానే ఈ ఏడాది కూడా పత్తిని రైతు లు విస్తారంగానే సాగు చేశారు.
ప్రధానంగా పత్తి, వరి పంటలను న మ్ముకున్న రైతాంగానికి రెండు పం టలు భారీ వర్షాలకు దెబ్బతినడం తో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. పత్తి పంట కోసం ఎరువులు పురు గు మందుల దుకాణాల్లో చేసిన అ ప్పులు ఒకపక్క కుటుంబ అవసరా లు మరోపక్క రైతులను కుంగదీస్తు న్నాయి. పత్తి పంట ఏరాలంటే ఎం డలు బాగా రావాలి ఎండలు సరిగా రాకపోవడంతో పగిలిన పత్తి కా య లు సైతం వర్షంలో ఏరలేని పరిస్థి తులు దాపరించాయి.
కొంతమంది కొంతమేర పత్తి ఏరిన దిగుబడి తగ్గి రంగు మారి ధర లేక ఇబ్బందుల పాలయ్యారు .పత్తి రై తులను ఎవరిని మందలించిన తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభు త్వం పంటలు నష్టపోయిన వారికి ఆర్థిక సహాయం అందిస్తామని చెబు తున్న క్షేత్రస్థాయిలో ఇప్పటివరకు పత్తి పంట నష్టాన్ని అంచనా వేయ డానికి ఇంకా యంత్రాంగం కదిలిన ట్లు కానరావడం లేదు. ముఖ్యంగా సిబ్బంది తక్కువగా ఉండడము లే క ఇదే సమయంలో ధాన్యం కొనుగో లు సెంటర్లు ప్రారంభం కావడంతో ఉన్న వ్యవసాయ శాఖ అధికారులు ధాన్యం కొనుగోలు సెంటర్ల చుట్టూ తిరగాల్సి రావడం వలన పంటలు నష్టాల్ని అంచనా వేయలేక పో తు న్నారా అనే మాట వినవస్తుంది.
ముఖ్యంగా తుంగతుర్తి ,నూతనకల్ మండలాలకు ఏవో లు లేకపోవడం గమనార్హం. ఇద్దరు ఏవోలు కొన్ని నె లల క్రితం సస్పెండ్ చేయడంతో వా రి స్థానంలో ఇంకా కొత్తవారు రాక పోవడంతో రెండు పోస్టులు ఖాళీ గానే ఉన్నాయి. సిబ్బంది కొరత వ లన పత్తి పంట సర్వే చేయ లేక పో తున్నారా? లేక ఇంకా ప్రభుత్వ నుం డి అనుమతి రాలేదా? అనేది తెలి యాల్సి ఉంది. కానీ రైతాంగం మా త్రం తమకు ప్రభుత్వం ఏమన్నా ఆర్థిక సహాయం అందించకపోతుం దా అనే ఆశతో రైతులు ఎదురుచూ స్తున్నారు.
అధికారులు పంటల నష్టాన్ని అంచ నా వేసేది ఎప్పుడో రైతులను ఆర్థి కంగా ఆదుకునేది ఎప్పుడూ అనే మాట యావత్ రైతాంగం అంటుం ది. తమ బతుకులు బాగు చేస్తుంది అనుకునే తెల్ల బంగారం నట్టేట ముంచింది అనే మాట రైతులు అం టున్నారు. ఆర్థికంగా చితికిపోయిన తమకు ప్రభుత్వం చేయూతని అం దించాలని రైతులు కోరుతున్నారు.
